For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మాజీ ప్రియుడు/ప్రియురాలితో ఆ పని చేయడం మంచిది కాదని మీకు తెలుసా..

|

ఏ వయసులో చేయాల్సిన పని ఆ పనిలో చేయాలి. అదే సమయంలో యువకులు లేదా యువతులు సరిగ్గా ఆ సమయానికొచ్చేసరికి దాని కోసం తెగ పరితపిస్తుంటారు. ఆడ లేదా మగవారు ఈ వయసులో ఎక్కువగా ఆకర్షణకు గురవుతారు. ప్రస్తుత కాలంలో వీరి కోసం కొన్ని యాప్స్ సైతం అందుబాటులోకి వచ్చాయి. అందుకే యువత చాలా విషయాల్లో తొందర పడుతున్నారు.

Reasons Why Not To Have Sex With Your Ex

ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని బాధపడుతున్నారు. కానీ కొన్నిసార్లు చేసిన తప్పునే చేస్తున్నారు. అదేంటంటే శృంగారం. కాకపోతే కొంతమంది వారు విడిపోయినా కూడా తమ భాగస్వామితో లైంగిక సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే చాలా మంచిది. ఎందుకు కింద ఉన్న కారణాలను పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది.

ఒకటికి రెండు సార్లు ఆలోచించండి..

ఒకటికి రెండు సార్లు ఆలోచించండి..

వాస్తవానికి జీవితంలో గొప్ప సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని కలిగి ఉండటం అనేది చెడు విషయం కాదు. అయితే మీరు మాజీ భాగస్వామితో దీన్ని చేయాలనుకుంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే దీర్ఘకాలంలో ఇది ప్రమాదకరంగా ఉంటుంది. మీరు మరియు మీ మాజీ భాగస్వామి మంచి బంధాన్ని షేర్ చేసుకుంటారు. కానీ కొన్ని సమస్యల కారణాంగా మీరు విడిపోవాలని నిర్ణయించుంటారు. దీంతో వారు అకస్మాత్తుగా మీరు శారీరక సాన్నిహిత్యాన్ని కోల్పోతారు. ఇది దీర్ఘకాలంలో చేయటం చాలా ఆరోగ్యకరమైన విషయం కాదని మీకు తెలిసినా కూడా మీరు అతనితో లేదా ఆమెతో ఎలాగైనా లైంగిక సంబంధం కలిగి ఉంటారు.

ఇద్దరికీ మంచిది కాదు..

ఇద్దరికీ మంచిది కాదు..

ఏది ఏమైనా మాజీ భాగస్వామితో శృంగారం మంచిది కాదు. ఇలాంటివి చాలా సమయాల్లో మంచిగా అనిపించవు. ఎందుకంటే మీ ఇద్దరిని ఎప్పటికీ కలపలేవు. కాకపోతే మీరు ఇద్దరూ ఇష్టపడినట్లు మీరు ఒకరి జీవితంలో ఒకరు వచ్చి వెళ్లొచ్చు. మీరు ఇాలాంటి పరిస్థితులలోకి దూకబోయే ముందు వీటి గురించి బాగా తెలుసుకోవాలి.

అనవసరమైన నాటకం..

అనవసరమైన నాటకం..

మీరు మరియు మీ మాజీ భాగస్వామికి ఇలాంటి విషయాల్లో ఎలాంటి భావోద్వేగ బంధం ఉండదని మీరు అనుకోవచ్చు. అందువల్ల మీరు అద్భుతమైన శృంగార జీవితాన్ని పొందవచ్చు. కానీ ఇది అవాంఛిత నాటకానికి దారి తీస్తుందని మీరు తెలుసుకోవాలి. అక్కడ మీ ఇద్దరిలో ఎవరైనా కొన్ని భావోద్వేగాలను పెంచుకోవచ్చు. దీంతో మీ ఇద్దరిలో ఎవరో ఒకరు తిరిగి రిలేషన్ షిప్ కావాలని కోరుకుంటారు. అలాగే, మీలో ఎవరైనా ఇంకా ఎవరితో అయినా రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తే, అవతలి వ్యక్తి మిమ్మల్ని అస్యహించుకోవచ్చు. ఇది అనవసరమైన నాటకానికి దారి తీస్తుంది.

తర్వాత చింతిస్తారు..

తర్వాత చింతిస్తారు..

