శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే మీ కోరికలన్నీ నెరవేరతాయి

Subscribe to Boldsky

మీరు ఎంతో ధనాన్ని సంపాదించాలని కోరుకుంటూ ఉండవచ్చు, లేదా పండంటి పాపాయికి జన్మనివ్వాలని తాపత్రయపడవచ్చు. లేదా విజ్ఞానం సంపాదించాలని కోరుకోవచ్చు అలాగే జీవితంలో విజయాన్ని సాధించాలని తీవ్రంగా ఆకాంక్షిస్తూ ఉండవచ్చు, అందుకోసం మీరు పెద్దమొత్తంలో ధనాన్ని ఖర్చు చేసి పూజల్ని జరిపించనవసరం లేదు.

శుక్రవారం నాడు ఉపవాసం ఫలితాలు

సంతోషీ మాతను పూజిస్తూ శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే మీ కోరికలన్నీ నెరవేరతాయి. అవును, కోరికలను నెరవేర్చే మాత సంతోషీ మాత. ఆవిడ పేరుకు తగినట్టే సంతోషాన్ని ప్రసాదిస్తుంది మాత. యావత్భారతదేశమంతా ఈ మాతను కొలుస్తారు. మీ కలలను సాకారం చేయడానికి మాత మీకు సహకరిస్తుంది.

మహిళలు సంతోషీ మాత దయను పొందేందుకు ఉపవాసం ఉంటారు. కనీసం 16 శుక్రవారాలు ఉపవాసం ఉంటే కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం.

సంతోషీ మాత పూజకి సంబంధించిన విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

friday-fast-will-fulfil-all-your-desires

పూజా విధి:

భక్తులు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మస్నానాన్ని ఆచరించాలి. సూర్యోదయానికి ముందే ఆచరించే స్నానాన్ని బ్రహ్మస్నానం అనంటారు. పూజాసామాగ్రిని సిద్ధం చేసుకోండి. పూవులు, చక్కెర, వేయించిన ముడిశెనగలు, నేతితో వెలిగించిన దీపం మరియు అగరబత్తిని సిద్ధం చేసుకోండి.

ఈ రోజు కేవలం ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. పుల్లటి పదార్థాలను ఈ రోజు తీసుకోకూడదు. అలాగే పుల్లటి వాటిని ఇతరులకు వడ్డించకూడదు కూడా.

వ్రత ఉద్యాపన సమయంలో ఎనిమిది మంది అబ్బాయిలకు భోజనాన్ని వడ్డించాలి. మీరు వడ్డించే ఆహారంలో పుల్లటి పదార్థాలు ఉండకుండా జాగ్రత్తపడండి. వారు కూడా రోజంతా పుల్లటివి భుజించకూడదు.అందువలన, మీ కుటుంబంలోవారికి అలాగే బంధుమిత్రులకు సంబంధించిన అబ్బాయిలకు మీరు వ్రత ఉద్యాపన నాడు భోజనాన్ని వడ్డిస్తే మంచిది.

వ్రత కథ:

చాలా కాలం క్రితం ఒక వృద్ధ మహిళ ఉండేది. ఆవిడకు ఏడుగురు కుమారులు. వారిలో ఆరుగురు కష్టించే తత్త్వం కలిగేవారు. ఏడవ కుమారుడు మాత్రం సోమరిగా ఉంటూ ఎటువంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండేవాడు. ఈ ఆరుగురికి ఆ మహిళ తాజా ఆహారాన్ని వడ్డించేది. వారు తినగా మిగిల్చినవి ఏడవ కుమారుడికి వడ్డించేది. ఈ విషయాన్ని అతని భార్య తెలుసుకుని తన భర్తకు తెలియచేసింది. ఏడవ కుమారుడు బాధపడి ఆ ఇంటిని విడిచి వెళ్లి ఉద్యోగం వెతుక్కోవాలని నిర్ణయించుకుంటాడు.

దూరప్రాంతాలకు వెళ్లిన ఏడవ కుమారుడు అక్కడ ఒక వ్యాపారి దగ్గర పనిచేయడం ప్రారంభిస్తాడు. ఇతని పనితీరుకు మెచ్చి ఆ వ్యాపారి ఇతనిని తన భాగస్వామిగా చేర్చుకుంటాడు. ఇప్పుడు, ఏడవ కుమారుడు సంపన్నుడిగా మారిపోతాడు. సంపన్నుడిగా మారిపోయాక తన భార్య గురించి మరచిపోతాడు. తన భార్య ఎన్ని కష్టాలు పడుతుందో పూర్తిగా మరచిపోతాడు.

మరోవైపు, ఇతని భార్యని వారత్తగారు అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. తోడికోడళ్లు కూడా ఇబ్బందిపెడతారు. రోజూ అడవికి వెళ్లి కర్రలను తీసుకొచ్చేది. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయ్యేది. అప్పుడు, మిగిలిపోయిన, పాచిపోయిన ఆహారాన్ని ఈవిడకు వడ్డించేవారు.

ఒకరోజు అడవిలోంచి వస్తున్నప్పుడు ఈవిడ అలసిపోతుంది. అక్కడే ఉన్న ఒక గుడి వద్ద సేదదీరుతుంది. ఆ గుడి సంతోషీ మాత గుడి. అప్పుడు, సంతోషీ మాత కి చెందిన 16 వారాల ఉపవాస దీక్ష గురించి తెలుసుకుంటుంది. తన భర్త రాకకోసం 16 వారాల ఉపవాస దీక్షను ఆచరించాలని నిర్ణయించుకుంటుంది.

