For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయం లేవగానే మీ భార్యను అలా చూస్తే మీ జీవితం మారిపోతుంది! జుట్టు ఆరబోసుకున్న భార్యను చూస్తే కష్టాలే

|

ఉదయం నిద్రలేవగానే చాలా మంది ఏవేవో చేస్తుంటారు. కొందరు ఎవరి ముఖం చూడకుండా దేవుడి గదిలోకి వెళ్తుంటారు. ఇంకొందరు అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు.

అయితే ఉదయం లేవగానే చూడకూడని, చూడవలసిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.

ఉదయం నిద్రలేవగానే కొందరు తమకు ఇష్టమైన వారి ముఖం చూస్తుంటారు. కొంతమందైతే ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోరు. కానీ కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశానబ్బా అనుకుంటుంటారు. ఉదయం లేవగానే చూడకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి.

జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను చూస్తే

జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను చూస్తే

ఉదయం లేవగానే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు. నుదుటిన బొట్టు పెట్టుకోవడం హిందూ సాంప్రదాయం. బొట్టులేని ఆడపిల్లను పొద్దునే అస్సలు చూడకూడదట. ఆడవారు ఉదయం లేవగానే సరాసరి కిచన్‌లోకి వెళ్ళి సరాసరి పనులు ప్రారంభించేస్తుంటారు. అయితే వంటగదిలోని అపరిశుభ్రమైన పాత్రలను చూడకూడదట. చాలామంది ఇళ్ళలో జంతువుల ఫోటోలను పెట్టుకుంటారు.

అరచేతిని చూసుకుంటే

అరచేతిని చూసుకుంటే

అలాగే పొద్దున్నే క్రూరజంతువుల ఫోటోలు చూడటం మంచిది కాదట. ఉదయం లేవగానే మన అరచేతిని చూసుకుంటే లక్ష్మీప్రసన్నం కలుగుతుందని విశ్వాసం. మన చేతిలోనే లక్ష్మీదేవిని పెట్టారు పరమేశ్వరుడు. నిద్ర లేవగానే భూ దేవతకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనం చేసే పనులను ఆ తల్లే భరిస్తుంది కాబట్టి. ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలుపెట్టాలి. అంతేకాదు బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చెయ్యిని చూస్తూ మంచిది.

బొట్టుపెట్టుకుని అందంగా సింగారించుకున్న భార్యను చూస్తే

బొట్టుపెట్టుకుని అందంగా సింగారించుకున్న భార్యను చూస్తే

అలాగే బొట్టుపెట్టుకుని అందంగా సింగారించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచిదట. అలాంటి అర్థాంగిని చూస్తే కూడా భర్తకు, కుటుంబానికి చాలా మంచిది. అర్థాంగి భర్త కోసమే నోములు, వ్రతాలు చేస్తుంది. అందువల్ల ఉదయాన్నే అలా అందంగా తయారైనా భార్య ముఖం చూస్తే చాలా మంచిది. ఇక తల్లిదండ్రులను ఉదయాన్నే చూస్తే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు, శివపార్వతులను చూసినట్లేనట. ఆవు సకల దేవత స్వరూపమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఆవును ఉదయాన్నే చూస్తే చాలా మంచి ఫలితాలను పొందవచ్చును.

శ్లోకాలు

శ్లోకాలు

ఉదయం నిద్రలేవగానే, పక్క మిద కూర్చుని అరచేయి చూసుకుంటూ చదవవలసిన శ్లోకం ఒకటి ఉంది...

కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతీ,

కరమూలేతు గౌరీ చ ప్రభాతే కరదర్శనం.

అలాగే లేచిన తర్వాత భూమి మిద కాళ్ళు పెడుతూ భూదేవిని కాలితో స్పర్శిస్తున్నందుకు క్షమించమని కోరుతూ ఒక శ్లోకం చదవాలి.. సముద్ర వసనే దేవి, పర్వత స్థనమండలే,

విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే.

