For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురునానక్ జయంతి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా..

గురునానక్ బోధనల్లో మంచితనం, స్వచ్ఛత మరియు నిస్వార్థ సేవ యొక్క ధర్మం ఆధారంగా వివిధ సూత్రాలు ఉన్నాయి. గురు గ్రంథ్ సాహిబ్ ఒకే దేవుని పేరు మీద విశ్వాసం మరియు ధ్యానం యొక్క పాఠాలను కలిగి ఉంది.

|

గురునానక్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ ఏడాది నవంబర్ 12న జరుపుకుంటున్నారు. ఈ గురునానక్ జయంతిని ప్రకాశ పర్వం, గురుపార్బ్ అని కూడా అంటారు. ఈరోజున సిక్కులు సిక్కు గ్రంథం, గురు గ్రంథ్ సాహిబ్ ను నిరంతరం పారాయణం చేస్తారు. పల్లకి ఊరేగింపులో గ్రంథంలోని సారాంశాల ఆధారంగా కవితలు పాడతారు. గ్రంథ్ సాహిబ్ ను ఊరేగింపులతో పూలతో అలంకరించిన రథంలో తీసుకెళతారు. ఈ పవిత్ర దినం రోజున గ్రంథ్ సాహిబ్ పంక్తులను జపిస్తారు. ఈ గురునానక్ జయంతి సిక్కు సమాజానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సిక్కు సమాజానికి 10 మంది గురువులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి గురు పార్బ్ ఉంది. సిక్కు ప్రజల మొదటి గురువు గురునానక్ జన్మదినం సందర్భంగా, సిక్కు మతానికి పునాది వేసిన వ్యక్తి ఆయనే కాబట్టి గురునానక్ జయంతిని ఉత్సాహంతో జరుపుకుంటారు. ఆయన పుట్టినరోజు ప్రతి సంవత్సరం చంద్ర క్యాలెండర్ ను బట్టి మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం సిక్కులు 550వ గురునానక్ ప్రకాశ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఈ పండుగ జయంతి గురించి, చరిత్ర మరియు ప్రాముఖ్యతతో పాటు గురునానక్ గురిచి ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1) గురునానక్ చరిత్ర..

1) గురునానక్ చరిత్ర..

గురునానక్ దేవ్ 1469లో రాయ్ -భోయ్-డి తల్వాండి గ్రామంలోని కార్తీక పౌర్ణమిలో జన్మించారు. ఇది అప్పటి ఢిల్లీ సుల్తానేట్ ప్రావిన్స్. ప్రస్తుతం ఈ ప్రదేశం నంకన్ సాహిబ్ అని పిలువబడుతుంది. ఇది ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది. గురునానక్ తల్లిదండ్రులు కళ్యాణ్ చంద్ దాస్ బేడి, వీరిని కళ్యాణ్ దాస్ మెహతా మరియు మాతా త్రిప్తి అని కూడా పిలుస్తారు.

2) రెండు మతాల జ్ఞానం..

2) రెండు మతాల జ్ఞానం..

గురునానక్ హిందూ మరియు ఇస్లాం మతాల గురించి విస్తృతమైన జ్ఞానాన్ని పొందాడు. ఈ మంచి జ్ఞానంతో ఆయన తత్వాన్ని ప్రదర్శించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈయన హిందూ లేదా ముస్లిం లేడని చెప్పేవాడు. అతని బోధనల ప్రకారం ప్రజలు జ్ఞాపకం ద్వారా దేవునితో కనెక్ట్ అవ్వగలరు. అలాగే ఎవరైనా ఏ పేరుతోనైనా దేవుడిని ఆరాధించవచ్చు. అలా ఆయన 15వ శతాబ్దంలో సిక్కు మతాన్ని స్థాపించాడు. గురునానక్ దేవ్ యొక్క బోధనలు సిక్కు ప్రజల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ లో భద్రపరచబడ్డాయి.

3) గురునానక్ బోధనల్లో..

3) గురునానక్ బోధనల్లో..

