For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే సోమవారం శ్రావణ మాసంలో రెండోది, మీరు ఇంకా పూజలు మొదలుపెట్టలేదా? మూడో సోమవారం చాలా శుభప్రదం

శ్రావణం ప్రారంభమైపోయిందా.. అప్పుడే రెండో శ్రావణ సోమవారం కూడా వచ్చిందా అని కంగారుపడిపోకండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఈ మాసాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వారి డేట్స్ ను ఫాలో అయినా వచ్చే నష్టం లేదు.

|

శ్రావణ మాసం ఆడవారందరికీ రోజూ పండుగే.శ్రావణ మాసం వచ్చేసింది. మనం ఇంకా ఆషాఢంలోనే ఉన్నాం కదా అప్పుడే శ్రావణ మాసం వచ్చేసిందా అనుకోకండి. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసం మొదలైంది. వాళ్లు వ్రతాలు, పూజల్లో నిమగ్నపోయారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 9 వరకు శ్రావణ మాసాన్ని నిర్వహించుకుంటారు.

మొదటి సోమవారం గతనెల 30నే మొదలైంది

మొదటి సోమవారం గతనెల 30నే మొదలైంది

అయితే శ్రావణ మాసంలో మొదటి సోమవారం గతనెల 30నే మొదలైంది. ఆ రోజు నుంచే శ్రావణ పూజలు మొదలుపెట్టిన కూడా ఎలాంటి దోషం కలగదు. ఇంకా పుణ్యఫలం పెరుగుతుంది. ఈ ఏడాది శ్రావణ మాసం 30 రోజులు ఉండనుంది. అధిక మాసం వచ్చినప్పుడే ఇలా శ్రావణం ఉంటుంది. హిందూ పంచాంగం ప్రకారం పదమూడో నెల రావడమే అధికమాసం. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు.

ప్రతి సోమవారం శుభప్రదమే

ప్రతి సోమవారం శుభప్రదమే

ఇక ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శుభప్రదమే.

లక్ష్మీ దేవిని ఈ మాసంలో పూజిస్తే సకల సంపదతో పాటు ఆయురాగ్యాలతో ఉంటాం. చాలా మంది ఆడవారు శ్రావణంలో వ్రతాలు కూడా ఎక్కువగా చేస్తుంటారు. అందులో వరలక్ష్మీ వ్రతం కూడా ఒకటి. దీని వల్ల కష్టాలు పోయి అంతా శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

లక్ష్మీదేవికి సోమవారం, శుక్రవారం బాగా ఇష్టమున్న రోజులు. అందుకే ఆ రోజుల్లో పూజలు చేస్తే అమ్మవారు కరుణిస్తారు. వరాలు కురిపిస్తారు. అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

మొదటి సోమవారం - జూలై 30, 2018

మొదటి సోమవారం - జూలై 30, 2018

శ్రావణ మాసంలో మొదటి సోమవారం మొదలైంది. గత నెల 30వ తేదీనే శ్రావణ మాసం తొలి సోమవారం. మొట్ట మొదటి సోమవారనా సౌభాగ్య యోగ, ద్విపక్షర్ యోగ్ , ధనిష్ట నక్షత్ర కలిసి వస్తాయి. ఇవన్నీ రావడం చాలా శుభప్రదం. ఇక ఆ రోజు పార్వీతీ సమే శివ భగవానున్ని పూజించినట్లయితే అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. ఆ రోజు శివపూజ చేసిన వారికి, ఇతరులకు ఏదో ఒకటి దానం చేసిన వారికి ఏడాదంతా శుభాలే కలుగుతాయి.

రెండో సోమవారం - ఆగష్టు 6, 2018

రెండో సోమవారం - ఆగష్టు 6, 2018

ఆగష్టు 6 అంటే వచ్చే సోమవారం శ్రావణ మాసంలో రెండో సోమవారం. రెండో సోమవారం సర్వార్త్ సిద్ధి యోగ్ వ్రిద్ది యోగ్ అనేవి కలుగుతాయని నమ్మకం. ఆ రోజు కృత్రిక నక్షత్ర ఉంటుంది. ఆ రోజు ఇష్టదైవాన్ని పండ్లతో పూజిస్తే మంచి పుణ్యఫలం దక్కుతుంది.

మూడో సోమవారం - ఆగష్టు 13, 2018

మూడో సోమవారం - ఆగష్టు 13, 2018

శ్రావణ మాసంలో మూడో సోమవారం ఆగస్టు 13 వ తేదీన వస్తుంది. ఆ రోజు పూర్వ పాల్గొన నక్షత్రం ఉంటుంది. ఆ రోజు శివున్ని పూజిస్తే ఎంతో పుణ్యఫలం. ఆ రోజు నిష్టతో ఉంటే మీకు ఈ ఏడాదంతా అన్నీ అదృష్టాలే. అన్ని శ్రావణ సోమవారాల్లో ఇది చాలా శుభప్రదం. కాబట్టి ఆ రోజు మాత్రం మీ ఇష్ట దైవాన్ని పూజించడం మరిచిపోకండి.

నాలుగో సోమవారం - ఆగష్టు 20, 2018

నాలుగో సోమవారం - ఆగష్టు 20, 2018

ఆగస్టు 20 వ తేదీన నాలుగో సోమవారం ఉంటుంది. ఆ రోజు కూడా పార్వతీసమేత శివుడికి, లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తే ఎంతో మంచిది. ఆ రోజు శివుడికి పాలు, చెరకు రసం వంటివి సమర్పిస్తే శుభాలు కలుగుతాయి.

ఐదో సోమవారం

ఐదో సోమవారం

శ్రావణ మాసం అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో సారి మొదలతుంది. అయితే ఏ ప్రాంతం శ్రావణం మాసం అయినా మనం నిష్టతో పాటిస్తే చాలు. ఇక కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో ఐదో సోమవారం కూడా ఉంది.

కొన్ని ప్రాంతాల్లో జులై 16, 2018 నుంచే శ్రావణ మాసం ప్రారంభమైంది. అంటే ఐదు సోమవారాలను కొందరు నిర్వహించుకుంటున్నారు. కొందరేమో జూలై 28 శ్రావణం ప్రారంభంకావడంతో 30 నుంచి శ్రావణ మాసాన్ని మొదలుపెట్టారు.

నిష్టతో పూజలు చేస్తే చాలు

నిష్టతో పూజలు చేస్తే చాలు

ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. వామ్మో శ్రావణం ప్రారంభమైపోయిందా.. అప్పుడే రెండో శ్రావణ సోమవారం కూడా వచ్చిందా అని కంగారుపడిపోకండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఈ మాసాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వారి డేట్స్ ను ఫాలో అయినా వచ్చే నష్టం లేదు. లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కాబోయే శ్రావణమాసం డేట్లను ఫాలో అయినా ఎలాంటి నష్టం లేదు.

అమ్మవారికి, భగవంతునికి నిష్టతో పూజలు చేస్తే చాలు.శ్రావణ మాసంలో చాలా పండుగలు కూడా ఉన్నాయి.మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, రక్షాబంధన్, శ్రావణ పౌర్ణమి ఇలా చాలా పర్వదినాలు శ్రావణంలో రానున్నాయి.

English summary

importance of shravana mondays note down the dates of somwars in this auspicious month

importance of shravana mondays note down the dates of somwars in this auspicious month
Story first published:Friday, August 3, 2018, 12:57 [IST]
Desktop Bottom Promotion