అద్దంలో ముఖం చూసుకోవడం

అద్దంలో ముఖం చూసుకోవడం

చదువుకునే పిల్లలు అందరు బ్రాహ్మి ముహూర్తం లో లేస్తే మంచిది. ఒకవేళ అలా లేవలేకపోయి, సూర్యోదయం వేళకు లేచిన కూడా, ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని "ఓం సవిత్రే నమః" అని 11 సార్లు స్మరణ చేస్తే చాల మంచిది. చాలామంది ఉదయం లేవగానే అద్దాన్ని ముందుగా చూసి అందులో తమ ముఖాన్ని చూసుకుంటారు. చాలామంది ఇలాగే చేస్తుంటారు. అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతుంటారు. కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదంటారు. అయితే నిద్ర లేవగానే అద్దాన్ని చూడకూడదని కొందరు జ్యోతిష్యులు చెబుతారు.

ప్రశాంతంగా ప్రారంభం కావాలి

ప్రశాంతంగా ప్రారంభం కావాలి

ఇక ఉదయం ఎంత ప్రశాంతంగా ప్రారంభమైతే.. ఆ రోజంతా అంత ఆరోగ్యకరంగా సాగిపోతుంది. దాంతో రోజూవారీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. మీరు లేవగానే మొబైల్‌ ఫోన్‌కో, ల్యాప్‌టాప్‌కో అతుక్కుపోకుండా రోజూవారి కార్యక్రమాలపై దృష్టి పెట్టండి. మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. బ్రేక్‌ఫాస్ట్ చేసేంతవరకు మొబైల్‌ జోలికి వెళ్లకుండా ఉండం మంచిది.

ఎక్సర్ సైజ్ చేయడం వల్ల

ఎక్సర్ సైజ్ చేయడం వల్ల

ఉదయమే వ్యాయామం, మెడిటేషన్‌ వంటివి చేయండి. లేదంటే కాఫీనో, టీనో తాగుతూ కిటికీలోంచి ప్రకృతిని ఒక్కసారి పరికించండి. లేవగానే పనిలో పడిపోయేవారికంటే... వర్కింగ్‌డేస్‌లో ఎక్సర్‌సైజ్‌, మెడిటేషన్‌లాంటివి చేసేవారు ఆ రోజంతా చలాకీగా, పాజిటివ్‌గా కనిపిస్తున్నారని పరిశోధనల్లో తేలింది. పొద్దునే ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల మీ భావోద్వేగాలను కంట్రోల్‌ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. లేచిన తరువాత నిమ్మరసం నీళ్లు తాగడం శారీరక శక్తితోపాటు మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. నిమ్మరసం మిమ్మల్ని స్థిరంగా ఉంచడమే కాదు.. మీలో సహజ శక్తిని పెంచుతుంది. ఆ నిమ్మరసం తాగిన అరగంట తరువాతనే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి.

ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్లండి

ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్లండి

బ్రేక్‌ఫాస్ట్‌ చేశాం... అంటే చేశాం అని కాకుండా ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం మంచిది. అయితే అది మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. ఉదయమే ఎక్కువ తినడం వల్ల రోజంతా తక్కువ ఆకలి ఉంటుంది. కాబట్టి మంచి అల్పాహారం మీకు శక్తినివ్వడంతోపాటు తాత్కాలిక జ్ఞాపకశక్తిని మెరుగుపరస్తుంది.

 ఓ లిస్ట్ రాసుకోండి

ఓ లిస్ట్ రాసుకోండి

ఆరోజు చేయాల్సిన పనులన్నింటినీ ఓ లిస్ట్ రాసుకోండి. వాటిలో ప్రాధాన్యతను బట్టి సమయాన్ని కేటాయించండి. ఈలోపు ఈ పనిని పూర్తి చేయాలి అని గోల్‌ పెట్టుకోండి. చిన్న చిన్న గోల్స్ పెద్ద పెద్ద విజయాలకు కారణమవుతాయి. ఉదయం లేవగానే మీకు ఆనందాలు తెచ్చిపెట్టే వాటివైపు చూసి తర్వాత మీ కార్యకళాపాలను క్రమబద్ధంగా చేస్తే మీకు అన్నీ విజయాలే.

English summary

Here's how looking at your hands after waking up will get you wealth & good luck!

Here's how looking at your hands after waking up will get you wealth & good luck
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more