Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
లంకలో ఉండగా.. రావణాసురుడు సీతను ముట్టుకోకపోవడానికి కారణం ఇదే..!
రామాయణం గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. రామాయణంలోని పూర్తి విషయాలు తెలియకపోయినా రాముడు వనవాసానికి వెళ్లడం, అక్కడే రావణాసురుడు సీతాదేవిని అపహరించడం, ఆంజనేయ స్వామి సాయంతో శ్రీరామ చంద్రుడు సీతాదేవిని తిరిగి తన వద్దకు తెచ్చుకోవడం అందరికీ తెలిసిందే.
అయితే సీతాదేవిని రెండేళ్ల పాటు లంకలో బంధీగా ఉంచిన రావణాసురుడు సీతాదేవిపై మాత్రం చేయి వేయలేదు. ఆమె అంగీకరిస్తేనే ఆమెను ముట్టుకుంటానని చెప్పాడు. అయితే అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సీతాదేవికి త్రిజట చెప్పిన కథ:
రావణాసురుడు సీతాదేవిని లంకలో బంధించినప్పుడు ఆమెను చూసుకోవడానికి ఇద్దరు రాక్షసులను నియమించాడు. అయితే అందులో ఒకరి పేరు త్రిజట. ఆశోకవనంలో త్రిజటతో పాటు మరో రాక్షస ప్రాణి కూడా ఉండేది. రాక్షస జీవి సీతను నిరంతరం భయపెడతూ.. రావణుడిని పెళ్లి చేసుకోవాలని వేధించేది. కానీ త్రిజట మాత్రం చాలా మంచిది. సీతా దేవి పట్ల చాలా దయతో ఉండేది. సీతాదేవికి ఆమె సాయం చేస్తూ.. ప్రేమగా మాట్లాడేది. రాముడికి సంబంధించిన కొన్ని వార్తలను మోసుకొస్తూ.. సీతా దేవికి అండగా నిలబడేది.
ఈక్రమంలోనే అప్పుడప్పుడూ సీతాదేవి రావణాసురుడు వచ్చి తనను ఏమైనా చేస్తాడని భయపడుతుంటే.. రావణాసురుడు నిన్ను ఎప్పటికీ తాకలేడని, నీకు ఇష్టం లేకుండా అతను నిన్ను ముట్టుకునే సాహసం కూడా చేయలేడని చెప్పింది. అది విన్న సీతను అపనమ్మకంగా చూస్తుంటే.. రావణాసురుడు సీతకు ఇష్టం లేకుండా ఎందుకు ముట్టుకునే ప్రయత్నం చేయడో సవివరంగా వివరించింది. కుబేరుడి కొడుకు నల కుబేరుని భార్య అయిన వనదేవత రంభను రావణాసురుడు కామంతో తాకి వినాశనానికి గురైన కథను చెబుతుంది.
రావణ బ్రహ్మ రంభను తాకినప్పుడు..
ఓసారి రావణ బ్రహ్మ రంభను తాకడానికి వెళ్తాడు. ఆమెకు ఇష్టం లేకుండా రావణాసురుడు ఆమెపై చేయి వేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. ఓ శాపం విధిస్తుంది. ఏ స్త్రీకి అయినా సరే ఇష్టం లేకుండా రావణాసురుడు ఆమెను తాకే ప్రయత్నం చేస్తే ఆమె బూడిద అవుతుందని రంభ శపిస్తుంది. రావణాసురుడు ఇదే భయంతో సీతాదేవిని ఏమీ చేయడు. ఆమె అంగీకరించే వరకు వేచి చూడాలనుకున్నాడు. కానీ తమ భర్త మీద ఉన్న ప్రేమ, నమ్మకంతో సీతా దేవి ఏనాడు రావణాసురుడిని కన్నెత్తి కూడా చూడలేదు. మాట్లాడాల్సిన వచ్చిన సందర్భంలో గడ్డిపోచను చూసే మాట్లాడుతుంది తప్పా.. రావణాసురుడిని నేరుగా చూసి మాట్లాడదు.



Click it and Unblock the Notifications
