For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఉండకూడని లక్షణాలు..!

ఇంద్రుడు ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించి పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం రాత్రి ఎవరైతే జపిస్తారో వారి ఇంట్లో కుబేరుడు కొలువుంటాడని ప్రతీతి.

By Lekhaka
|

పురాతన హిందూ మతగ్రంథాల ప్రకారం సముద్ర మథనంలో కొందరు ప్రముఖ హిందూమత దేవతలు ప్రత్యక్షమయ్యారు. అలా పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినట్లు హిందూ పురాణాలు వివరిస్తున్నాయి. స్వర్గంలో ఉండే దేవతల సంపదలు, శ్రేయస్సును ఇంద్రుడు నిరంతరం రక్షిస్తుంటాడు.

If you have these 5 traits, Goddess Laxmi will never stay near you!

ఇంద్రుడు ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించి పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు. ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం రాత్రి ఎవరైతే జపిస్తారో వారి ఇంట్లో కుబేరుడు కొలువుంటాడని ప్రతీతి.

ద్వాదశాక్షర మంత్రమైన 'ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మీయే హ్రీం రిం సిధ్వాయే మమ అగాచ్చగచ్చ నమ: స్వాహా' అంటూ ఇంద్రుడు జపించినట్లు విష్ణు పురాణం చెబుతోంది. ఈ మంత్ర జంపానికి సంతోషించిన లక్ష్మీదేవి స్వర్గంలో ఉండటానికి అంగీకరించింది. అయితే తాను చెప్పే ఐదు నియమాలను పాటిస్తే శాశ్వతంగా స్వర్గంలో ఉంటానని నియమాలు పెట్టింది లక్ష్మీదేవి.

ఈ నియమాలు భూలోకంలో ఉండే వాళ్లకు కూడా వర్తిస్తాయని, వీటిని పాటించని వాళ్ల ఇంట్లో ఎట్టిపరిస్థితుల్లో ఉండదని.. లక్ష్మీదేవిని పూజించే భక్తులు నమ్ముతారు. మరి ఎలాంటి నియమాలు ఉల్లంఘిస్తే లక్ష్మీదేవి ఉండదు, ఎలాంటి లక్షణాలు లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తాయో చూద్దాం..

తీవ్రమైన కామ వాంఛ

తీవ్రమైన కామ వాంఛ

ధర్మ, కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలు లేకుండా.. తీవ్రమైన కామవాంఛ కలిగిన వ్యక్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. అహంకారం, అజ్ఞానంతో వ్యవహరించే కుటుంబం, వ్యక్తులు ఉన్న దగ్గర కూడా లక్ష్మీ కటాక్షం ఉండదు.

అహం

అహం

ఎవరైతే అహంకారం, అజ్ఞానంలో మునిగి తేలుతుంటారో, నిత్యజీవన విధానాన్ని నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి నివసించదు.

దురాశ

దురాశ

లక్ష్మీదేవి దురాశపరుల దగ్గర క్షణకాలం కూడా నివసించదు. దురాశ, కర్మ కన్నా పెద్దది. కాబట్టి దురాశపరుల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు.

హింస

హింస

తమ విశ్రాంతి కోసం అమాయక జంతువులు, మానవులకు హాని చేసే వ్యక్తులు, ప్రాంతాల దగ్గర లక్ష్మీదేవి నివసించదు.

మహిళలను అవమానిస్తే

మహిళలను అవమానిస్తే

మహిళలపై క్రూరత్వం లేదా వారి పరువు తీసే స్థలాలలో, అలాంటి వ్యక్తులు ఉండే దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం ఏమాత్రం లభించదు. అంతేకాదు ఆమె ఆగ్రహానికి గురవుతారు.

లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి?

లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి?

ఆచార్య చాణక్యుడి ప్రకారం మూర్ఖ యత్ర పూజ్యంతే ధన్యం యత్ర సుసించితం | దాంపత్యే కలహో నాస్తి తత్ర శ్రీహ్ స్వయమాగతా || ఏ వ్యక్తైతే ఈ 3 విషయాలను మనసులో ఉంచుకుని మెలగుతాడో అలాంటి వాళ్లపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

మూడు విషయాలు

మూడు విషయాలు

తెలివి, న్యాయం, గౌరవం ఉండేవారి ఇంట్లో, అలాంటి వ్యక్తుల దగ్గర లక్ష్మి దేవి అనుగ్రహం అనునిత్యం ఉంటుంది.

అగౌరవం

అగౌరవం

ఇంటికి వచ్చిన అతిథిని అగౌరవ పరిచడం, అగౌరవపరిచి మాట్లాడటం, వారిని రిక్తహస్తాలతో, ఖాళీ కడుపుతో తిరిగి పంపేవాళ్ల దగ్గర లక్ష్మీదేవి నివసించదు. అతిథిని గౌరవించి, కడుపునిండా భోజనం పెట్టి, గౌరవించి పంపే వాళ్ల ఇంట్లో అపారమైన సంపద, శ్రేయస్సు ఉంటుంది.

భార్యాభర్తలు

భార్యాభర్తలు

ఎక్కడైతే భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా, అర్థం చేసుకుని కలిసి నివసిస్తారో వారిని లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది. ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు, మనస్పర్ధలు ఉంటే వాళ్ల ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండదు.

English summary

If you have these 5 traits, Goddess Laxmi will never stay near you!

If you have these 5 traits, Goddess Laxmi will never stay near you. Read on to know more...
Desktop Bottom Promotion