For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంద్రుడికి వజ్రాయుధం ఎలా వచ్చిందో తెలుసా? ఒక మహర్షి ఎముకలతో తయారైంది అది, ఆయన తల నరకినా సాయం చేశాడు

దేవతలంతా వెళ్లి దధీచికి విషయం చెబుతారు. తన వల్ల అందరికీ మంచి జరుగుతుందంటే తాను ఏదైనా చెయ్యడానికి సిద్ధమని చెబుతాడు దధీచి. ఇంద్రుడికి వజ్రాయుధం ఎలా వచ్చిందో తెలుసా? ఒక మహర్షి ఎముకలతో తయారైంది అది,

|

పూర్వం చాలా మంది మహర్షులు తమ జీవితాలను లోకకల్యాణం కోసం ఫణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితంగానే మనం ఈ రోజు సంతోషంగా ఉంటున్నాం. యాగాలు చేసి మేధస్సును సాధించి దాన్ని లోకం కోసమే ఉపయోగించారు. అలాంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆయనే దధీచి.

ఈయన అధర్వణ రుషి, చితిలకు పుట్టిన వాడు. ఈయనకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా భక్తి ఉండేది. ఒక ఆవ్రమంలో ఉంటూ భీకరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. విష్ణు మూర్తి ప్రత్యక్షమవుతాడు. మీకు ఏ వరం కావాలో కోరుకో అని చెబుతాడు.

చనిపోవాలనుకున్నప్పుడే చనిపోయేలా

చనిపోవాలనుకున్నప్పుడే చనిపోయేలా

నేను ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడే చనిపోయేటట్లు వరం ఇవ్వు అని కోరుతాడు. విష్ణుమూర్తి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అన్ని శాస్త్రాల్లో దధీచికి మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఇక ఇంద్రుడి నుంచి బ్రహ్మ విద్యను కూడా నేర్చుకుంటాడు. అయితే ఈ విద్యను ఎవరికీ కూడా నువ్వు నేర్పించకూడదని ఇంద్రుడు దధీచికి చెబుతాడు. ఒక వేళ నా మాట కాదని బ్రహ్మ విద్యను ఇతరులకు నువ్వు బోధిస్తే నీ తల నరికేస్తా అంటాడు.

గుర్రం తలను ఆయనకు అమర్చి

గుర్రం తలను ఆయనకు అమర్చి

అయితే అశ్వినిదేవతలు తమకు బ్రహ్మ విద్య నేర్పండి అని దధీచిని కోరుతారు. అయితే వారు ఆయన తలను తీసి దాచిపెట్టి గుర్రం తలను ఆయనకు అమర్చి విద్య నేర్చుకుంటారు. తర్వాత ఇంద్రుడికి విషయం తెలిసి దధీచి తల నరికేస్తాడు. అశ్వని దేవతలు దాచి పెట్టిన దధీచి తలను మళ్లీ అతికిస్తారు.

ప్రాణాలను కూడా లెక్కచెయ్యలేదు

ప్రాణాలను కూడా లెక్కచెయ్యలేదు

తన దగ్గరున్న విద్యలను, తన వల్ల సాధ్యమయే పనులన్నీ దధీచి మొత్తం చేసి చూపించాడు. తన వల్ల ఎవరికీ ఏ అవసరం వచ్చినా సాయం చేసేవాడు. అందుకోసం తన ప్రాణాలను కూడా ఫణంగా పెట్టేవాడు దధీచి.

ఇక వృత్తాసురుడు అనే రాక్షసుడు దేవతల్ని అష్టకష్టాలుపెడుతుంటాడు.

దధీచి శరీరంలోని ఎముకలకు మాత్రమే ఉంది

దధీచి శరీరంలోని ఎముకలకు మాత్రమే ఉంది

దీంతో ఇంద్రుడితో సహా దేవతలంతా కలిసి విష్ణుమూర్తికి విషయాన్ని వివరిస్తారు. దీంతో ఆయన వృత్తాసురుడుని చంపగల శక్తి కేవలం ఒక్క దధీచి శరీరంలోని ఎముకలకు మాత్రమే ఉందని చెబుతాడు. ఆయన ఎముకలతో ఒక ఆయుధాన్ని తయారు చేసి దానితో చంపితే ఆ రాక్షసుడు చనిపోతాడని చెబుతాడు.

ఎముకలతో ఒక ఆయుధం

ఎముకలతో ఒక ఆయుధం

దేవతలంతా వెళ్లి దధీచికి విషయం చెబుతారు. తన వల్ల అందరికీ మంచి జరుగుతుందంటే తాను ఏదైనా చెయ్యడానికి సిద్ధమని చెబుతాడు దధీచి. ఆయనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోయే వరం ఉన్నందున దధీచి దేవతలు కోరిన వెంటనే మరణిస్తాడు.

తర్వాత ఆశ్రమంలోని ఒక ఆవు ఆయన శరీరాన్ని నాకేసరికి దధీచి శరీరంలోని ఎముకలు మొత్తం ఒక పక్కకు వస్తాయి. ఆ ఎముకలతో ఒక ఆయుధాన్ని తయారు చేసుకుంటాడు ఇంద్రుడు. అదే వజ్రాయుధం. దానికి మామూలు పవర్ ఉండదు. ఆ ఆయుధంతో ఎవరినైనా చంపేయొచ్చు.

ఎముకలకు అంత పవర్

ఎముకలకు అంత పవర్

ఇక వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్తాసురుడుని చంపేస్తాడు. అయితే దధీచి ఎముకలకు అంత పవర్ ఉండడానికి కారణం.. ఆయన దేవతలకు సంబంధించించిన అస్త్రాలను మొత్తం కమండలంలో వేసుకుని నీరుగా మార్చి తాగి ఉంటాడు.

వజ్రాయుధంతో చంపేస్తాడు

వజ్రాయుధంతో చంపేస్తాడు

వృత్తాసురుడు దేవతల అస్త్రాలను దొంగలించడానికి వచ్చినప్పుడు దేవతలంతా అస్త్రాలను దధీచికి ఇచ్చి ఉంటారు. అలా దధీచి వల్ల దేవతలు బతికి బట్టకట్టగలిగినారు. తన జీవితాన్ని లోక కల్యాణం కోసమే కేటాయించిన దధీచి నిజంగా స్ఫూర్తిదాయకం.

English summary

Dadhichi Rishi's sacrifice for vajra weapon

Dadhichi Rishi's sacrifice for vajra weapon
Desktop Bottom Promotion