For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కృష్ణాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు!

By Super Admin
|

లోకాన్ని రక్షించే దేవుడు అయినా విష్ణువు ఎనిమిదవ అవతారమే కృష్ణ అవతారం. భూమి మీద పెరుగుతున్న అన్యాయాలు మరియు ప్రజలను హింసించే వారి మీద పోరాటం చేయటానికి విష్ణువు అవతారాలను ఎత్తుతూ ఉంటారు.

కృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి భగవద్గీతను బోధించెను. భగవద్గీతను సంపూర్ణంగా అర్ధం చేసుకుంటే జీవితం యొక్క నిజమైన విలువ మరియు జీవితం అంటే ఏమిటి అనే విషయాలు అర్ధం అవుతాయి.

Life Lessons To Learn From Lord Krishna

కృష్ణుడి దగ్గర నుంచి నేర్చుకోవలసిన విషయాలు భగవద్గీత నుండే కాకుండా అయన జీవితం గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. అయన ముఖ కవళికలను చుస్తే వెయ్యి మాటలను మాట్లాడినట్టు అనిపిస్తుంది. శ్రీకృషుడు జీవితం నుంచి పాఠాలు నేర్చుకుంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సంతృప్త మరియు అర్ధవంతమైన అనుభవం ఉంటుంది.

Life Lessons To Learn From Lord Krishna

శ్రీకృష్ణుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు

డిటాచ్ మెంట్

ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. గతంలో జరిగినవి వర్తమానంలోకి రావు. ఈ క్షణంలో జీవిస్తున్నాం. ప్రతి క్షణాన్ని అర్ధవంతం చేయటం ముఖ్యం.

జీవితంలో కొన్ని క్షణాలు మిమ్మల్ని వేరుచేసేవిగా ఉంటాయి. ఆ సమయంలో ఒంటరిగా మరియు విచారంలో కురుకుపోకుండా ఉండాలి. శ్రీ కృష్ణుడు గోకులంలో అతని స్నేహితులతో ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతూ పెరిగాడు. అయితే అతని కర్తవ్య నిర్వహణలో ఆ క్షణాల నుండి బాధ్యతల వైపు వెళ్లారు.

Life Lessons To Learn From Lord Krishna


కర్మ

కర్మ అనేది కృష్ణుడు జీవితం నుంచి నేర్చుకొనే విషయాలలో ముఖ్యమైనది. కర్మ అనేది ప్రతి ప్రాణికి విధిగా ఉంటుంది.

దీన్ని ప్రతి ఒక్కరు నిర్వహించిన సరే ఫలితం అనేది ఒక్కొక్కరికి ఒకో రకంగా ఉంటుంది. కర్తవ్య నిర్వహణ లేదా కర్మ మీద దృష్టి ఉండాలి. అయితే ఫలితాన్ని ఆశించకూడదు. నిర్దిష్ట సమయంలో ఒక వ్యక్తిని నియంత్రణలో లేని అనేక కారకాలు ప్రభావితం చేయవచ్చు.

ధర్మ

ధర్మ మార్గంలో నీతి ఉంటుంది. అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో తన సొంత కుటుంబంనకు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి సంశయించెను. అప్పుడు కృష్ణుడు ధర్మ మార్గం అనుసరించమని చెప్పెను.

కృష్ణుడు అర్జునుడి యొక్క బాధ్యతలను మరియు మానవజాతి పట్ల తన విధులను గుర్తు చేసెను. యుద్ధరంగంలో అన్న,తమ్ముడు,మనవడు అనే తేడాలు ఉండవని ధర్మ ప్రకారం నడుచుకోవాలని చెప్పెను.

Life Lessons To Learn From Lord Krishna

ప్రశాంతమైన మనస్సు

మనం హడావిడిగా ఉన్నప్పుడు తప్పులు చేసే అవకాశం ఉంది. అన్ని సార్లు ప్రశాంతతగా ఉండటం అనేది కృష్ణుడు జీవితం నుంచి నేర్చుకోవాలి.

ఎప్పుడు కృష్ణుడు ముఖం మీద చిరునవ్వు ఉంటుంది. ఆ చిరునవ్వు తాను పూర్తి నియంత్రణతో కూడిన ప్రశాంతత మరియు కూర్చిన వ్యక్తిత్వం గురించి తెలియజేస్తుంది. ఏది ఏమైనా అతని నిర్ణయం చాలా దృడంగా ఉంటుంది.

Life Lessons To Learn From Lord Krishna

నిజమైన స్నేహితులు

ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి స్నేహితులు అవ్వరు. వారి మనస్సు చుసిన అయినా స్నేహితులే నిజమైన స్నేహితులు. మీరు ఎవరినైనా స్నేహితుడిగా భావిస్తే అతనికి నిజాయితీగా మరియు విశ్వాసపాత్రంగా ఉండాలి. పేద సుదామ ద్వారకా శ్రీకృష్ణుని సందర్శించినప్పుడు, కృష్ణ తన చిన్ననాటి స్నేహితుడుని స్వాగతించడానికి తన భవనం నుండి పరిగెత్తుకుని వచ్చెను.

ఆ సమయంలో కృష్ణుడు,సుదాముడికి తాము రాజు పేద అనే భావం కనపడలేదు. కేవలం ఇద్దరం స్నేహితులం అనే భావనలో ఉన్నారు.

శ్రీకృష్ణుడు జీవితంలో సులభంగా నేర్చుకొని చేయటానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు జీవితాన్ని తెలుసుకుంటే జీవితంలో కొన్ని సానుకూల మార్పులను చేసుకోవటానికి సహాయపడుతుంది.

English summary

Life Lessons To Learn From Lord Krishna

Life Lessons To Learn From Lord Krishna,Lord Krishna is the eighth incarnation of Lord Vishnu, the god of preservation. He descended upon this earth to fight the increasing injustice and evil deeds of people.The sermons that he delivered to Arjuna before the battle of Mahabharata are compiled in the Bhagwat G
Desktop Bottom Promotion