For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chaitra Navratri 2020 : శుభ సమయం, శుభ ముహుర్తం, పూజా విధులివే...

ఈ సంవత్సరం ఛైత్ర నవరాత్రి సందర్భంగా పవిత్రమైన శుభ సమయం, శుభ ముహుర్తం, దుర్గాదేవి ఆరాధన పద్ధతుల గురించి తెలుసుకోండి...

|

మన దేశంలో నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం హిందువులందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో దుర్గా దేవిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు. అలాంటి నవరాత్రి ఉత్సవాలు ప్రస్తుతం మార్చి నెల 25వ తేదీ నుండి ప్రారంభమవుతోంది. ఈ నవరాత్రులు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం రెండు లేదా నాలుగు సార్లు వస్తాయి.

 Chaitra Navratri 2020: Date, Kalash Sthapana Vidhi, Shubh Muhurat

ఛైత్ర నవరాత్రి అని కూడా పిలుచుకునే వసంత నవరాత్రి ఛైత్ర మాసంలో (మార్చి-ఏప్రిల్) జరుపుకుంటారు. ఈ నవరాత్రులకు ఎలాంటి తిథి అనేది ఉండదు. ఇది ఎక్కువగా ఛైత్ర, అశ్విణి, మాఘ మాసంలో వస్తుంది. అయితే తెలుగు నెలలో తొలి నెల అయిన ఛైత్ర, అశ్విని మాసాలలో వచ్చే నవరాత్రులే బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని మహానవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం ఛైత్ర నవరాత్రి సందర్భంగా పవిత్రమైన శుభ సమయం, శుభ ముహుర్తం, దుర్గాదేవి ఆరాధన పద్ధతుల గురించి తెలుసుకోండి...

ఛైత్ర నవరాత్రి ప్రాముఖ్యత

ఛైత్ర నవరాత్రి ప్రాముఖ్యత

నవరాత్రి ప్రారంభంలో దుర్గాదేవి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఇలా చేయడం కుటుంబంలో సానుకూల ఫలితం ఉంటుందని, అందరి జీవితంలో ఆనందం లభిస్తుందని చాలా మంది హిందువులు నమ్ముతారు. ఇలా స్థాపించిన అమ్మవారి విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు ఏకశిల దీపాలను వెలిగిస్తారు. ఈ కాలంలో అవి శాంతికాకుండా చూసుకుంటారు. ఈ సమయంలో చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు.

అమ్మవారి ఆరాధన..

అమ్మవారి ఆరాధన..

ఛైత్ర నవరాత్రి ప్రారంభరోజు చాలా మంది హిందువులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటిని, దేవుని గదిని శుభ్రపరచుకోవాలి. అనంతరం మంచి బట్టలు ధరించాలి. ఒక కుండలో మట్టిని వేసి అందులో జొన్న విత్తనాలను వేయాలి. అందులో దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.

పూలమాలతో...

పూలమాలతో...

అమ్మవారికి ఒక పూలమాల వేయాలి. స్వస్తిక గుర్తును తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి. దీని కోసం నీరు, అక్షింతలు, గింజలు, నాణెం వంటి వాటిని ఓ ఎరుపు రుంగు గుడ్డలో వేసి కట్టాలి. తర్వాత కొబ్బరికాయపై కుంకుమతో తిలకం దిద్దాలి.

తొలి రోజు..

తొలి రోజు..

2020 సంవత్సరంలో ఛైత్ర నవరాత్రి మార్చి 25వ తేదీ అయిన బుధవారం నాడు ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:17 గంటల వరకు శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆరోజున అమ్మవారిని ఆలయంలో శైలపుత్రిగా అలంకరించి ఆరాధిస్తారు.

రెండో రోజు

రెండో రోజు

వసంత నవరాత్రుల్లో రెండో రోజైన మార్చి 26వ తేదీ, గురువారం నాడు అమ్మవారిని బ్రహ్మచారిణిగా ఆరాధిస్తారు.

మూడో రోజు

మూడో రోజు

వసంత నవరాత్రుల్లో మూడో రోజైన మార్చి 27వ తేదీ, శుక్రవారం నాడు అమ్మవారి చంద్రఘంట రూపంలో అలంకరించి పూజిస్తారు.

నాలుగో రోజు

నాలుగో రోజు

వసంత నవరాత్రుల్లో నాలుగో రోజైన మార్చి 28వ తేదీ అయిన శనివారం నాడు అమ్మవారిని కుష్మండ రూపంలో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు.

ఐదో రోజు

ఐదో రోజు

వసంత నవరాత్రుల్లో ఐదో రోజైన మార్చి 29వ తేదీ అయిన ఆదివారం నాడు అమ్మవారిని స్కందమాత రూపంలో అలంకరించి పూజిస్తారు.

ఆరో రోజు

ఆరో రోజు

వసంత నవరాత్రుల్లో ఆరో రోజైన మార్చి 30వ తేదీ, సోమవారం నాడు అమ్మవారిని కాత్యాయని రూపంలో పూజిస్తారు.

ఏడో రోజు

ఏడో రోజు

వసంత నవరాత్రుల్లో ఏడో రోజైన మార్చి 31వ తేదీ, మంగళవారం నాడు అమ్మవారిని కలరాత్రి మాతగా పూజిస్తారు.

ఎనిమిదో రోజు

ఎనిమిదో రోజు

వసంత నవరాత్రుల్లో ఎనిమిదో రోజైన ఏప్రిల్ 1వ తేదీ, బుధవారం నాడు అమ్మవారిని మహాగౌరిగా అలంకరించి పూజిస్తారు.

తొమ్మిది రోజు..

తొమ్మిది రోజు..

వసంత నవరాత్రుల్లో చివరి రోజు అయిన తొమ్మిదో రోజు, ఏప్రిల్ 2వ తేదీ, గురువారం నాడు అమ్మవారిని సిద్ధిదాత్రి రూపంలో అలంకరించి పూజిస్తారు.

English summary

Chaitra Navratri 2020: Date, Kalash Sthapana Vidhi, Shubh Muhurat

Chaitra Navratri (March 25 – April 2 April 2020) starts as per the Hindu Lunar calendar with its first month Chaitra (March/April) therefore it is called Chaitra Navratri.Read on
Story first published:Monday, March 23, 2020, 9:05 [IST]
Desktop Bottom Promotion