For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలాంటి సమయాల్లో మీకు భయమేస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి...!

|

మనలో చాలా మంది అప్పుడప్పుడు అకస్మాత్తుగా భయపడుతూ ఉంటాం. అందులోనూ ముఖ్యంగా మన సొంత ఇంట్లోనే ఒంటరిగా ఉన్న సమయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి.

ఇంకా కొన్నిసార్లు సడెన్ గా ఏవేవో శబ్దాలు వినిపించడం.. ఎవరో మనల్ని పిలిచినట్టు అనిపించడం.. మనం బయటకు వెళ్లి చూస్తే ఎవ్వరు కనిపించకపోవడం వంటివి జరిగితే మనకు చాలా భయమేస్తుంది.

కొన్నిసార్లు పిల్లి ఇంట్లోకి మెల్లగా వచ్చినా కూడా సడెన్ ఉలిక్కి పడుతూ ఉంటాం. అంతేకాదు అనవసరమైన విషయాలను తలచుకుని తెగ ఆందోళన పడిపోతూ ఉంటాం. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే.. ఇంట్లో ప్రతికూల శక్తులు క్రీయాశీలతల వల్ల కూడా కావొచ్చు.

ఇలాంటి సమయంలో మన ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వారి ఆత్మలు తిరుగుతున్నాయని, వాటి వల్లే తమకు ఇలాంటి ఆందోళన పడుతున్నామోనని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో మీ మనసులో ఇలాంటి భయాల నుండి విముక్తి పొందడానికి వాస్తుశాస్త్రం కొన్ని చిట్కాలను చెబుతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

'బతుకమ్మ'ఈ ఏడాది ఎందుకని ఆలస్యమైంది? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

మూగజీవాలకు ఆహారం తినిపించాలి..

మూగజీవాలకు ఆహారం తినిపించాలి..

మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు భయం కలగకుండా ఉండాలంటే, మీరు మూగజీవాలైన ఆవులు, కుక్కలు, చీమలు, పక్షులకు ఆహారాన్ని అందించాలి. ఇలా వాటికి తినిపించడం ద్వారా పుణ్య ఫలాలు అందుతాయి.

పూర్వం నుంచే..

పూర్వం నుంచే..

హిందూ ధర్మంలో ఆవును పవిత్రంగా, గౌరవాన్ని చిహ్నంగా భావిస్తారు. ఆవులో సకల దేవతలు ఉంటారని విశ్వసిస్తారు. గోదానం అనే సంప్రదాయం పూర్వం నుండి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆవును ఆరాధించడం ద్వారా లక్ష్మీదేవి కూడా సానుకూలంగా మీపై అనుగ్రహం పెంచుతుంది.

ప్రతికూల శక్తులను తొలగించడానికి..

ప్రతికూల శక్తులను తొలగించడానికి..

మీ ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులను తొలగించడానికి మీరు గుర్రపుడెక్క(గుర్రానికి వేసే కళ్లెం)ను ఉపయోగించాలి. ప్రతికూల శక్తులపై గుర్రపుడెక్క చాలా ప్రభావవంతంగా పరిగణిస్తారు. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం(తలుపు) ద్వారా ఇంగ్లీష్ లో 'U' ఆకారంలో వేలాడదీయండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులను రానివ్వకుండా కాపాడుతుంది. అంతేకాదు ఇంట్లో సానుకూల శక్తిని లభిస్తుంది.

2020లో అధిక మాసం ఎప్పుడొచ్చింది.. ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా? చేయకూడదా?

సానుకూల శక్తిని ఆకర్షించడానికి..

సానుకూల శక్తిని ఆకర్షించడానికి..

అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం ద్వారా కుంకుమతో స్వస్తిక్ గుర్తును ముగ్గులా వేయండి. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఫలితంగా ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది.

తూర్పు దిక్కున..

తూర్పు దిక్కున..

వాస్తు శాస్త్రం ప్రకారం ఒక్కో దిశకు విభిన్నమైన అధిపతులు ఉంటారు. అందులో అతి ముఖ్యమైనది తూర్పు భాగం ముఖ్యమైనది. ఒకవేళ మీ ఇల్లు ఈశాన్య దిక్కులో ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులు పండితులు లేదా డబ్బు సంపాదించేవారు అవుతారు. అలాగే మీరు గొప్ప వ్యక్తులు అయ్యే అవకాశం ఉంది.

వాస్తు దోషంగా..

వాస్తు దోషంగా..

ఒకవేళ మీ ఇంట్లో పై దిశలో మరుగుదొడ్డి లేదా ఏదైనా పెద్ద చెట్టు లేదా ఇతర అవరోధాలు ఉన్నట్లయితే, అది వాస్తుదోషమని చెప్పాలి. మీ ఇంట్లో ఇలాంటి వాస్తు దోషం ఉన్నట్లయితే ఇంటి ప్రధానద్వారం వద్ద కుంకుమ, ఆవు నెయ్యిని కలిపి తిలకాన్ని దిద్దాలి. కొన్ని పూలమొక్కలను అక్కడ నాటాలి.

హనుమాన్ చాలీసా పారాయణం..

హనుమాన్ చాలీసా పారాయణం..

పైన చెప్పిన దోషాలు ఏమీ లేకున్నా కూడా, మీరు సొంత ఇంట్లో ఉన్నప్పుడు, ఎప్పుడైనా భయం కలిగితే, మీరు రాత్రి నిద్రించే ముందు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలాగే మీరు ఎవరైనా చనిపోయినప్పుడు, వారి అంత్యక్రియలకు వెళ్లినప్పుడు కొన్ని నాణేలు స్మశానంలో వేసి వెనుదిరిగి చూడకుండా రావాలి. ఈ పరిహారాల వల్ల ఎలాంటి అవరోధాలైనా వెంటనే తొలగిపోతాయి. అంతేకాకుండా ఇంట్లో ఎలాంటి భయాలు మీకు కలగవు.

English summary

Is it scary to have someone at home, then you follow tips of vastu shastra

Here we talking about the is it scary to have someone at home, then you follow tips of vaastu shastra. Read on
Story first published: Thursday, September 17, 2020, 16:03 [IST]