మీరు మీ మాజీ భాగస్వామితో శృంగార సంబంధం కలిగి ఉండటాన్ని ఆనందించవచ్చు. విడిపోయిన తర్వాత మీరు తప్పిపోయింది ఇదేనని అనుకోవచ్చు. కానీ వీటి నుండి ఎదురయ్యే పరిణామాలను తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే దాని వల్ల మీరు భవిష్యత్తులో చింతిస్తారు. మీ మాజీ భాగస్వామి ఇలాంటివి సద్వినియోగం చేసుకోవచ్చు. మీ మాజీలు ఎలాంటి డిమాండ్లు చేయకుండా మీతో శృంగార సంబంధం కలిగి ఉండటం మీకు సంతోషంగా అనిపించవచ్చు. మీ మాజీ భాగస్వామి శృంగారం తర్వాత బయటికి వెళ్లడం, ఇతర సన్నిహితులతో కూడా అలాగే ఉంటే మీకు అవమానకరంగా అనిపిస్తుంది. అలా కొన్ని సమయాల్లో, మీ మాజీ భాగస్వామి మీకు బాధ కలిగించే పాత విషయాలను అనవసరంగా రేకెత్తవచ్చు.

ముందుకు సాగడం కష్టం..

ముందుకు సాగడం కష్టం..

మన దేశంలో చాలా మంది విడిపోవడానికి రకరకాల కారణాలు వెతుక్కుంటారు. మీరు మీ మాజీతో లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని జీవితంలో ముందుకు సాగకుండా చేసే అవకాశముంది. మీరు కోరుకోకపోయినా, మీ సంబంధాన్ని ముగించిన కారణాల గురించి మీరు మరోసారి పునరాలోచనలో పడొచ్చు. అలాగే కొత్తవారిని కనుగొనటానికి లేదా వేరొకరితో డేట్స్ కు వెళ్లడానికి మీకు మంచి ఫీలింగ్ కూడా రాకపోవచ్చు.

6) సమస్యలు రావచ్చు..

6) సమస్యలు రావచ్చు..

ఇలాంటి శృంగార సంబంధాలు మీకు సమస్యలను ఏర్పరుస్తాయి. మీరు మీప్రస్తుత భాగస్వామిని ప్రేమిస్తున్నా కూడా మీ జీవితమంతా అతనితో లేదా ఆమెతో గడపాలని భావిస్తున్నప్పటికీ, మీ మాజీ భాగస్వామితో శారీరక సంబంధంలో పాల్గొనడం మీ రిలేషన్ షిప్ కు చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీ ప్రస్తుత భాగస్వామి మీ మాజీతో మీరు శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు తెలుసుకుంటే అతను లేదా ఆమె మీపై పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

7) మానసికంగా అస్థిరంగా అనిపించవచ్చు.

7) మానసికంగా అస్థిరంగా అనిపించవచ్చు.

మీరు మరియు మీ మాజీ భాగస్వామి మధ్య ఎలాంటి పరిస్థితుల్లోనూ భావోద్వేగాలు రాకూడదని మీరు నిర్ణయించుకున్నా కూడా భావోద్వేగాలు మిమ్మల్ని బాగా దెబ్బ తీస్తాయి. మీరిద్దరూ గతంలో కలిసి ఉన్న కారణంగా మీరు వర్తమానంలో తీవ్ర నిరాశకు గురవుతారు. మీ మాజీ భాగస్వామి మిమ్మల్ని లైంగిక భాగస్వామిగా చూడవచ్చు. శృంగారం తర్వాత ఇతర వ్యక్తులతో ఉండటానికే మొగ్గు చూపుతారు. అదే సమయంలో అతను లేదా ఆమె ఎవరితో అయినా డేటింగ్ చేయవచ్చు. లైంగిక అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ వద్దకు వస్తారు. అందువల్ల ఇది మీ భాగస్వామి తన జీవితంలో అంతరాలను పూరించడానికి ఉపయోగించే పిల్లర్ లాగా మీకు అనిపిస్తుంది. అతను లేదా ఆమె వారి శృంగారం అవసరాలు తీర్చుకున్నాక, వారు మిమ్మల్ని వదిలిపెట్టి వారి దారు వారు చూసుకుంటారు.

8) జారే వాలు లాంటిది..

8) జారే వాలు లాంటిది..

మీ మాజీ భాగస్వామితో శృంగార సంబంధం కలిగి ఉండటం ఒక జారే వాలు లాంటిది. అలాంటి దారిలో ఉండటం మంచిది కాదు. అది కేవలం కొంతసేపు మాత్రమే ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. కానీ మీరు రిలేషన్ షిప్ లో సంతోషంగా ఉంటే అది ప్రభావం చూపే అవకాశముంది.

English summary

Reasons Why Not To Have Sex With Your Ex

You and your ex-partner may have shared a great bond but decided to part ways due to some issues, and now all of a sudden you have started missing the physical intimacy that you shared with your ex. Even if you know that this is not a very healthy thing to do in the long run, but you end up having sex with him/her anyway.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more