For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ప్రత్యేక పద్ధతులు పాటిస్తే... మీ పార్ట్ నర్ ను ఈజీగా మూడ్ లోకి తీసుకురావొచ్చు...!

|

పెళ్లయిన ప్రతి ఒక్క అమ్మాయి తన భర్త తనను మాత్రమే పిచ్చిగా ప్రేమించాలని.. వేరే ఇతర అమ్మాయిల గురించి అస్సలు పట్టించుకోకూడదని.. తన భర్త తనకే సొంతం అని భావిస్తూ ఉంటుంది.

పెళ్లయిన కొత్తలో భార్యభర్తలిద్దరూ కూడా ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనంతా కేరింగ్ తీసుకుంటారు. ఒకరి ఇష్టయిష్టాలను తెలుసుకుని నడుచుకుని భాగస్వామితో మంచి మార్కులు కొట్టేందుకు ప్రయత్నిస్తారు.

కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మగాళ్లు ఆ కార్యం గురించి ఆసక్తిని తగ్గించుకుంటారు. లైంగిక సంబంధాలంటే బోరింగ్ ఫీల్ అవుతూ ఉంటారు. కాలక్రమంలో మార్పులు, పని ఒత్తిడి ఇతర కారణాల వల్ల వీరికి తమ భాగస్వామిపై ప్రేమ మరియు ఆకర్షణ తగ్గుతూ వస్తుంది.

అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల భార్యభర్తల సంబంధంపై చెడు ప్రభావం పడుతుంది. అయితే మీ కాపురంలో అలా జరగకుండా ఉండాలంటే.. మీ భాగస్వామిని సులభంగా మూడ్ లోకి తీసుకురావాలంటే కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటించాలి. అప్పుడు మీ శ్రీవారిని చాలా ఈజీగా మూడ్ లోకి తీసుకురావచ్చు. వారి బోరింగ్ మానసిక స్థితిని శృంగారభరితంగా మార్చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లి తర్వాత సెక్స్ లైఫ్ గురించి ఎక్కువమంది అబద్ధాలే చెబుతారని మీకు తెలుసా...!

సడెన్ గా కిస్ చేయడం..

సడెన్ గా కిస్ చేయడం..

ముద్దు పెట్టుకోవడం అంటే మన భావాలను వ్యక్తపరచడం. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే మీ భర్తకు తెలియకుండా సడెన్ గా ఓ కిస్ చేయాలి. అలాంటి వాటిని మగవారు బాగా ఇష్టపడతారు. ఇలా చేస్తే మీ పార్ట్ నర్ అతి తక్కువ సమయంలోనే మీపై ప్రేమ, ఆసక్తిని పెంచుకోవడమే కాదు.. తను కూడా మీకు తిరిగి కిస్ చేయడం వంటివి చేస్తారు.

మసాజ్

మసాజ్

మసాజ్ అనేది మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి మరియు ఒకరినొకరిని మరింత దగ్గర చేసే మరో మంచి మార్గం. అయితే మసాజ్ చేసే సమయంలో, బ్యూటిఫుల్ మ్యూజిక్ ప్లే చేయండి. అప్పుడు మీ భాగస్వామికి ఎక్కడ మసాజ్ చేస్తే మూడ్ వస్తుందో తెలుసుకోండి. దీని కోసం, ఒకరికొకరు పరిపూర్ణమైన మరియు పూర్తి శరీరానికి మసాజ్ చేయవలసిన అవసరం లేదు, మెడ మరియు వెనుక భాగంలో మసాజ్ చేయండి. మీరిద్దరూ కలిసి మసాజ్ చేసుకునేటప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. అంతేకాదు మీరిద్దరూ ఆ సమయంలో చాలా ఉత్సాహంగా మరియు రిలాక్స్ గా ఉంటారు.

మీరే చొరవ తీసుకోండి

మీరే చొరవ తీసుకోండి

ప్రతిసారీ మగాళ్లు మీ గురించి కాకుండా వేరే ఆలోచనలో ఉంటే, వారిని మీ వైపు తిప్పుకోవడానికి మీరే శృంగార కార్యానికి చొరవ తీసుకోవాలి. ముఖ్యంగా శృంగార కార్యంలో పాల్గొనేందుకు వారిని ప్రేమగా ఆహ్వానించండి. మీరు సెక్సీగా వారికి ఇలాంటి ఆఫర్లు ఇస్తే వారు అస్సలు వాటిని తిరస్కరించలేరు.

ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!

శృంగార విందును ప్లాన్ చేయండి

శృంగార విందును ప్లాన్ చేయండి

ఇలాంటివి కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతాయని అస్సలు అనుకోవద్దు. సాధారణంగా సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. రొమాంటిక్ గా ఉండటం కూడా ఒక సినిమా. మీ జీవితాన్ని బోరింగ్ లేదా ఉత్సాహంగా మార్చడం అనేది మీ చేతుల్లోనే ఉంది. అటువంటి పరిస్థితిలో, ప్రతిరోజూ కాకుండా, వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మీరు శృంగార విందును ప్లాన్ చేయవచ్చు. మీ భర్త ఇష్టపడే వంటకం తయారు చేసి, వాటిని మీ చేతులతో తినిపించండి. మీరు మీ ఇంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేయవచ్చు. ప్రస్తుతం కరోనా పూర్తిగా కనుమరుగు కాలేదు కాబట్టి బయటికెళ్లి చేయడం కంటే.. ఇంట్లోనే శృంగార విందు ప్లాన్ చేసుకోవడం బెటర్.

గట్టిగా కౌగిలించుకోవడం..

గట్టిగా కౌగిలించుకోవడం..

మీ భాగస్వామికి కొన్నిసార్లు గట్టిగా కౌగిలించుకోవాలి. అదెలా అంటే మీ కౌగిలి బంధి అయిపోయితే తనకు హాయిగా అనిపించాలి. హీరోయిన్ కాజల్ కూడా తన భర్తకు ప్రతిరోజూ ఉదయాన్నే ప్రేమగా ఓ హగ్ ఇస్తుందట. ఎప్పుడూ పడకగదిలోకి వెళ్దామా? హాయిగా నిద్రిద్దామా అనే ఆలోచనను పక్కనబెట్టండి. ఒకరితో ఒకరు దగ్గరగా మాట్లాడండి. మీ మనసులో ఉన్న కోరికలు, భయాల గురించి మీ శ్రీవారితో చర్చించండి. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి మానసిక స్థితి మారిపోతుంది.

సెక్సీ పోజ్ ఇవ్వండి

సెక్సీ పోజ్ ఇవ్వండి

మీ శ్రీవారు ఎక్కడికైనా బయటకు వెళ్లి అలసిపోయి వచ్చినప్పుడు, వారికి వెంటనే మాంచి మూడ్ తెప్పించడానికి, మీ భర్తకు ఇష్టమైన కలర్ లాంజర్ ధరించి ఆశ్చర్యపర్చండి. మీరు కావాలంటే, రాత్రిపూట సన్నిహిత సెక్సీ పోజులు ఇవ్వడం ద్వారా మీరు వారి మానసిక స్థితిని రొమాంటిక్ గా మార్చేయవచ్చు.

వ్యామోహం సృష్టించండి..

వ్యామోహం సృష్టించండి..

మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని తాజాగా ఉంచడానికి, చెట్లను పచ్చగా ఉంచడానికి పాత జ్ఞాపకాలను కంపోస్ట్ మరియు నీరు వంటి రీసైకిల్ చేయడం చాలా ముఖ్యం అని అంటారు. అందువల్ల, పాత జ్ఞాపకాలను పునరుద్ధరించండి. మీరు మీ శ్రీవారిని మొదటిసారి ఎలా కలుసుకున్నారో, మొదటి ముద్దు, మొదటి రాత్రి మరియు ఒకరికొకరు మొదటి వాగ్దానం గురించి వారికి గుర్తు చేస్తూ ఉండండి. ఇలాంటి పనులు చేయడం వల్ల మీ శ్రీవారి మనసులో కొత్త ఉత్సాహం రేకేత్తుతుంది.

English summary

Ways to romance with your husband in Telugu

Check out the ways to romance with your husband in Telugu. Read on,