Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
లైఫ్ పార్ట్‌నర్‌తో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఇలా ఏర్పరచుకోండి
మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన, విజయవంతమైన సంబంధాన్ని సృష్టించడానికి సమయం, కృషి, నిబద్థత అవసరం. మీ సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడే అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సంబంధం అనేది ప్రయాణం లాంటిది. ఆ జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, సుఖదుఃఖాలు, కష్టనష్టాలు ఉంటాయి. వాటన్నింటిని దాటుకుంటూ ముందుకు సాగడమే నిజమైన సంబంధం. అయితే సంబంధం సాఫీగా సాగాలంటే ఇద్దరు భాగస్వాముల కృషి ఎంతో అవసరం. దానికోసం ఎంతో సమయం వెచ్చించాలి. నిబద్ధతో ఉండాలి. ప్రేమ చూపించాలి. అప్పుడే సంబంధంలో సంతోషంగా ఉండొచ్చు. ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి అన్ని రకాల భావోద్వేగ, శారీరక, మానసిక పోరాటాల ద్వారా భాగస్వామికి మద్దతునిచ్చేంత వరకు మనం బాగా అర్థం చేుకున్నామని నిర్ధారించుకోవాలి.

మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన, విజయవంతమైన సంబంధాన్ని సృష్టించడానికి సమయం, కృషి, నిబద్థత అవసరం. మీ సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడే అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయాలి:
ఏదైనా ఆరోగ్యకరమైన సంబంధానికి కమ్యూనికేషన్ పునాది. మనసులోని మాటను, భావోద్వేగాన్ని, ప్రేమను వ్యక్తం చేయడానికి కమ్యూనికేషన్ చాలా కీలకం. సంబంధంలో ఉన్నప్పుడు మీ ప్రతి ఫీలింగ్ ను భాగస్వామితో పంచుకోవాలి. వారు చెబితే శ్రద్ధగా వినాలి. అప్పుడే అపర్థాలు ఉండవు.
ప్రశంసించాలి, కృతజ్ఞత చూపాలి:
భాగస్వామిని ప్రశంసించడం, సందర్భం వచ్చినప్పుడు కృతజ్ఞత చూపడం సంబంధాన్ని బలోపేతం చేయడంలో దోహదపడుతుంది. ప్రశంసల ద్వారా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
నాణ్యమైన సమయం గడపాలి:
మీరెంత బిజీగా ఉన్నా.. లైఫ్ పార్ట్‌నర్‌తో నాణ్యమైన సమయం గడపాలి. కలిసి కబుర్లు చెప్పుకోవాలి. వాకింగ్, జాగింగ్, జిమ్ కలిసి చేయడం అలవాటు చేసుకోవాలి.
ఆప్యాయత చూపాలి:
ఆప్యాయత చూపాలి, వాత్సల్యాన్ని ప్రదర్శించాలి. దీని వల్ల భాగస్వామితో మానసిక బంధం బలపడుతుంది. ఇద్దరి మధ్య స్పార్క్‌ను సజీవంగా ఉంచడానికి అప్పుడప్పుడు చిలిపి పనులు చేస్తుండాలి. చేసే పనికి రొమాన్స్ ను జోడించాలి.
సాన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి:
ఏదైనా ఆరోగ్యకరమైన సంబంధంలో సాన్నిహిత్యం చాలా కీలకం. సాన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధంలో దాని కోసం సమయాన్ని కేటాయించాలి. ఒకరి అవసరాలు, కోరికలు, సరిహద్దులను అన్వేషించడానికి సమయాన్ని వెచ్చించాలి.
విశ్వసించడం నేర్చుకోవాలి:
ఏ సంబంధానికి అయినా నమ్మకం కీలకం. నమ్మకాన్ని పెంపొందించడానికి సమయం పడుతుంది. భాగస్వామితో నిజాయితీగా ఉండాలి. నమ్మకం కోల్పోయినప్పుడు క్షమించి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉండాలి.
భాగస్వామ్య లక్ష్యాలు పెట్టుకోవాలి:
దంపతులు ఇద్దరికి ఒకేరకమైన లక్ష్యాలు ఉంటే వారి సంబంధం కలకాలం ఉంటుంది. భవిష్యత్తు కోసం లక్ష్యాలను కలిగి ఉండటం సంబంధాన్ని చాలాకాలం పాటు సాగనిస్తుంది.
మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి:
ఆరోగ్యకరమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి ముందుగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సొంత శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ధారించుకోవాలి. మీకు సంతోషాన్ని కలిగించే పనులను చేయడానికి సమయాన్ని వెచ్చించాలి.
భాగస్వామితో ఆరోగ్యకరమైన, విజయవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సమయం, కృషి, నిబద్థత చాలా అవసరం. సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం, ప్రశంసించడం, కృతజ్ఞత చూపడం చాలా అవసరం. భాగస్వాములు ఇద్దరూ నాణ్యమైన సమయాన్ని గడపాలి. ఆప్యాయత చూపాలి, సాన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకరినొకరు విశ్వసించడం నేర్చుకోవాలి. ఇద్దరికి ఒకేరకమైన లక్ష్యాలు ఉంటే వారి బంధం కలకాలం ఉంటుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం వంటివి మీ సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడే ప్రధాన మార్గాలు.



Click it and Unblock the Notifications