ఎంతో భక్తితో ఉపవాసాన్ని చేయడం ప్రారంభిస్తుంది. ఉదయాన్నే లేచి మాతను పూజించి అప్పుడు కర్రలను తీసుకురావడం కోసం అడవికి వెళ్ళేది.

అప్పుడు, తన భక్తురాలి భర్త కల్లో సంతోషీ మాత ప్రత్యక్షమై తన భక్తురాలి బాధల గురించి వివరించి ఆమెతో జీవించమని గుర్తుచేస్తుంది. ఇక్కడ ఎంతో పనిభారం ఉండటం వలన తనకు వెళ్లడం కుదరదని అతను ఆమెకు సమాధానం చెప్తాడు.

మరుసటి రోజే తన భార్య వద్దకు వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోమని మాత సూచిస్తుంది. మిగిలి ఉన్న పనులు మరుసటి రోజుకే పూర్తవుతాయని భరోసా ఇస్తుంది. ఆ విధంగా ఆ మరుసటి రోజే అతను తన భార్యవద్దకు చేరుకునేందుకు బయలుదేరతాడు.

ఇంటికి చేరుకున్నాక అతను తన భార్యను తీసుకుని వేరుగా నివసిస్తాడు. వారిద్దరూ సంతోషంగా నివసిస్తారు. వారి చెడ్డరోజులు తొలగిపోయాయి. మాత దయవలన వారిప్పుడు సంతోషంగా ఉన్నారు.

ఉద్యాపనకై వారు ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా, అత్తగారు అలాగే తోడికోడళ్లు ఆరళ్ళు మాత్రం ఆగలేదు. తన భర్త సోదరులను ఉద్యాపన నాడు ఇచ్చే విందుకై ఆహ్వానిస్తుంది. అయితే, ఈవిడ వ్రతానికి భంగం కలిగించాలని తోడికోడళ్లు భోజనం చేసేటపుడు పులుపు వస్తువులను అడగమని తమ మొగుళ్ళకు సూచిస్తారు.

వారు అదే విధంగా పులుపు పదార్థాలను ఆ భక్తురాల్ని అడుగుతారు. ఆవిడ పులుపును వడ్డించనని ఖరాఖండిగా చెబుతుంది. డబ్బులు ఇవ్వమని వారడుగుతారు. ఆవిడ డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులతో బయటనుంచి పులుపు పదార్థాలని తెచ్చుకుని వారు భుజిస్తారు.

సంతోషీ మాత ఆగ్రహిస్తుంది. ఆ భక్తురాలి భర్తను పోలీసులు పట్టుకుంటారు. భక్తురాలు మాతను ఇలా ఎందుకు జరిగిందని అడుగుతుంది. ఉద్యాపన సరిగ్గా జరగలేదని మరొకసారి ఉద్యాపనని ఇవ్వమని మాత ఆదేశిస్తుంది.

ఆ భక్తురాలు మరొకసారి ఉద్యాపనకి ఏర్పాట్లు చేస్తుంది. మళ్ళీ తన భర్త సోదరులను ఆహ్వానిస్తుంది. వారు ఇదే విధంగా మళ్ళీ చేయబోతారు. దాంతో ఆవిడ బ్రాహ్మణులను పిలిచి వారికి విందునిస్తుంది. వారు ప్రసాదాన్ని జాగ్రత్తగా భుజిస్తారు. వారికి ప్రసాదంగా పండ్లను కూడా అందిస్తుంది భక్తురాలు.

సంతోషించిన మాత భక్తురాలి భర్త తిరిగి ఇంటికి వచ్చేలా చేస్తుంది. ఈ దంపతులకు కుమారుడిని ప్రసాదిస్తుంది.

మాత కోవెలకు తమ కుమారుడిని కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఒకరోజు, మాత తన భక్తురాలి భక్తిని పరీక్షించాలని అనుకుంటుంది. మాత వేయించిన సెనగపిండి అలాగే చక్కెర కలగలపిన ముఖంతో భయంకరమైన అవతారంలో వీరింటికి విచ్చేస్తుంది. వీరింటికి మాత విచ్చేయగానే భక్తురాలి అత్తగారు "ఇంట్లోకి ఎదో రాక్షసి ప్రవేశించింది" అంటూ భయంతో ఇల్లంతా పరుగులు తీస్తుంది.

ఆ ఇంట్లోని పిల్లలు అన్ని తలుపులనూ అలాగే కిటికీలను మూసివేస్తారు. అయితే, భక్తురాలు మాత్రం మాతను గుర్తుపట్టింది. ఇంట్లోని అందరికీ తాను కొన్ని నెలలుగా పూజిస్తున్న సంతోషీమాత విచ్చేసింది తెలియచేస్తుంది.

ఆశ్చర్యపోయిన వారు, తమను మన్నించమని వేడుకుని మాత కాళ్ళపై పడతారు. తమ తప్పులను క్షమించమని మాతను వేడుకుంటారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    friday-fast-will-fulfil-all-your-desires

    friday-fast-will-fulfil-all-your-desires,Observing a Friday Fast for Goddess Santoshi is the key to the fulfillment of all your desires. Read on to know the procedure and the Vrat Katha for a Friday Fast.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more