For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Guru Gobind Singh Jayanti 2021 : గురు గోవింద్ సింగ్ గురించి మనం నమ్మలేని నిజాలు...

గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా సిక్కుల పదో గురువు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

గురు గోవింద్ సింగ్ అని పిలువబడే ఈ గురువు సిక్కు సమాజంలో పదో గురువు. గురు గోవింద్ సింగ్ జయంతి రోజున సిక్కు ప్రజలందరూ ఒక పండుగలా జరుపుకుంటారు.

Guru Gobind Singh Jayanti 2021 : Facts About 10th Sikh Guru in Telugu

సిక్కు ప్రజలు జరుపుకునే మరియు ఆచరించే పవిత్రమైన ముఖ్యమైన సందర్భాలలో ఇది ఒకటి. 2021 ఏడాదిలో గురు గోవింద్ సింగ్ జయంతి జనవరి 20వ తేదీన జరుపుకోనున్నారు.

Guru Gobind Singh Jayanti 2021 : Facts About 10th Sikh Guru in Telugu

ఆయన జీవితం మరియు బోధనలు సిక్కు ప్రజలకు ప్రేరణగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా గురు గోవింద్ సింగ్ గురించి మీరు నమ్మలేని నిజాలను మేము మీకు తెలియజేస్తాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

గురు గోవింద్ జననం..

గురు గోవింద్ జననం..

చరిత్రను పరిశీలిస్తే.. గురు గోవింద్ సింగ్ 1666వ సంవత్సరంలో బీహార్ లోని పాట్నాలో గురు తేగ్ బహదూర్ (తండ్రి) మరియు మాతా గుజ్రీ(తల్లి)లకు గోవింద్ రాయ్ గా జన్మించారు.

తొమ్మిదేళ్ల వయసులోనే..

తొమ్మిదేళ్ల వయసులోనే..

ఈయన తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడే సిక్కు ప్రజల పదో గురువుగా గుర్తించబడ్డారు. గురు గోవింద్ సింగ్ తన బాల్యంలో సంస్క్రుతం, గురుముఖి, హిందీ, బ్రజ్, ఉర్దూ మరియు పెర్షియన్ వంటి అనేక భాషలను నేర్చుకున్నాడు. వీటితో పాటు బలమైన యోధునిగా మారేందుకు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు.

హిమాచల్ ప్రదేశ్ లో..

హిమాచల్ ప్రదేశ్ లో..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణం అయిన పాంటాలోని గురువార అయిన పావోంటా సాహిబ్ గురు గోవింద్ సింగ్ చేత స్థాపించబడింది. గురు గోవింద్ సింగ్ తన ముఖ్యమైన బోధనలను పంచుకుని, వాటిని రాసిన ప్రదేశం అదే.

స్థానిక రాజులతో పోరాటం..

స్థానిక రాజులతో పోరాటం..

గురు గోవింద్ సింగ్ 19 ఏళ్ల వయసులోనే స్థానిక రాజులతో పోరాటం చేశారట. 1688 సంవత్సరం, సెప్టెంబరులో గురువింద్ సింగ్ భీమ్ చంద్, గార్వాల్ రాజు ఫతేఖాన్ మరియు సివాలిక్ హిల్స్ లోని అనేక ఇతర స్థానిక రాజులతో పోరాటం చేశారు. ఈ యుద్ధం ఒక రోజు మాత్రమే కొనసాగింది. దీనిలో గురు గోవింద్ సింగ్ విజయం సాధించారు.

గురువు నిద్రిస్తున్నప్పుడు..

గురువు నిద్రిస్తున్నప్పుడు..

1707లో గురువు నిద్రిస్తున్నప్పుడు తనను చంపేందుకు జంషెడ్ ఖాన్ మరియు వాసిల్ బేగ్ పంపబడ్డారు. గురువు గాఢమైన నిద్రలో వీరు తనను పొడిచి చంపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో గురువు వారితో ధైర్యంగా పోరాడారు. అలాగే దాడి చేసిన వారిని కూడా మట్టుబెట్టారు.

అక్టోబర్ 7న మరణం..

అక్టోబర్ 7న మరణం..

గురు గోవింద్ సింగ్ 1708 అక్టోబర్ 7వ తేదీన మరణించారు. ఈయన కళలంటే చాలా ఇష్టం. అలా తను కూడా ఎన్నో కవితలు రాసేవాడు. గురు గోవింద్ సింగ్ ప్రకారం, సంఘర్షణను పరిష్కరించే అన్ని పద్ధతులు విఫలమైతే తప్ప ఏ ఒక్కరూ కత్తి ఎత్తకూడదు. అందువల్ల తను అన్యాయం మరియు అణచివేతకు వ్యతిరేకంగా మాత్రమే యుద్ధాలు చేశాడు. అలాగే సిక్కు సమాజాన్ని తన సొంత పిల్లలుగా భావించాడు. ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినందున ప్రజలు అతన్ని ‘సర్వంష్ డాని' అని పిలుస్తారు.

English summary

Guru Gobind Singh Jayanti 2021 : Facts About 10th Sikh Guru in Telugu

Guru Gobind Singh, the tenth Guru of Sikhs was born in December 1666 according to the Nanakshahi calendar. Today is his birth anniversary and Sikhs across the world will be observing this day.
Story first published:Tuesday, January 19, 2021, 17:36 [IST]
Desktop Bottom Promotion