For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Basant Panchami 2023: వసంత పంచమి లేదా సరస్వతీ పూజ ఎప్పుడు?పూజకు శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత

Basant Panchami 2023: వసంత పంచమి లేదా సరస్వతీపూజ ఎప్పుడు?పూజకు శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత

|

Basant Panchami 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం, వసంత పంచమిని ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. వసంత పంచమి పండుగ రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. . చదువుల తల్లి సరస్వతి దేవిని ఆరాధిస్తే మంచి జ్ఝానం, చదవు వస్తుందని నమ్ముతారు. వసంత పంచమి రోజున సరస్వతి దేవి ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ సంవత్సరం బసంత్ పంచమి పండుగను 26 జనవరి 2023 న జరుపుకుంటారు. ఈ రోజున విద్యకు మూల దేవత అయిన సరస్వతి దేవిని పూజిస్తారు. బసంత్ పంచమిని చాలా ప్రదేశాలలో శ్రీ పంచమి అని, మరికొన్న ప్రదేశాలలో సరస్వతి పంచమి అని కూడా పిలుస్తారు. అక్షర అభ్యాసం, విద్యా ప్రారంభం, యాత్ర హాసన్ అనగా పిల్లల విద్యకు సంబంధించిన ఈ పనులు బసంత్ పంచమి రోజున నిర్వహించబడే అత్యంత ప్రసిద్ధ ఆచారాలలో ఒకటి.

వసంత పంచమి శుభ సమయం

వసంత పంచమి శుభ సమయం

మాఘ మాసం అంటే వసంత పంచమి జనవరి 25 మధ్యాహ్నం 12.34 గంటలకు ప్రారంభమై జనవరి 26 ఉదయం 10.28 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, వసంత పంచమిని జనవరి 26న జరుపుకుంటారు. జనవరి 26 న, వసంత పంచమి పూజకు అనుకూలమైన సమయం ఉదయం 07:07 నుండి మధ్యహ్నానం 12:35 వరకు ఉంటుంది.

వసంత పంచమి 2023 సరస్వతి పూజ ముహూర్తం

వసంత పంచమి 2023 సరస్వతి పూజ ముహూర్తం

వసంత పంచమి, జనవరి 26, 2023, సరస్వతి దేవి ఆరాధనకు అనుకూలమైన సమయం ఉదయం 07:07 నుండి మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది.

వసంత పంచమి పూజా విధానం:

వసంత పంచమి పూజా విధానం:

వసంత పంచమి వసంత రుతువు ప్రారంభాన్ని సూచిస్తుంది, కాబట్టి, ఆ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ దేవిని పూజించాలి.

ముఖ్యంగా సరస్వతీ దేవికి ఇష్టమైన తెలుగు పరంగు పువ్వులు, పసుపు రంగు పువ్వులతో పూజచేయాలి.

అక్షతలు, తెల్ల చందనం లేదా పసుపు, పసుపు గులాబీలు, ధూపం, దీపం, వాసన మొదలైన వాటితో పూజచేయండి.

సరస్వతీ మాతకు బంతి పువ్వుల మాల ధరించండి. అలాగే నైవేద్యంగా పసుపు రంగులో స్వీట్ చేసి సమర్పించాలి.

ఆ తర్వాత సరస్వతి దేవీ మంత్రాన్ని చదవండి. మీరు కావాలంటే, మీరు పూజ సమయంలో సరస్వతీ కవచాన్ని కూడా పఠించవచ్చు.

ఈ వసంత పంచమి రోజున పూజా సమయంలో సరస్వతీ దేవి ముందు పుస్తకాలు, పెన్నులు, సంగీత వాయిద్యాలను ఉంచి పూజ చేయాలి. ముఖ్యంగా పిల్లలకు ఈ పూజ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించాలి.

అలాగే పూజ తర్వాత పసుపు వస్తువులను దానం చేయండి. పిల్లలకు విధ్యను ఆరంభించడానికి వసంత పంచమి ఒక శుభ సమయం. ఈ రోజున ఏదైనా శుభకారాన్ని ప్రారంభించడం వల్ల మంచి అభివ్రుద్ది ఉంటుందని , సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు.

వసంత పంచమి ప్రాముఖ్యత

వసంత పంచమి ప్రాముఖ్యత

వసంత పంచమిని శ్రీ పంచమి, జ్ఞాన పంచమి అని కూడా పిలుస్తారు. వసంత పంచమి రోజు నుండి వసంత రుతువు ప్రారంభం అవుతుందని చెబుతారు. ఈ రోజుతో చలికాలం ముగుస్తుంది. ఈ రోజున జ్ఞాన మరియు సంగీత సరస్వతీ దేవిని పూజింపడం వల్ల వ్యక్తిలో మంచి తెలివి తేటలు పొందుతారు. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజించడం వల్ల లక్ష్మి దేవితో పాటు, కాళీకా దేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. అలాగే ఈ వసంత పంచమి నాడు ఏదైనా శుభకార్యం తలపెట్టిని అది సక్సెస్ అవుతుందనికి చాలా మంది నమ్మకం. ముఖ్యంగా వసంత పంచమి నుండి పిల్లల విధ్యాభ్యాసం ప్రారంభమవుతుంది.

వసంత పంచమి నాడు పసుపు రంగు ప్రాముఖ్యత

వసంత పంచమి నాడు పసుపు రంగు ప్రాముఖ్యత

పసుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. వసంత పంచమి పండుగతో ప్రారంభమయ్యే వసంత ఋతువులో, పొలాల్లో పూలు, ఆవాలు మరియు గోధుమ పంటలు వికసించడం ప్రారంభిస్తాయి. ఇది కాకుండా, రంగురంగుల సీతాకోకచిలుకలు పొలాల్లో కనిపించడం ప్రారంభిస్తాయి మరియు ఇది పర్యావరణానికి అందాన్ని జోడిస్తుంది. అందుకే ఈ రోజున పసుపు రంగుకు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఈ పండుగను చాలా చోట్ల ఋషి పంచమి అని కూడా అంటారు.

English summary

Basant panchami 2023 date time, shubh muhurat, history, puja vidhi and significance in telugu

Basant panchami 2023 date time, shubh muhurat, history, puja vidhi and significance in telugu
Desktop Bottom Promotion