For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ganga Saptami 2022:గంగా సప్తమి ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందామా...

|

హిందూ మతంలో గంగకు కేవలం ఒక నదిలా కాకుండా తల్లి హోదా ఇవ్వబడింది. గంగా నదిని స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. ఎవరైనా సరే గంగా నదిలో ప్రత్యేక సందర్భాలలో స్నానం చేస్తే, వారికి సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.

Ganga Saptami 2022 Date, Tithi, Shubh Muhurat, Puja Vidhi and Significance in Telugu

హిందూ పురాణాల ప్రకారం, గంగా సప్తమి రోజున గంగమ్మ తల్లి భూమిపైకి అడుగుపెట్టినట్టు నమ్ముతారు. కొన్ని గ్రంథాలలో గంగను ముక్తిగా పరిగణిస్తారు. ఆ తల్లి పుట్టిన తేదీని గంగా సప్తమి మరియు గంగా జయంతిగా జరుపుకుంటారు.

Ganga Saptami 2022 Date, Tithi, Shubh Muhurat, Puja Vidhi and Significance in Telugu

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో ఏడో రోజున గంగా సప్తమి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునే గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. మనలో ఏ జీవ రాశి పుట్టినా.. మరణించినా.. గంగా జలం లేకుండా ఏ కర్మ కూడా పూర్తి కాదు.

Ganga Saptami 2022 Date, Tithi, Shubh Muhurat, Puja Vidhi and Significance in Telugu

అందుకే భూమిపై గంగమ్మ తల్లిని మోక్షంగా భావిస్తారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో గంగా సప్తమి ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం ఎప్పుడు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

May 2022 Vrat And Festivals: మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలు, శుభముహుర్తాలివే...May 2022 Vrat And Festivals: మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలు, శుభముహుర్తాలివే...

గంగా సప్తమి ఎప్పుడంటే..

గంగా సప్తమి ఎప్పుడంటే..

2022 సంవత్సరంలో మే నెలలో 8వ తేదీన అంటే ఆదివారం నాడు గంగా సప్తమి వచ్చింది.

సప్తమి తిథి మే 7వ తేదీన మధ్యాహ్నం 2:56 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే మే 8వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఉదయం తిథి ప్రకారం, గంగా సప్తమిని మే 8వ తేదీన జరుపుకుంటారు.

గంగా సప్తమి ప్రాముఖ్యత..

గంగా సప్తమి ప్రాముఖ్యత..

హిందూ పురాణాల్లో, గంగా నదిలో స్నానం చేయడం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పబడింది. ముఖ్యంగా గంగా సప్తమి రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి గంగమ్మ తల్లిని పూజించడం వల్ల మనం చేసిన పాపాలని తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే రిద్ధి-సిద్ధి, కీర్తి మరియు గౌరవం లభిస్తాయని పండితులు చెబుతారు. అంతేకాదు గ్రహాల ప్రతికూల ప్రభావాల నుండి కూడా విముక్తి పొందుతారు. కుజుడి ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే వారు గంగా సప్తమి రోజున గంగాదేవికి ప్రత్యేక పూజలు చేసి గంగా నదిలో స్నానం చేస్తే కుజుడి ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయట.

గంగా సప్తమి కథ..

గంగా సప్తమి కథ..

పురాణాల ప్రకారం, గంగా సప్తమి రోజున గంగమ్మ తల్లిని భగీరథుడు భూమి మీదకు తీసుకొచ్చాడు. భగీరథ రాజు తన పూర్వీకులను విడిపించడానికి దేవతల నుండి సహాయం కోరాడు. అప్పుడు దేవతలు గంగా మాత పవిత్ర జలం మాత్రం తనకు మోక్షం ఇవ్వగలదని చెప్పారు. అందుకే గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చేందుకు భగీరథుడు కఠోర తపస్సు చేశాడు. కొన్ని యుగాల తర్వాత గంగాదేవి భూమిపై జన్మించి భగీరథుని కోరిక తీరుస్తుందని బ్రహ్మాదేవుడు తనకు హామీ ఇచ్చాడు.

గంగమ్మ ప్రవాహం..

గంగమ్మ ప్రవాహం..

కానీ గంగమ్మ ప్రవాహం చాలా ఎక్కువగా ఉన్నందున, అప్పుడు భూమి మొత్తం నాశనం అయ్యే పెద్ద సంక్షోభం ఏర్పడింది. అప్పుడు, బ్రహ్మదేవుడు, భగీరథుడు తన జుట్టు నుండి గంగమ్మను విడుదల చేయమని శివుడిని కోరతారు. అదే సమయంలో శివుని మెప్పు కోసం భగీరథుని తపస్సు చేస్తాడు. తన నిజమైన తపస్సుకు సంతోషించిన శివుడు గంగామాతను తన జుట్టులో వేసుకుని, తన జుట్టు ద్వారా భూమిపై గంగా నదిని మాత్రమే విడిచిపెట్టాడు. అందుకే ఈరోజున గంగా సప్తమి అని చెబుతారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం గంగా సప్తమి రోజున గంగామాతను పూజించడం, గంగా స్నానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

గంగమ్మ పూజ..

గంగమ్మ పూజ..

గంగా సప్తమి రోజున గంగా నదిలో స్నానం చేయడానికి కుదరకపోతే, ఉదయం మీరు స్నానం చేసే సమయంలో, మీ బకెట్లో కొంత గంగాజలం కలుపుకుని కూడా స్నానం చేయొచ్చు. ఇలా చేసినా కూడా గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. అనంతరం మీరు గంగమ్మ తల్లిని చిత్త శుద్ధితో పూజించాలి.

FAQ's
  • గంగా సప్తమి ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్తం ఎప్పుడు?

    2022 సంవత్సరంలో మే నెలలో 8వ తేదీన అంటే ఆదివారం నాడు గంగా సప్తమి వచ్చింది.

    సప్తమి తిథి మే 7వ తేదీన మధ్యాహ్నం 2:56 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే మే 8వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఉదయం తిథి ప్రకారం, గంగా సప్తమిని మే 8వ తేదీన జరుపుకుంటారు.

  • గంగా సప్తమి ప్రాముఖ్యత ఏమిటి.

    హిందూ పురాణాల్లో, గంగా నదిలో స్నానం చేయడం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పబడింది. ముఖ్యంగా గంగా సప్తమి రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి గంగమ్మ తల్లిని పూజించడం వల్ల మనం చేసిన పాపాలని తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే రిద్ధి-సిద్ధి, కీర్తి మరియు గౌరవం లభిస్తాయని పండితులు చెబుతారు. అంతేకాదు గ్రహాల ప్రతికూల ప్రభావాల నుండి కూడా విముక్తి పొందుతారు. కుజుడి ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే వారు గంగా సప్తమి రోజున గంగాదేవికి ప్రత్యేక పూజలు చేసి గంగా నదిలో స్నానం చేస్తే కుజుడి ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయట.

English summary

Ganga Saptami 2022 Date, Tithi, Shubh Muhurat, Puja Vidhi and Significance in Telugu

Here we are talking about the Ganga Saptami 2022 Date, tithi, shubh muhurat, puja vidhi and significance in Telugu. Have a look
Story first published:Friday, May 6, 2022, 15:05 [IST]
Desktop Bottom Promotion