Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Ganesh Chaturthi 2021: వినాయక చవితి రోజున ఇంటిని శుభ్రం చేసి ఎలా అలంకరించుకోవాలో తెలుసా..
వినాయకుడిని ప్రతిష్టించేటపుడు పీఠము ఎప్పుడూ ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవాలి. కాంస్య సింహాసనం మీద వినాయకుని విగ్రహం పెడితే అనుకూలమైన స్థలంగా ఉంటుంది.
గణేష్, వినాయకుడు, లంబోదర, విఘ్నేశ్వరుడు, ఆదినాయక ఇలా ఏ పేరుతో పిలిచిన పలికే ఈ దేవుడి విగ్రహాన్ని చాలా మంది వారి ఇళ్లలో ఉంచి పూజలు చేస్తుంటారు.

ఇలా చేస్తే వారికి అదృష్టం, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని వారి నమ్మకం. వినాయకుడి విగ్రహం మీరు ఇంటికి తేవడానికి ముందే మీ చుట్టుపక్కల అంతా ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా ఉండేటట్లు చూసుకోవాలి. అలా కావాలంటే మీరు సాంప్రదాయంగా మీ ఇంటిని శుభ్రం చేసి అందంగా అలంకరించుకోవాలి. అదెలాగో కింది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వినాయకుడి చిత్రాలు వేయండి..
వినాయకుని విగ్రహాన్ని సాధారణంగా మన ఇంట్లోని పూజ గదిలో ఉంచి పూజ చేసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. భారతీయులందరూ పూలమాలలు, ఆభరణాలు వంటి వాటిని తరచుగా వినాయకుని అలంకరణకు ఉపయోగిస్తారు. మీరు మాత్రం కాస్త సృజనాత్మకంగా అందరికంటే భిన్నంగా చేసేందుకు ప్రయత్నించండి. ఈ ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన మీ ఇంటికి వినాయకుని విగ్రహం తీసుకురావడానికి ముందే మీ ఇంటి ముంగిట ముగ్గులు వేయండి. అంతేకాదు వైట్ కలర్ కొల్లాం పౌడర్ తో వినాయకుని చిత్రాన్ని సైతం గీసేందుకు ప్రయత్నించండి.

వినాయకుడి ఆభరణాలు..
అలాగే వినాయకుడిని ప్రతిష్టించేటపుడు పీఠము ఎప్పుడూ ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవాలి. కాంస్య సింహాసనం మీద వినాయకుని విగ్రహం పెడితే అనుకూలమైన స్థలంగా ఉంటుంది. పురాణాల ప్రకారం సిల్వర్ జ్యువెలరీని అలంకరణను వినాయకుడు బాగా ఇష్టపడతారట. కాబట్టి మీరు వెండి ఆభరణాలు, ఆయుధాలు అలంకరణకు ఉపయోగించండి. బంగారం అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణించబడుతుంది. ఒకవేళ మీ వద్ద బంగారు ఆభరణాలు ఉంటే మీ వినాయకుడి విగ్రహానికి బంగారు ఆభరణాలు వేస్తే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

గంధం పవిత్రమైనది..
వీటి తర్వాత గంధం అనేది పూజలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మీరు మీ వినాయకుడి విగ్రహాన్ని అలంకరించేందుకు గంధం గుర్తులను ఉపయోగించవచ్చు. బంతిపూల మాలలు(దండలు) వినాయకుడికి ఆరెంజ్ కలర్ బంతి పూలు అంటే చాలా ఇష్టం.
కాబట్టి ఆ కలర్ పూల మాలలతో వినాయకుని ఉదరం ఒడి మొత్తాన్ని కవర్ చేయవచ్చు.

తలపాగా..
చాలా వరకు వినాయకుని విగ్రహాలకు కీరిటాలకు బదులుగా ఒక అందమైన వస్త్రంతో తలపాటు చుట్టటం సాంప్రదాయంగా వస్తోంది. వీటితో పాటు వినాయకుడి విగ్రహం ఉంచడానికి ముందు ఎల్లప్పుడూ కర్టెన్లు ఉండాలి. అప్పుడే ప్రకాశవంతంగా మరియు శక్తివంతంగా కనిపిస్తుంది.

లైటింగ్..
వినాయకుని విగ్రహం చుట్టూ తాడు లైట్ల నమూనాలతో అలంకరించవచ్చు. మిల మిలా మెరిసే లైట్లను మీ ఇంటి బయట లేదా మీ డాబాపైనే అలంకరించవచ్చు.

మీ థీమ్ ‘గో గ్రీన్‘ అయితే..
వినాయక చవితి నాడు పచ్చదనం గురించి ప్రచారం చేయాలనుకుంటే వినూత్నంగా మీరు గణపతి విగ్రహం చుట్టూ మొక్కలను ఉంచాలి. ప్రతి వస్తువు వద్ద పచ్చదనం ఉట్టిపడేలా అలంకరణ చేసుకోవాలి.

మరాఠా శైలిలో చేయాలనుకుంటే..
మరాఠా శైలి అంటే ఒకవేళ మహారాష్ట్రలో ఉంటే మీరు వినాయకుడి విగ్రహానికి మరాఠీ వేషం కూడా వేయవచ్చు. మీ గణపతి విగ్రహానికి తెల్లని కుర్తా, పంచె, మరియు ఆయన తలచుట్టూ కాషాయ తలపాగా కట్టాలి. ఇవన్నీ ప్రకాశవంతమైన రంగులు కలిసి పండుగ ఉత్సాహాన్ని తీసుకువచ్చేందుకు సహాయపడతాయి.



Click it and Unblock the Notifications