గురునానక్ బోధనల్లో మంచితనం, స్వచ్ఛత మరియు నిస్వార్థ సేవ యొక్క ధర్మం ఆధారంగా వివిధ సూత్రాలు ఉన్నాయి. గురు గ్రంథ్ సాహిబ్ ఒకే దేవుని పేరు మీద విశ్వాసం మరియు ధ్యానం యొక్క పాఠాలను కలిగి ఉంది. నిజాయితీతో కూడిన ప్రవర్తన కోసం మరియు అందరికీ సామాజిక న్యాయం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. గురు నానక్ దేవ్ ప్రకారం, ఆయన బోధలు సర్వశక్తిమంతుడి నుండి అందుకున్నట్లే.

4) బోధనల కోసం త్యాగం..

4) బోధనల కోసం త్యాగం..

1496వ సంవత్సరంలో గురునానక్ తన బోధనలను వ్యాప్తి చేయడానికి ఆధ్యాత్మిక ప్రయాణంలో 30 సంవత్సరాల పాటు తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. గురునానక్ మరియు అతని బోధనలకు నివాళి అర్పించడానికి మరియు అతని జన్మదినం సందర్భంగా ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రజలు గురు నానక్ జయంతిని తన ప్రకాష్ పర్వ్ లేదా గురుపర్బ్ గా జరుపుకుంటారు.

5) వేడుకలు ఇలా..

5) వేడుకలు ఇలా..

సిక్కు ప్రజలు గురు పార్బ్ కు 15 రోజుల ముందు ప్రతిరోజూ ఉదయాన్నే ప్రభాత్ ఫెర్రీ (మార్నింగ్ మార్చ్) చేస్తారు. వేడుకకు రెండు రోజుల ముందు అఖండ్ పాత్ (గురు గ్రంథ్ సాహిబ్ 48 గంటల పాటు చదవడం) చేస్తారు. అలాగే, గురు పర్బ్ వేడుకలకు ఒక రోజు ముందు నాగర్ కిర్తాన్ నిర్వహిస్తారు. అలాగే గురునానక్ యొక్క బోధనలు అనుసరించడానికి ప్రమాణం చేస్తారు. ఇందులో కామం, కోపం, దురాశ, అనుబంధం మరియు అహంకారం అనే ఐదు చెడు ప్రభావం కలిగిన వాటిని అధిగమించవచ్చు.

6) మార్గదర్శక సూత్రాలు..

6) మార్గదర్శక సూత్రాలు..

గురునానక్ దేవ్ ప్రకారం సిక్కు మతానికి సంబంధించి మూడు మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. ‘‘నామ్ జపన (దేవున్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడం), కిరాత్ కర్ణ (నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటం), వంద్ చకనా (మీతో ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడం).‘‘

7) లాంగర్..

7) లాంగర్..

గురు పర్బ్ రోజున తెల్లవారుజామున 4 గంటల కు ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. ఈ సమయాన్ని అమృత సమయం అని కూడా అంటారు. ఈ భక్తులు ఆసా కి వార్ (ఉదయం శ్లోకాలు), కథల పారాయణం (పవిత్ర కథలు) పాడతారు. తరువాత దీనిని కీర్తన్ (సిక్కు సంప్రదాయాల ప్రకారం శ్లోకాలు) పాడతారు. అప్పుడు సింగ సంప్రదాయాల ప్రకారం ఒక రకమైన కమ్యూనిటీ కిచెన్ అయిన గురుద్వార ప్రాంగణంలో లాంగర్ నిర్వహించబడుతుంది. లాంగర్ నిర్వహించడం యొక్క నినాదం వారి కులం, మతం మరియు సంస్కృతితో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఆహారం ఇవ్వడం. ఇలా నిస్వార్థ సేవను చేస్తారు.

English summary

Guru Nanak Jayanti 2019: Know Date, History And Significance Of Guru Nanak Dev's Prakash Parv

Guru nanak jayanti, also known as guru nanak guruparb and guru nanak prakash parv will be celebrated on 12th november. Here are the details about the date, history and significance of the festival
Story first published:Tuesday, November 12, 2019, 12:22 [IST]
Desktop Bottom Promotion