For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali 2021:దీపావళి పండుగ వేళ చేయాల్సిన, చేయకూడని పనులివే...

|

దీపావళి అంటేనే దీపాల పండుగ. చీకటిని తొలగించి కాంతులు విరజిమ్మే దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. గత ఏడాది కరోనా కారణంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకోలేకపోయాం.

అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రతి ఒక్కరూ ఈ దీపాల పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం దీపావళి నవంబర్ నాలుగో తేదీన వచ్చింది.

ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. దీపావళి సమయంలో చాలా మంది హిందువులు ధనలక్ష్మీ, శ్రీ మహాలక్ష్మీకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం, సత్యభామ నరకాసరుడిని సంహరించడంతో తమకు మంచి రోజులు వచ్చాయని ప్రజలంతా టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. అదే సంప్రదాయం ప్రకారం.. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ.. ప్రస్తుతం తరం వారు కూడా టపాసులు కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ వేళ కొన్ని పనులను తప్పనిసరిగా చేయాలట.. అదే విధంగా మరి కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదట. ఇంతకీ దీపావళి సమయంలో ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Diwali 2021: దీపాలను వెలిగించడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో తెలుసా...

దీపాల వెలుగులతో..

దీపాల వెలుగులతో..

దీపావళి పండుగనే దీపోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో దీపాల వెలుగులతో ప్రపంచమంతా వెలిగిపోతుంది. అయితే మనలో చాలా మంది హిందువులు ఇళ్లలోని పూజ గదిలో, ఇంటి ముంగిట మరియు దేవాలయాల్లో దేవుని ఎదుట దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. కొందరేమో ఉదయం మరియు సాయంత్రం దీపాలను వెలిగిస్తారు.. మరికొందరు పగలు, రాత్రి వేళలోనూ వెలుతురు ఉండేలా అఖండ దీపం వెలిగిస్తూ ఉంటారు.

శుభకార్యాల సమయంలో..

శుభకార్యాల సమయంలో..

దీపాలను కేవలం దీపావళి పండుగ సందర్భంలోనే కాకుండా.. ఏదైనా కొత్త పనులు ప్రారంభించేటప్పుడు లేదా శుభకార్యాల సమయంలోనూ దీపాలను వెలిగించడాన్ని మనం తరచుగా చూస్తుంటాం. ఎందుకంటే దీపం అనేది సానుకూలతకు చిహ్నం. చాలా మంది దీపం వెలిగించడం వల్ల పేదరికం తొలగిపోతుందని నమ్ముతారు. అంతేకాదు దీపం వెలిగించడం వల్ల అజ్ణానం అనే చీకటిని తొలగించి.. మన జీవితంలో వెలుగులు నింపేదే దీపం అని నమ్ముతారు.

దీపారాధన వల్ల..

దీపారాధన వల్ల..

దీపాలను వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంత మార్పులు ఉత్పత్తి అవుతాయి. ఇలా ఉత్పత్తి అయిన విద్యుదయస్కాంత తరంగాలు కొన్ని గంటల పాటు అలానే ఉంటాయి. వీటి వల్ల మన రక్తకణాలు ఉత్తేజితమవుతాయి. అలాగే దీపం వెలిగించేటప్పుడు ఆవు నెయ్యినే ఎందుకు వాడాలంటే.. అందులో చిన్న చిన్న క్రిములను నాశనం చేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే వాతావరణం మెరుగుపడుతుంది. అంతేకాదు కాలుష్యం కూడా తగ్గుతుంది.

చేయాల్సిన పనులు..

చేయాల్సిన పనులు..

* మీరు దీపావళి వేళ టపాసులను కాల్చడానికి ముందు ఆ ప్యాకెట్లపై ఉండే సూచనలను పూర్తిగా చదవండి.

* కాల్చిన టపాసులను, క్రాకర్లను అంతా ఓ బకెట్లో ఇసుక పోసి అందులో నిల్వ ఉంచండి. దీని వల్ల దారిలో మీ చుట్టుపక్కల ఉండే ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

* టపాసులను కాల్చే సమయంలో ముందు జాగ్రత్త చర్యగా ఓ బకెట్లో నీటిని సిద్ధంగా ఉంచుకోండి.

* టపాసులను కాల్చేటప్పుడు మీ చేతులను దూరంగా ఉంచి జాగ్రత్తగా కాల్చండి. టపాసులకు మీ ముఖాన్ని దూరంగా ఉంచాలి.

* చిన్నపిల్లలు ఉండే ఇంట్లో టపాసుల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

* చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు కచ్చితంగా వారి వద్ద ఉండాలి.

చేయకూడని పనులు..

చేయకూడని పనులు..

*టపాసులను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కాల్చొద్దు. కేవలం ఆరుబయట మాత్రమే కాల్చండి.

* మీ జేబుల్లో క్రాక్సర్ పెట్టుకుని తిరగడం వంటివి చేయొద్దు.

* గాజు గ్లాసు కంటెయినర్లు, లోహపు పాత్రల్లో క్రాకర్లను కాల్చడం వంటి చేస్తే చాలా ప్రమాదకరంగా మారొచ్చు.

* దీపావళి కొన్ని టపాసులు కాలిపోవడానికి కాస్త సమయం తీసుకుంటాయి. అలా కాలకుండా ఆరిపోయిన టపాసును తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకండి. అది పైకి కాలినట్టు కనిపించకపోయినా లోపల మండుతూనే ఉంటుంది. దాన్ని మీరు చేతిలోకి తీసుకోగానే అది పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాంటి సమయంలో ముందుగా నీటిలో వాటిని తడపండి.

ఫస్ట్ ఎయిడ్ కిట్..

ఫస్ట్ ఎయిడ్ కిట్..

దీపావళి వేళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు టపాసుల వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

కాబట్టి ముందుగానే మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచుకోవాలి. డాక్టర్ ను సంప్రదించడానికి ముందే టపాసుల వల్ల గాయపడిన వ్యక్తిని ముందు అగ్నికి దూరంగా తీసుకెళ్లాలి. టపాసుల వల్ల గాయమైన శరీర భాగంపై ఉండే దుస్తులను తొలగించాలి.

గాయమైన ప్రదేశంలో (చల్లని నీరు కాకుండా) నీటిని పోయాలి. అయితే గాయాలపై ఐస్ తో మర్దన చేయొచ్చు. అలాగే వెన్న, గ్రీజ్, పౌడర్ వంటి వాటిని కూడా గాయాలపై రాయొచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం తగ్గుతుంది. అనంతరం వైద్యుని వద్దకు తప్పనిసరిగా తీసుకెళ్లండి.

English summary

Diwali 2021: List of do's and don'ts on this festival of lights in Telugu

Here are the list of do's and and don'ts on diwali festival of lights in Telugu. Have a look
Desktop Bottom Promotion