లార్డ్ మురుగన్ – శివ శక్తి కుమారుడు, ప్రసిద్ది చెందిన హిందూ దేవుడు

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

మురుగ స్వామీ లేదా మురుగన్ ప్రసిద్దిచెందిన హిందూ దేవత, ఈయన శివుడు, పార్వతి కుమారుడు. 'మురుగు' అంటే సౌందర్యం అని కాబట్టి 'మురుగన్' అంటే...

మురుగ స్వామీ లేదా మురుగన్ ప్రసిద్దిచెందిన హిందూ దేవుడు, ఈయన శివుడు, పార్వతి కుమారుడు. 'మురుగు' అంటే సౌందర్యం అని కాబట్టి 'మురుగన్' అంటే 'అందమైన వాడు' అని అర్ధం. లార్డ్ మురుగని కార్తికేయ, స్కంద, గుహ, సుబ్రమణ్య అనే పేర్లతో కూడా పిలుస్తారు.

ఈయనను దక్షిణ భారతీయులు భారతదేశం, విదేశాల వారు ఇద్దరూ ప్రత్యేకంగా పూజిస్తారు. లార్డ్ మురుగ యుద్ధ దేవత, తమిళనాడు వాళ్ళకు ఈయన రక్షించే దేవుడు. మురుగన్ ఎప్పుడూ దుఃఖంలో, బాధలో ఉన్న భక్తులకు సహయంచేయడంలో ఎప్పుడూ వెనుకాడడు. అవరోధాలను తొలగించే దేవుడు, ప్రారంభ దేవుడు అయిన వినాయకుడు మురుగన్ సోదరుడు.

లార్డ్ మురుగ దర్శనం

లార్డ్ మురుగ దర్శనం

కార్తికేయుడు ఎప్పుడూ తన దివ్యమైన ఆయుధం దండాయుధం - బరిశ తో నెమలి మీద కూర్చుని దర్శనమిస్తాడు. అతను కత్తి, జావలిన్, గద, డిస్కస్, విల్లు వంటి ఆయుధాలతో కనిపిస్తాడు, అంతేకాకుండా ఆయన ఎక్కువ సాధారణంగా శక్తి లేదా ఈటెను పట్టుకుని ఉంటాడు. లార్డ్ మురుగ తనకున్న రక్షణను తెలియచేయడానికి జవేలిన్ ని గుర్తుగా ఉపయోగిస్తాడు, అన్ని బాధలను పోగొట్టడానికి విల్లు సామర్ధ్యాన్ని చూపిస్తుంది, అతని గద ఆయన బలాన్ని తెలియచేస్తుంది, డిస్కస్ సత్యంపై అతని జ్ఞానాన్ని సూచిస్తుంది.

లార్డ్ మురుగన్ వాహనం నెమలి, ఇది అహం నాశనాన్ని సూచిస్తుంది. మురుగన్ ఆరు తలలతో షణ్ముఖగా పరిగానిన్చాబడ్డాడు, ఇది వారి ఆధ్యాత్మిక అభివృద్ధి క్రమంలో సిద్దిలు అందచేసేవాడి సంబంధాన్ని సూచిస్తుంది. వల్లి, దేవసేన లు మురుగన్ భార్యలు.

మురుగ పుట్టుక కధ

మురుగ పుట్టుక కధ

శివ, శక్తి వివాహం తరువాత, జ్ఞానం, వెలుగు కలిసి అందించిన వారమే లార్డ్ మురుగ అని చెప్తారు. సూరపద్మన్ క్రూరత్వంతో, దేవతలు ఆరాక్షసుడిని భరించలేక, సహాయం కోసం శివుని వద్దకు వస్తారు. శివుడు ఆరు ముఖాలు కల రూపాన్ని పుట్టించి, ప్రతి ముఖం మూడవ కన్ను నుండి వెలుగు వచ్చేట్టు చేసాడు.

గంగానది నుండి అగ్ని వెలుగులను తీసుకోవాలని శివుడు వాయు, అగ్నిని కోరాడు. తరువాత గంగ ఆరు వెలుగులను ఆరు పిల్లలుగా ఆరు ఎర్ర తామర పూలను శరవన్ చెరువుకు తీసుకెళ్ళింది. పార్వతీదేవి వాటినన్నిటినీ కలిగి కౌగలించుకుని, ఆరు తలలను, పన్నెండు చేతులను కలిపి ఒక ఆకారాన్ని చేసి స్కందన్ అని పేరుపెట్టింది.

ఆయన కార్తికేయన్ అని కూడా పిలువబడ్డాడు, కర్తిగై అనే ఆరుగురు అమ్మాయిలూ అతనిని చూసుకుంటారు.

లార్డ్ మురుగన్ ప్రసిద్ధ ఆలయాలు

లార్డ్ మురుగన్ ప్రసిద్ధ ఆలయాలు

భారతదేశంలో మురుగన్ కి అనేక ఆలయాలు ఉన్నాయి, శ్రీలంక, మలేషియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్, కెనడా మొదలైనవి.

వాటిలో ఎక్కువ ప్రసిద్ది చెందినవి

వాటిలో ఎక్కువ ప్రసిద్ది చెందినవి

1)తమిళనాడు లోని ఆరుపడైవీడు ఆలయం - దీనితో పాటు పళని మురుగన్ ఆలయం, స్వామిమలై మురుగన్ ఆలయం, తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, పాఝాముడిర్చోలై మురుగన్ ఆలయం, తిరుప్పరంకున్రం మురుగన్ ఆలయం అనే ఆరు మురుగన్ ఆలయాలు ఉన్నాయి.

2)కర్ణాటక లోని కుక్కి సుబ్రమణ్య ఆలయం

3)శ్రీలంక లోని నల్లూర్ కందస్వామి ఆలయం

4)మలేషియా లోని బాతు కేవ్స్ ఆలయం

5)సింగపూర్ లోని శ్రీ తండయుతపాని ఆలయం

6)యునైటెడ్ కింగ్డమ్ లోని హైగేట్ హిల్ మురుగన్ ఆలయం

7)ఆస్ట్రేలియా లోని సిడ్నీ మురుగన్ ఆలయం

8)యునైటెడ్ స్టేట్స్, నార్తర్న్ క్యాలిఫోర్నియా లోని శివ మురుగన్ ఆలయం

9)స్విట్జర్లాండ్ లోని శ్రీ శివసుబ్రమనియర్ ఆలయం

10)ఒంటారియో లోని కెనడా కందసామి ఆలయం

English summary

Lord Muruga - Son of Shiva Shakti

Lord Kartikeya is a well known figure in Hindu mythology. He addressed by different names such as Murugan, Subramaniam, Sanmukha, Skanda and Guha. He is most popular as Lord Murugan in the southern states of India. A number of temples dedicated to the deity can be spotted all over the South India.
Story first published: Thursday, January 4, 2018, 12:00 [IST]