ఈ దీపావళికి లక్ష్మీదేవిని ఆకర్షించడానికి వివిధ మార్గాలు..!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

లక్ష్మీదేవి సంపద,సమృద్ధులకి అధిదేవత. దీపావళినాడు లక్ష్మీపూజ చేసి కుటుంబం మొత్తం పై అమ్మవారి దీవెనలు ఉండేట్లా చేసుకోవచ్చు.

దీపావళినాడే లక్ష్మీదేవి పుట్టిందని అంటారు. అందుకే,ఆ అమావాస్య నాటి రాత్రి తనకి పూజ చేయాలి. తన భక్తులకి అమితమైన ఆరోగ్యం, సంపద ఇచ్చి, అన్ని అవరోధాలను వారి జీవితాల నుంచి తొలగించేలా వరాలిస్తుంది.

స్వచ్చత, జ్ఞానానికి ఆమె గుర్తు.ఆమెను పూజించినవారు ఆధ్యాత్మికంగా, భౌతికంగా సంతృప్తిని పొందుతారు.

దీపావళికి ఇంటిని శుభ్రపరచడానికి సులభమైన చిట్కాలు..

దీపావళినాడు లక్ష్మీపూజ జరిగే ఇళ్ళలోకి ఆమె ప్రవేశిస్తుందని అంటారు. అందుకే అది దీపావళినాడు ముఖ్య ఆచారంగా మారింది. లక్ష్మీ అమ్మవారిని మీ ఇళ్ళలోకి ఆకర్షించాలంటే పూజ సమయంలో,కొన్ని ఇతర ఆచారాలు కూడా తప్పక పాటించాల్సి ఉంటుంది.

-లక్ష్మీదేవి పరిశుభ్రమైన ఇళ్ళలోకే ప్రవేశిస్తుంది కాబట్టి మీ ఇళ్ళను శుభ్రపరుచుకోవటం తప్పనిసరి.

- లక్ష్మీదేవికి పెద్ద శబ్దాలంటే నచ్చవు. అందుకని పూజ సమయంలో బాణసంచా కాల్చవద్దు.

-ధర్మాన్ని అనుసరించే వ్యక్తులు ఉన్న ఇళ్ళలోనే లక్ష్మీదేవి ఉండగలదు.

ప్రతి మనిషి భౌతిక విషయాలలో కోరికలను అమితంగా కోరుకుంటాడు. ఇది లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షించడం ద్వారానే సాధ్యపడుతుంది. కానీ ఆమె ఒకేచోట స్థిరంగా ఎక్కువకాలం ఉండదనటానికి ప్రసిద్ధి.

దీపావళిని మరింత శోభాయమానంగా జరుపుకోవడానికి చిట్కాలు...

కానీ లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షించి,స్థిరంగా ఉంచుకోడానికి కొన్ని ఆచారాలు, విషయాలు ఉపయోగపడతాయి. ఇవి పాటించడం వలన ధనసంపదలకు ఎటువంటి లోటు ఉండదు...

కుబేరవిగ్రహాన్ని పెట్టుకోండి.

కుబేరవిగ్రహాన్ని పెట్టుకోండి.

కుబేరస్వామి విగ్రహం కానీ, కుబేర యంత్రాన్ని కానీ ప్రతిష్టించుకోవడం వలన లక్ష్మీదేవిని మెప్పించవచ్చని అంటారు.కుబేరుడు ధనాన్ని రక్షించే దేవత, మరియు స్వామి విగ్రహం శుభ్రమైన ప్రదేశంలో పెట్టుకోవాలి.

గవ్వలు,ఆల్చిప్పలు ఉంచుకోండి;

గవ్వలు,ఆల్చిప్పలు ఉంచుకోండి;

లక్ష్మీదేవి పుట్టిన సముద్రం నుండే గవ్వలు, ఆల్చిప్పలు వస్తాయి కాబట్టి ఇవి ఎక్కడ ఉంటే అక్కడ సానుకూల సంపద తరంగాలను తీసుకొస్తాయి.

దానాలు,దక్షిణలు;

దానాలు,దక్షిణలు;

బియ్యం మరియు బట్టలను పండితులకి దానం చేయటం కూడా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆకర్షించే మంచి పద్ధతి.

తులసిచెట్టును పూజించటం

తులసిచెట్టును పూజించటం

మీ వరండాలోని తులసిమొక్క ముందు ఒక దీపాన్ని వెలిగించండి. ఇది మీ ఇంట్లోకి లక్ష్మిని తప్పక ఆహ్వానిస్తుంది.

శివలింగానికి పూజ ;

శివలింగానికి పూజ ;

దీపావళి రోజు పొద్దున, రాగిపాత్రలో ఉంచిన శివలింగానికి నీరు మరియు కుంకుమతో పూజచేయాలి. ఇది సంపదలని ఆకర్షిస్తుంది.

స్వస్తిక్ గుర్తును తీర్చిదిద్దండి

స్వస్తిక్ గుర్తును తీర్చిదిద్దండి

స్వస్తిక్ గుర్తును వేసి, మీ వీధి గుమ్మానికి చెరోవైపు ‘శుభ్', ‘లాభ్' అనే పదాలు రాయండి. ఇది అమ్మవారికి మీ ఇల్లు సులభంగా గుర్తుపట్టేలా చేస్తుంది.

లైట్లు, ప్రమిదలలో దీపాలను వెలిగించండి

లైట్లు, ప్రమిదలలో దీపాలను వెలిగించండి

మీ ఇల్లును దీపాలతో అలంకరించి, శుభ్రంగా ఉంచండి. ఇది అమ్మవారిని ఆహ్వానిస్తుంది.

పెద్దలను గౌరవించి వారి దీవెనలను పొందండి

పెద్దలను గౌరవించి వారి దీవెనలను పొందండి

పెద్దలను గౌరవిస్తూ, ఏ పనిచేసేముందు అయినా వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవటం లక్ష్మీదేవిని ఎంతో సంతోషపర్చి, మీ పనుల్లో అవరోధాలు తొలగించి, విజయం చేకూరేలా చేస్తుంది.

English summary

Different Ways To Attract Goddess Lakshmi This Diwali

This Diwali attract goddess Lakshmi in these simple ways...
Story first published: Tuesday, October 17, 2017, 13:00 [IST]
Subscribe Newsletter