For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దత్తాత్రేయ జయంతి ఎప్పుడు? దత్త జయంతి విశిష్టత ఏమిటి?

దత్తాత్రేయ జయంతి, వ్రతం మరియు ఆచార వ్యవహారాల గురించి తెలుసుకుందాం.

|

హిందూ పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు అవతారాల్లో దత్తావతారం ఆరో అవతారం అని.. ఈ దత్త రూపం అసామాన్యమైనది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తీభవించి ఉద్భవించినదే దత్తావతారం అని పండితులు చెబుతుంటారు.

Datta Jayanti 2020 Date, Story, Rituals and Importance

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దత్తాత్రేయ జయంతిని మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. ఈ దత్తాత్రేయుడిని శివుడు, బ్రహ్మ, మహేశ్వరుని అవతారంగా భావిస్తారు.

Datta Jayanti 2020 Date, Story, Rituals and Importance

ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా భక్తులు ఆయన ఆశీర్వాదం పొందేందుకు దత్తుడిని ఆరాధిస్తారు. మరి ఈ ఏడాది 2020లో దత్త జయంతి ఎప్పుడొచ్చింది.. శుభముహుర్తం, దత్తాతవరం యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

దత్తాత్రేయుని జననం..

దత్తాత్రేయుని జననం..

పురాణాల ప్రకారం మార్గశిర పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం యొక్క ప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. ‘దత్తం' అంటే ఇచ్చినవారు.. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడయ్యాడు. దత్తాత్రేయుని ఉపనయనం అయిన వెంటనే అడవికి వెళ్లి తపస్సు చేసి సంపూర్ణ జ్ణానాన్ని పొందాడు. దత్తుడు ప్రదోష్ కాలంలో జన్మించాడని చాలా మంది నమ్ముతారు. 2020 సంవత్సరంలో డిసెంబర్ 29వ తేదీన అంటే మంగళవారం నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు.

ఆధ్యాత్మిక విద్యను..

ఆధ్యాత్మిక విద్యను..

దత్తాత్రేయుడు 24 మందిని తన గురువులుగా భావించి, వారి నుండి జ్ణానాన్ని పొందాడు. దత్తాత్రేయునికి మూడు తలలు మరియు ఆరు చేతులున్నాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. కార్తవీర్యుడు, పరశురాముడు, యదవు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు తదితర గ్రంథాలను రచించాడు.

దత్తపురాణం ప్రకారం..

దత్తపురాణం ప్రకారం..

దత్త పురాణం ప్రకారం.. దత్తుడు పదహారు అంశలు కలవాడు. శ్రీపాదవల్లభులు, శ్రీన్రుసింహ సరస్వతి, శ్రీ అక్కల్ కోట మహారాజ్, శ్రీమాణిక్య ప్రభువు, షిరిడీ సాయిబాబా, గజానన మహారాజ్, శ్రీక్రిష్ణ సరస్వతీ మహారాజ్, వాసుదేవానంద సరస్వతీ మహారాజ్ గా దత్తావతారాలుగా వెలసినట్లు దత్త చరిత్ర ద్వారా తెలుస్ోతంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు.

చంద్రపూజ..

చంద్రపూజ..

దత్తజయంతిని మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికరమైన రోజు అని పండితులు చెబుతుంటారు. మత్స్యపురాణం, స్మ్రుతి కౌస్తుభంలో దత్త చరితం గురించి వివరాలు ఉన్నాయి. మార్గశిర పూర్ణిమ నాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తోంది. ఈరోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సకలశుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమిని ‘కోర్ల పౌర్ణమి'గా పిలుస్తారు.

దత్తాత్రేయ జయంతి శుభముహుర్తం..

దత్తాత్రేయ జయంతి శుభముహుర్తం..

తేదీ : డిసెంబర్ 29, 2020

శుభ ముహుర్తం ప్రారంభ సమయం : ఉదయం 7 గంటల 54 నిమిషాల నుండి (డిసెంబర్ 29, 2020)

శుభ ముహుర్తం ముగింపు సమయం : మరుసటి రోజు ఉదయం 8 గంటల 57 నిమిషాల వరకు (డిసెంబర్ 30, 2020)

దత్త జయంతి రోజునే..

దత్త జయంతి రోజునే..

హిందూ పంచాంగం ప్రకారం, మార్గశిర పూర్ణిమ రోజునే దత్తజయంతి కూడా వస్తుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అంటారు. ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే కచ్చితంగా శుభఫలితాలు వస్తాయని పండితులు చెబుతుంటారు.

English summary

Datta Jayanti 2020 Date, Story, Rituals and Importance

Datta Jayanti is the Birthday of Hindu God Dattatreya. Know more about Date, shubh muhurat and significance of Dattatreya Jayanti.
Desktop Bottom Promotion