Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కార్తీకమాసం రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు.. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది.. ఎలా వెలిగించాలంటే!
హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో హిందువులందరూ శివుడు, విష్ణువు ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శివకేశవులిద్దరికీ ఎంతో ఇష్టమైన ఈ నెలలో హిందువులు ఆధ్యాత్మిక సాధన, దీపారాధన, దీప దానం, జపం, స్నానం, దానం, ఉపవాసం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ధనదీపం పేరుతో ఒక దీపం వెలిగిస్తే ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఆర్ధిక సమస్యలన్నీ తొలిగిపోతాయనే నమ్మకం ఉంది.
అయితే ఇంతటి మహిమ కలిగిన ఈ ధనదీపాన్ని ఎప్పుడు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? ఏ విధమైన పూజలు చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే..
ఈ పవిత్రమైన, శక్తివంతమైన ధనదీపాన్ని వెలిగించే ముందు ఇంట్లోని పూజ గదిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. అనంతరం శ్రీమహాలక్ష్మి దేవి చిత్రపటానికి గంధం, కుంకుమ, పసుపుతో కలిపిన బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి చిత్రపటం ముందు శుభ్రంగా కడిగిన ఒక పూజ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం ఆ పీఠానికి పసుపు, కుంకుమ, గంధంతో కలిపిన బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఆ పీఠంపై ఒక ఇత్తడి పళ్లెంను ఏర్పాటు చేసుకోవాలి.

ఆ పళ్లెంకు కూడా పీటకు మాదిరిగానే పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టుకోవాలి. అనంతరం అందులో గుప్పెడు బియ్యం వేసుకొని.. అందులో పసుపు, కుంకుమ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక గులాబీ పువ్వు వేసుకుంటే మంచిది. ఇప్పుడు రెండు మట్టి ప్రమిదలను తీసుకోవాలి. అందులో ఒక ప్రమిదలో మూడు యాలకులు, లవంగాలు, కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని బియ్యం ఉన్న పళ్లెంలో పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇంకో ప్రమిదను తీసుకొని మొదటి ప్రమిదపై ఉంచాలి. అనంతరం ఆ పై ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసుకొని, అందులో రెండు లేదా మూడు ఒత్తులు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఒత్తులను అగరబత్తి లేదా ఏక హారతితో వెలిగించుకోవాలి. దీన్నే ధనదీపం లేదా లక్ష్మీదీపం అని పిలుస్తారు. ఈ దీపాన్ని కార్తీకమాసంలో ఏ రోజు అయినా వెలిగించుకోవచ్చు. కాకపోతే గురు, శుక్రవారాల్లో వెలిగించుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలను పొందొచ్చని పండిత నిపుణులు చెబుతున్నారు.
రెండో ప్రమిదలో దీపం వెలుగుతున్న సమయంలో జవ్వాది అనే సుగంధ ద్రవ్యం అందులో కలుపుకోవాలట. దీపం కొండెక్కిన తరువాత మొదటి ప్రమిదలో ఏలకులు, లవంగాలు, రాళ్ళ ఉప్పు, పళ్ళెంలోని గులాబీ పువ్వును ఎవరూ తొక్కని చోటులో వేసుకుంటే మంచిది. పళ్ళెంలోని గులాబీ పువ్వును పడేశాక అందులోని బియ్యంతో పాయసం లేదా నైవేద్యం చేసి లక్ష్మీదేవికి సమర్పించే మంచి ఫలితాలను పొందొచ్చట.
అయితే ఈ దీపం వెలిగించే ముందు బియ్యం పళ్లెంలో ఒక రూపాయి బిళ్ళను వేయాలి. పైన చెప్పబడిన తతంగం అంతా పూర్తయిన తరువాత ఆ బిళ్ళను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి.. మీరు డబ్బులు దాచుకునే బీరువాలో ఆ బిళ్ళను అక్కడ పెడితే లక్ష్మీదేవి అక్కడ నెలవై ఉంటుందని నమ్మకం.
గమనిక: ఈ కథనంలో పొందుపరిచిన అంశాలు జ్యోతిష్య నిపుణుల అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని అనుసరించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. దీనికి బోల్డ్‌స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.



Click it and Unblock the Notifications