For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహా శక్తివంతమైన మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏమౌతుంది.?

|

ఆధ్యాత్మిక పరివర్తన సమర్థతగలదిగా పరిగణించే ధ్వని, అక్షరం, పదం లేదా పదసమూహాన్ని మంత్రం అంటారు. మంత్రంతో సంబంధం ఉన్న సంప్రదాయం, వేదాంతాల ప్రకారం వాటి వాడుక విధాలలో మార్పులు ఉంటాయి.

మనసును ప్రక్షాళనం చేసి, నైర్మల్యం కలిగించే ముఖ్య పరికరాలు మంత్రాలు. జన్మగత వాసనలతో, మనలను కట్టి పడవేసి, ఆచేతన, సుప్తచేతన ఆలోచనల, కోరికలను చేధించడానికి మంత్రం సహాయపడుతుంది. మంత్రం మన మనసు పొరల్లో దాగియున్న పలురకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది. సక్రమంగా, మనస్సాక్షిగా, ధ్యానం చేయబడిన మంత్రాలు సత్ఫలితాలను ఇస్తాయి. మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తాయి. ఉదాహరణకు 'హుం' కారం మనలోని భయాన్ని పారద్రోలుతుంది. 'రాం' కారం మనకు శాంతిని కలుగచేస్తుంది.

మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. 'ఐం, శ్రీం, హ్రీం, క్లీం' అనే ఏకాక్షర బీజ మంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి. ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం. అటువంటి పరమ పవిత్రమైన మంత్రాలను సెల్ ఫోన్ రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా ? ఒక వేళ పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రం ఒక శాసనం. పరమాత్మ సాక్షాత్కారానికి ఆయుధం. ఏ మంత్రమైనా సరే గురోపదేశం లేనిదే ఫలిందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే... మంత్రాలను పురాణాలల్లో చెప్పిన విధంగా మాత్రమే పఠించాలి.

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాన్ని టివీలలోనూ, రేడియోలలోనూ, క్యాసెట్లలోనూ, సెల్ ఫోన్ యొక్క రింగ్ టోన్ లోనూ కారు వెనక్కి వెళ్లేటప్పుడు బజర్ లలాగానూ రింగ్ టోన్స్ లా పెట్టుకోవడం మహా పాపం. మంత్రోచ్ఛారణకి కఠోరమైన నియమాలున్నాయి. కోరిక తీరాలని, త్వరగా ధనం సంపాధించాలన్న ఆశ చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటికి మధ్య కలియుగంలో మంత్రములు బజారుపాలు అవుతున్నాయి

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

ప్రస్తుత కాలంలో రింగ్ టోన్స్ రూపంలో గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వినపడుతున్నాయి. ఇటువంటి చర్యల వల్ల మనం ఫలితం పొందడం మాట ఎలా ఉన్నా...అవి మనల్ని పతనం వైపుకి తీసుకెళతాయి. మంత్రాలు ఎప్పుడూ పాటలు కారాదు.

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మననం చేయవల్సినది మంత్రం. అందునా మూల మంత్రాలను గురోపదేశం ద్వారా పొందిన మనస్సులో చేయాలి. మంత్రాలు పాటలు, భజనలు కావు. ఇటువంటి చర్యల వల్ల భగవత్ సాక్షాత్కారం లభించదు.

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

అలా చేయాలనుకోరుకునే వారికి అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు వంటివి చాలానే ఉన్నాయి. వాటిని హాయిగా పాడుకోవచ్చు, తప్పులేదు.

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

ఒక రోగికి మందు ఇవ్వడానికి వైద్యుడు ఎంతగా పరీక్షీస్తారో, అదే విధంగా ఒక మంత్రాన్ని గురువు శిష్యుడికి ఉపదేశించడానికి ముందు అంతగా పరీక్షించాలి. వారి కట్టుబాట్లు, జీవనశైలి, పుట్టిన నక్షత్రం ఇవన్నీ చూసి ఇవ్వాలి. దీనిని అర్వణ శాస్త్రం అంటారు. అలా ఉపదేశం పొందిన వారికి మాత్రమే ఆ మంత్రం యొక్క పరిపూర్ణ ఫలితం లభిస్తుంది.

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

కొన్ని మంత్రాలకు పెద్ద నియమాలుండవు. కొన్ని మంత్రాలకి ఎక్కువ నియమాలుంటాయి. అలాంటి వాటిలో పంచాక్షరి మంత్రం ఒకటి. నమశ్శివాయ, శివాయ నమ: కూడా పంచాక్షరే.

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చేయాలి. ఉపదేశం లేని వారు ప్రణవసంహితంగా చేయరాదని శాస్త్రాలు చెబుతున్నాయి.

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

ఉపదేశం లేనప్పుడు శివాయ నమ: -భక్తితో చెస్తే అదే పెద్ద ఫలితం ఇస్తుంది. ఓం నమశ్శివాయ అని పాటలు పాడితే తప్పు అని శాస్త్రమే చెప్తోంది. అశాస్త్రీయం అలవాటు అయిపోయి అసలు శాస్త్రం చెప్తే కోపం వచ్చే రోజులలో ఉన్నాం.

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

ఉపదేశం లేకుండా పంచాక్షరి చేసినా సత్ఫలితం ఇస్తుంది. అందులో ఏమీ తేడా లేదు. అయితే ఉపదేశం లేకుండా చేస్తే దానికి సాధ్యమంత్రము అని పేరు.

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

ఉపదేశం పొంది చేస్తే సిద్ధ మంత్రము అని పేరు. ఉపదేశం చేసే దానికంటే ఉపదేశం పొంది చేసే మంత్రం కోటిరెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది.

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

మంత్రాలను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా?

ఉపదేశం ఇచ్చిన వారు మంత్రంలో సిద్ది పొందిన వారు అయితే అప్పుడు ఆ మంత్రం సుసిద్ధ మంత్రం అవుతుంది. గురువు లేనిదే యే విద్య కూడా భాసించదు.

English summary

Can we place Mantras as our ringtones in Phone?

Can we place Mantras as our ringtones in Phone?,There are restrictions to some mantra's like mahamrutunjay mantra, durga saptashati mantras etc are that:If you are reciting it you should not stop in between chants and you should sit on clean and dry asan (made of kush, kambal(wool),or mrug charma[not poss
Story first published: Friday, August 5, 2016, 13:05 [IST]
Desktop Bottom Promotion