చంద్ర దర్శనం - 17 ఏప్రిల్,2018. చంద్ర దర్శనం ఎందుకు అంత ముఖ్యమైనది?

Subscribe to Boldsky

హిందూ సమాజంలో చంద్ర దర్శనం చాలా ముఖ్యమైన ఆచారం. ప్రతినెలా, అమావాస్య తర్వాత వచ్చే మొదటిరోజు, పాడ్యమినాటి చంద్రున్ని దర్శించి పూజించటం ఆచారం. 17 ఏప్రిల్,2018. ఈ చంద్రదర్శనం 17వ తారీఖున వస్తుంది. సూర్యాస్తమయం అయిన వెంటనే చంద్రదర్శనానికి మంచి సమయం.

ఈ పండగను పాటించేవారికి సిరిసమృద్ధిలకు లోటు ఉండదని నమ్మకం. హిందువులు ఆరోజున ఉపవాసం ఉంటారు. చంద్రుని దర్శనం అయ్యాక పూజ చేస్తారు. అప్పుడే ఉపవాసం ముగించి ఏమైనా తింటారు.

చంద్ర దర్శనం సందర్భంగా మేము మీకు రెండు ముఖ్య చంద్రుని స్తుతించే స్తోత్రాలు అందిస్తున్నాం. ఇవి ఆ పర్వదినాన కానీ, చంద్రగ్రహ దోషాలతో బాధపడుతున్నవారు కానీ చదివితే వారి సుఖసంతోషాలు సమకూరుతాయి.

Chandra Darshan - 17th April, 2018. Why Is Chandra Darshan So Important ?

గ్రహాలను, ఆకాశంలో దేవతలను పూజించటం హిందువులకి చాలా ముఖ్యమైన సంప్రదాయం. అదీకాక, ప్రాచీన కాలం నుండి, వేదజ్యోతిష్యంలో జాతకచక్రంలో చంద్రుడి స్థానం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, అదే ఒక వ్యక్తి జాతకం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. జాతకచక్రంలో చంద్రుడు లాభించే ప్రదేశాల్లో ఉన్న వారందరికీ ప్రశాంతత, అందం, సమృద్ధి కలిసొస్తాయి.

చంద్ర దర్శనం అనే ప్రత్యేకమైన రోజును అమావాస్య మరునాడు వచ్చే చంద్రుడిని చూడటంతో జరుపుకుంటారు. ఆ రోజు సూర్యాస్తమయం అయిన వెంటనే చంద్రుడిని చూడటం చాలా విశిష్టంగా భావిస్తారు. ఎవరైతే చంద్రదర్శనం సమయంలో చంద్రుడ్ని చూస్తారో , చంద్రదేవుడు వారికి మంచి అదృష్టాన్ని ఆశీర్వాదంగా అందిస్తారని నమ్మకం.

వేదజ్యోతిష్యం ప్రకారం, చంద్ర లేదా చందమామ భూమిపై జీవాన్ని ప్రభావితం చేసే అంతరిక్ష ఉపగ్రహం. చంద్రదర్శనం ప్రతినెలా జరుపుకుంటారు. ఏప్రిల్ నెలలో చంద్ర దర్శనాన్ని ఏప్రిల్ 17న జరుపుకుంటారు. సమయం 7.54 పిఎం నుంచి 9.37పిఎం వరకు.

విశిష్టత

చంద్రుడు మంచి ఆరోగ్యం,స్వఛ్చతకి ప్రతీక. అతను దక్షప్రజాపతి కూతుళ్ళు అయిన 27 నక్షత్రాలను పెళ్ళాడని నమ్ముతారు. బుధగ్రహానికి ఆయన తండ్రని భావిస్తారు. హిందూ జ్యోతిష్యంలో మెర్క్యురీని బుధగ్రహంగా పిలుస్తారు. హిందూమతంలో చంద్రుడు చాలా ముఖ్యపాత్ర పోషిస్తారు ఎందుకంటే హిందువులు చాంద్రమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు.

