For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్ : భక్తులు లేని దేవాలయాలను ఎప్పుడైనా ఊహించారా?

బ్రహ్మోత్సవాల నుండి సహస్ర కలశాభిషేకం వరకు అనేక అర్జిత సేవలను తదుపరి ఆదేశాల వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

|

కరోనా వైరస్ కల్లోలానికి ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతుంది. బ్రిటన్ రాజ కుటుంబీకుల నుండి ప్రధానమంత్రుల భార్యల వరకు ఎవ్వరినీ కరోనా వైరస్ మహమ్మారి వదలడం లేదు. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 50కి పైగా కేసులు పాజిటివ్ రాగా.. ఆంధ్రప్రదేశ్ లో 11కి పైగా కేసులలో పాజిటివ్ వచ్చింది.

coronavirus effect on temples

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ భూతాన్ని కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనంది. ఈ సందర్భంగా 21 రోజులు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోంది. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనిపై సీరియస్ గా ఫోకస్ పెట్టాయి. వీటన్నింటి సంగతి పక్కన పెడితే ఈ కరోనా ప్రభావం దేవాలయాలపైనా పడింది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన.. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల వెంకన్న దేవాలయం కూడా మొట్టమొదటిసారిగా మూతపడింది. భక్తులు లేకుండా అంతంత పూజలతో ఇన్ని రోజుల వరకు మూతపడటం ఇదే మొదటిసారి. తిరుపతితో పాటు బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో భక్తులను అనుమతించడం తాత్కాలికంగా రద్దు చేసేశారు.

అర్జిత సేవలన్నీ..

అర్జిత సేవలన్నీ..

తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) సన్నిధిలో కరోనా నివారణ చర్యలలో భాగంగా.. టిటిడి ప్రస్తుతానికి శ్రీవారి అర్జిత సేవలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేసేసింది. బ్రహ్మోత్సవాల నుండి సహస్ర కలశాభిషేకం వరకు అనేక అర్జిత సేవలను తదుపరి ఆదేశాల వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

బెజవాడలోనూ..

బెజవాడలోనూ..

మన తెలుగు రాష్ట్రాల్లో తిరుమల వెంకన్న దేవాలయం తర్వాత అంతగా ప్రసిద్ధి చెందింది బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాలతో పాటు అన్ని దేవాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. భక్తులందరికీ తాత్కాలికంగా అనుమతులన రద్దు చేశారు.

నిశ్శబ్దం రాజ్యమేలుతోంది..

నిశ్శబ్దం రాజ్యమేలుతోంది..

కరోనా వైరస్ ప్రభావం వల్ల అకస్మాత్తుగా ఆలయాలను మూసేయడంతో తిరుమలలో, బెజవాడ, శ్రీశైలం మల్లన్న ఆలయ సన్నిధిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. సుమారు వారం రోజులుగా తిరుమల ప్రాంగణమంతా ఖాళీగా మారిపోయింది.

అంతా నిర్మానుష్యం..

అంతా నిర్మానుష్యం..

ఎల్లప్పుడూ అడుగు తీసి అడుగు ముందుకు వేయడానికి అతి కష్టంగా ఉండే శ్రీవారి ఆలయం ప్రస్తుతం బోసిపోయింది. అనునిత్యం గోవిందుడి నామస్మరణతో మారుమోగిపోయే ఆలయ ప్రాంగణమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. అయితే శ్రీవారికి రోజువారీ సేవలు యదాతథంగా కొనసాగుతున్నాయి.

అర్చకులకు మాత్రమే..

అర్చకులకు మాత్రమే..

తిరుమలతో పాటు ముఖ్యమైన దేవాలయాన్నింటిలో అతి కొద్ది మంది అర్చకులు, కొద్దిమంది ఆలయ అధికారులు పూజలు చేస్తున్నారు. కరోనా వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపించకుండా వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెల్లవారుజామున సుప్రభావ సేవ మొదలుకుని అన్ని రకాల పూజలను చేస్తున్నారు.

టిటిడి ఉద్యోగులకు సెలవు..

టిటిడి ఉద్యోగులకు సెలవు..

తిరుమలలో భక్తులు వేచి ఉండే కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లు అన్నింటికీ ఎక్కడికక్కడ తాళాలు వేశారు. గెస్ట్ హౌస్ లకు, కాటేజీలను కూడా పూర్తిగా మూసేశారు. అలాగే టిటిడి ఉద్యోగులలో చాలా మంది సెలవులు ఇచ్చేశారు. అయితే వాటి నిర్వహణ కోసం కొద్ది మంది సిబ్బందిని మాత్రం విధుల్లో ఉంచారు.

టోల్ గేట్లు తెరవలేదు..

టోల్ గేట్లు తెరవలేదు..

భక్తులందరినీ దేవాలయాల్లోకి అనుమతించకపోవడం వల్ల దుకాణాలు కూడా మూతపడ్డాయి. దుకాణదారులు కూడా కొండ కిందకు దిగేశారు. అలిపిరి టోల్ గేట్లను మూసేశారు. అయితే టిటిడి ఉద్యోగులకు అవసరమైన సరుకులను తీసుకెళ్లే వాహనాలు, అధికారుల వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు.

అధికారుల మకాం అక్కడే..

అధికారుల మకాం అక్కడే..

తిరుమలలో దాదాపు అన్ని మూతపడిపోవడంతో అధికారులు కూడా అన్నమయ్య భవన్ లో మకాం వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి తదితరులు అడ్మిన్ కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో తిరుమలకు వెళ్లొస్తున్నారు. అర్చకులు అక్కడే ఉంటూ.. స్వామివారి సేవలను కొనసాగిస్తున్నారు.

English summary

coronavirus effect on temples

Here we talking about coronavirus effect on temples. Read on
Story first published:Saturday, March 28, 2020, 17:09 [IST]
Desktop Bottom Promotion