For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Old Age romantic tips: ఈ చిట్కాలు పాతవే.. కానీ మీ లవర్ ను ఇంప్రెస్ చేయొచ్చు

ప్రేమ ఓ అందమైన భావన. దానిని మాటల్లో చెప్పలేం. చేతలతో చూపించాల్సిందే.. మనసుతో అనుభవించాల్సిందే.

|

Old Age romantic tips: ప్రేమ ఓ అందమైన భావన. దానిని మాటల్లో చెప్పలేం. చేతలతో చూపించాల్సిందే.. మనసుతో అనుభవించాల్సిందే. ప్రేమ నిజంగా ఓ మత్తు లాంటిదే. కానీ ఆ మత్తు తలలోనిది కాదు.. మనసులోనిది. ప్రేమ అంటే అదీ.. ఇదీ.. అని కొందరు దానిని వర్ణించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆ వర్ణన ఏమంత మధురంగా ఉండదు. ప్రేమలోని నిజమైన మాధుర్యం తెలుసుకోవాలంటే ప్రేమించాల్సిందే.. ప్రేమను పంచాల్సిందే.

Old Age romantic tips that still workout in this modern days in Telugu

ఇప్పుడు ప్రేమ అంటే అంతా డిజిటల్ అయిపోయింది. మనసులోని కొన్ని వ్యాఖ్యలను వాట్సాప్ చేయడం లేదా, ఇన్ స్టాలోనో, ఫేస్ బుక్ వాల్ మీదో రాయడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. అలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేసి చూడండి. మీ లవర్ ను ఇంప్రెస్ చేయడానికి కొత్త మార్గాలు అన్వేషించండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నానుడి మీకు గుర్తుంటే.. ఓల్డేజ్ రొమాంటిక్ టిప్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఫాలో అవ్వండి. మీ లవర్ ను ఇంప్రెస్ చేయండి.

1. ఆహారం కోసం మూడ్ క్రియేట్ చేయండి

1. ఆహారం కోసం మూడ్ క్రియేట్ చేయండి

ఆహారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే దానినే మీ లవ్ ఎక్స్ ప్రెస్ చేయడం కోసం వాడుకుంటే సరి. క్యాండిల్ లైట్ డిన్నర్ అనే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మీరు ప్రేమించే వారిని, మంచి రుచికరమైన ఆహారం దొరికే చోటుకు తీసుకువెళ్లండి. చుట్టూ వాతావరణ ఆహ్లాదకరంగా, హృద్యంగా ఉండేలా చూసుకోండి. ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా డెజర్ట్‌లు లేదా పిజ్జాను పంపించే బదులు.. మీరే చెఫ్ అవతారం ఎత్తండి. ఆమెకు ఏది ఇష్టమో తెలుసుకుని దానిని వండటానికి ప్రయత్నించండి. మీరు ఆమె నచ్చే విధంగా చేయలేకపోతే.. మంచి టీ లేదా కాఫీ చేసివ్వండి.

2. చేతితో రాసిన లెటర్స్, నోట్స్

2. చేతితో రాసిన లెటర్స్, నోట్స్

లవ్ లో ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ షేక్స్ పియర్ గా మారాల్సిన అవసరం లేదు. కవులు కానక్కర్లేదు. మీకు ప్రేమ ఉండి, దానిని వ్యక్తం చేయాలన్న తపన ఉంటే చాలు. మీరేం అనుకుంటున్నారో ఓ చిన్న కాగితంపై మీరే రాసి ఇవ్వండి. హ్యాండ్ రైటింగ్ బాగుండదని అనుకోవద్దు.. ఏమి రాయాలా అని తెగ ఆలోచించవద్దు. మీరేం అనుకుంటున్నారో రెండు, మూడు ముక్కల్లో రాసి ఇవ్వండి. వాటి విలువ మీకు ఇప్పుడు తెలియదు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ లెటర్స్, నోట్స్ మీకు ఎక్కడైన కనిపించినప్పుడు.. వాటి విలువ ఎంతో అప్పుడు మీకు అర్థం అవుతుంది. అవి ఇచ్చే జ్ఞాపకాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.

3. ఫోన్లు లేని డేట్ నైట్

3. ఫోన్లు లేని డేట్ నైట్

ఫోన్లు లేకుండా మీరు మీకు ఇష్టమైన వారితో గడపండి. మాటిమాటికి ఫోన్లు తీస్తూ ఉండే, ఫోన్ స్క్రీన్ పైనే వేళ్లు ఆడించే ఈ రోజల్లో ఫోన్ లేకుండా ఉండటం కష్టంగా అనిపించొచ్చు. కానీ అది ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. ఫోన్లు లేకుండా, ఒకవేళ ఉన్నా.. వాటి వైపు చూడకుండా మీ లవర్ పైనే శ్రద్ధ పెట్టండి. వారిలోని భావాలను కళ్ల ద్వారా చదవండి. వారితో కంపెనీని ఆస్వాదించండి.

4. రేడియోలో పాట కోసం రిక్వెస్ట్ చేయండి

4. రేడియోలో పాట కోసం రిక్వెస్ట్ చేయండి

ఈ చిట్కా డై-హార్డ్ రొమాంటిక్ పర్సన్స్ కోసం. వారికి ఇష్టమైన ఒక పాటను మీరు ఎఫ్ఎం లో ప్లే చేయమని వారిని కోరండి. ఈ చిట్కా చాలా పాతదే. కానీ ఎప్పటికీ వర్కవుట్ అయ్యే చిట్కా. ఎఫ్ఎం లో పాటలు వినే వారికి ఇలా వారికి ఇష్టమైన సాంగ్ వస్తున్నప్పుడు వారిలో వచ్చే ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. వారితో ఉన్నప్పుడే ఈ చిట్కా పాటించి చూడండి. రేడియోను ప్లే చేద్దాం అని మీ లవర్ ను అడిగి చూడండి. వారిని ఆశ్చర్యానికి గురిచేయండి. ఆమె కోసం ప్లే చేస్తున్న మీ పాట అభ్యర్థనతో ఆమె స్వంత పేరు మరియు మీ పేరు వినడానికి ఆమెను అనుమతించండి. కౌగిలింతల నీటి కుంటలు అనుసరిస్తాయి.

English summary

Old Age romantic tips that still workout in this modern days in Telugu

read on to know Old Age romantic tips that still workout in this modern days in Telugu
Desktop Bottom Promotion