ఉపవాసం, పూజ

భక్తులు చంద్ర దర్శనం రోజున రోజంతా ఉపవాసం పాటిస్తారు. ఏమీ తాగరు, తినరు. సాయంత్రం చంద్రుడు ఉదయించటం చూసాకనే ఉపవాసాన్ని ముగిస్తారు. చంద్రుడు సూర్యాస్తమయం అయిన వెంటనే సాధారణంగా కన్పిస్తాడు. ఆరోజు ఆకాశంలో ఉదయించిన చంద్రుడు అమావాస్య తర్వాత వచ్చిన కొత్త చంద్రుడు. ప్రజల్లో ఉన్న నమ్మకం ఏంటంటే చంద్రుడు ప్రతి రాత్రి ఆకాశం మొత్తం పది తెల్ల గుర్రాలు నడిపే తన రథంలో కూర్చుని తిరుగుతాడు. చంద్రుడ్ని మెప్పించటానికి పేదవారికి బియ్యం, పాలను పంచవచ్చు.

చంద్ర స్తోత్రం

చంద్రస్య శ్రూణునామాణి, శుభదాని మహీపతే,

యాని శృత్వ నరోదుఖాన్ ముచ్యతే నత్ర సంశయ.,

1 ఓ మహారాజా, చంద్రుని పవిత్ర నామాలు వినండి,

వినటం ద్వారా ఏ సంశయం లేకుండా మీ కష్టాలన్నీ తీరుతాయి.

సుధాకరో, విధు, సోమో, గ్లౌరబ్జో, కుముదప్రియ,

లోకప్రియ, శుభ్రభాను, చంద్రామ, రోహిణీపతీ.,

2 పూపుప్పొడి సృష్టికర్త, క్షీణించేవాడు, క్షీరంలోంచి జనించిన వాడు,

పద్మప్రియుడు, అందరికీ పాత్రుడు, అందగాడు,

అలసటను దూరంచేసే వాడు, ప్రముఖుడు, రోహిణికి భర్త,

శశీ, హిమకరో, రాజ, ద్విజరాజో, నిశాకర,

ఆత్రేయ, ఇందు, సీతాంసు, రోషాధీశ, కాలనిధి.,

3 కుందేలును పెంచుకునేవాడు, మంచుని తయారుచేసేవాడు, రాజు, బ్రాహ్మణులకు విభువు,

రాత్రిని సృష్టించేవాడు, అత్రి వంశజుడు, తెల్లనివాడు,

చల్లనివాడు, కాంతికి రారాజు, కళలకు నెలవు,

జైవత్రుకో, రామభ్రాత,

క్షీరోధర్ణవమ్ సంభవ,

నక్షత్రనాయక, శంభుశిర

చూడామణిర్, విభు

4 శాశ్వతమైనవాడు, లక్ష్మీసోదరుడు,

పాల నుంచి జనించినవాడు, అన్నిటినీ

జరిగేలా చూసేవాడు, నక్షత్రాలకు రారాజు,

శివుని తలపై అలంకారం, శక్తిమంతుడు

తాపహర్త, నాభో దీపో, నమన్యేతని యా పడేత్,

ప్రత్యాహం భక్తి సంయుక్త తస్య పీడ వినాశ్యతి.,

5 బాధను హరించేవాడు, చీకటిలో వెలుగు,

ఈ నామాలు ఎవరైనా భక్తితో చదివితే

వారి కష్టాలు అంతమవుతాయి.

తాడినే చ పడేధ్యస్తు లభేత్ సర్వం సమీహతం,

గ్రహాధీనం చ సర్వేషం భవేత్ చంద్రబలం సదా.,

6 ఇది సోమవారం చదివిన వారికి అన్ని కోరికలు సిద్ధించి,

చంద్రునితో సహా అన్ని గ్రహాలు అనుకూలంగా మారతాయి.

చంద్రకవచం

అస్య శ్రీ చంద్రకవచ స్తోత్ర మహా మంత్రస్య

"చంద్రుని శక్తి/కవచం" గా పిలవబడే గొప్ప స్తుతి ఇప్పుడు మొదలవబోతోంది

గౌతమ రుషి

అనుస్థుప్ చందా

చంద్రో దేవతా

చంద్ర ప్రీత్యర్థం జపే

వినియోగ.

గౌతమ మహర్షిని స్తుతించే ఈ స్తోత్రం,

అనుస్థుప్ రకం అలంకారం, చంద్రుడు దేవత

మరియు చంద్రుని అనుగ్రహంకై ఈ స్తోత్రపఠనం.

కవచం

సమం, చతుర్భుజం వందే, కేయూర మకుటోజ్వలం,

వాసుదేవస్య నయనం, శంకరస్య చ భూషణం.,

1। నాలుగు చేతుల్లో ఆయుధాలతో మౌనంగా ఉండే మన స్వామి చంద్రుడు,

రత్నకిరీటంతో వెలుగొందుతూ,

విష్ణుమూర్తికి కళ్ళుగా ఉంటూ,

పరమశివునికి ఆభరణం.

ఏవం ధ్యాత్వ జపేన్ నిత్యం శశిన కవచం శుభం,

శశి పాతు శిరోదేశం, ఫలం పాతు కళానిధి.,

2 అందుకనే ఈ కవచస్తోత్రం రోజూ చదవాలి,

నా తల చంద్రుడు రక్షించుగాక, నా వెంట్రుకలు కళాసంపదకు నిలయమైన స్వామి రక్షించుగాక.

చక్షుషి చంద్రమాపాతు, శ్రుతిపాతు నిశాపతి,

ప్రాణం కృపాకరపాతు, ముఖం కుముద బంధవా.,

3 వెన్నలనిచ్చే దేవుడు నా కళ్ళు రక్షించుగాక,

రాత్రికి అధిపతి నా చెవులు రక్షించుగాక,

దయగల ప్రభువు నా ఆత్మను రక్షించుగాక,

పద్మబంధువు నా ముఖమును రక్షించుగాక.

పాతు కాంతం చ మేసోమా, స్కంధే జైవత్రుకష్టదా,

కరౌ సుధాకరపాతు, వక్షపాతు నిశాకర.,

4 సోముడు నా మెడను రక్షించుగాక

అమరుడైన దేవుడు నా భుజములను రక్షించుగాక,

పుప్పొడిని సృష్టించు స్వామి నా చేతులకు రక్ష

రాత్రికి అధిపతి నా ఛాతీకి రక్ష.

హృదయం పాతు మే చంద్రో, నాభిం శంకర భూషణ,

మధ్యం పాతు సురా శ్రేష్ట, కటిం పాతు సుధాకర.,

5 నా హృదయానికి చంద్రుడి రక్ష,

పరమశివుని ఆభరణం నా కడుపుకి రక్ష,

దేవతల అధిపతి నా మధ్యభాగాలకు రక్ష,

పుప్పొడి సృష్టికర్తే నా పిరుదులకు కూడా రక్ష.

ఊరు తారాపతి పాతు, మృగాంగో జానునీ సదా,

అబ్ధిజా పాధు మే జంగే, పాధు పౌదౌ విధు సదా.,

నక్షత్రాల రాజు నా తొడలకు రక్ష,

జింక వాహనం పై ఊరేగే స్వామి నా మోకాలికి రక్ష,

కాలసృష్టికర్త నా కాళ్ళకు,

ఆ చంద్రుడే నా పాదాలకు రక్షగా ఉండుగాక.

సర్వన్ అన్యాని చంగానిపాతు, చంద్రో అఖిలం వపు,

ఏత్ధి కవచం పుణ్యం భుక్తి ముక్తి ప్రదాయకం.,

7 నా అన్ని అంగాలకు అన్నిచోట్లా చంద్రుడే రక్షగా ఉండుగాక మరియు

ఈ కవచం భక్తిని శాంతిని కలిగించుగాక.

యా పడేత్ శ్రున్యధ్వపి సర్వత్ర విజయీ బ్భవేత్.,

ఇతి శ్రీ చంద్ర కవచం సంపూర్ణం.

8 ఇది ఎవరైనా వింటే, అతను అన్నిట్లో విజయం సాధిస్తాడు,

చంద్రకవచ స్తోత్రం పూర్తయింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Chandra Darshan - 17th April, 2018. Why Is Chandra Darshan So Important ?

    The Chandra Darshan day falls just the day next to the day of Amavasya. This month 17th of April is observed as the Chandra Darshan day. To please Chandra Dev, the Lunar God, people generally keep a fast and break the fast only after sighting the Moon soon after the sunset. Doing so brings good luck and prosperity.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more