For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహా శివరాత్రి 2020 : శివలింగానికి, జ్యోతిర్లింగానికి తేడాలేంటో తెలుసా...

|

'శివుని ఆదేశం లేనిదే చీమైనా పుట్టదు' అనే విషయాన్ని మీరే వినే ఉంటారు. సర్వోన్నత దేవుడిగా ప్రసిద్ధి చెందిన పరమేశ్వరుడిని హిందువులు చాలా ఎక్కువగా నమ్ముతారు. శివుని భక్తులు ఆయనపై అపారమైన విశ్వాసం కలిగి ఉంటారు. అందువల్ల శివుని భక్తులంతా ఆయన ఆధ్యాత్మిక రూపమైన శివలింగాన్ని తరచుగా ఆరాధించడం అనే విషయాలు మనకు అగుపిస్తాయి.

అయితే చాలా మంది శివలింగాన్ని ఆరాధించడంతో పాటు కాంతి స్తంభమైన జ్యోతిర్లింగాలను కూడా ఆరాధిస్తారు. ఏడాది పొడవునా, ముఖ్యంగా మహా శివరాత్రి సమయంలో ఈ ఆలయాలను సందర్శిస్తారు. ఈ సంవత్సరం మహా శివరాత్రి ఫిబ్రవరి 21వ తేదీన వచ్చింది. శివలింగాన్ని ఆరాధించడం వల్ల సంపద, ఆరోగ్యం, శాశ్వతమైన శాంతి లభిస్తాయని భక్తులంతా నమ్ముతారు.

అది వారి ఆత్మను శుద్ధి చేస్తుంది. మరి జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం వల్ల ఆశీర్వాదం, అదృష్టం, శ్రేయస్సు వంటివి కూడా లభిస్తాయని నమ్ముతారు. శివుని యొక్క రెండు ఆధ్యాత్మిక రూపాలైన వీటిని సమాన అంకిత భావంతో మరియు విశ్వాసంతో ఆరాధిస్తారు. అయితే ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాలేంటో మీకు తెలుసా? తెలియకపోతే ఈ స్టోరీని చూసి తెలుసుకోండి...

ఓం 'నమ శివాయ' (పంచాక్షరి) మంత్రం ఎలా ఉద్భవించిందో తెలుసా...

లింగం అంటే...

లింగం అంటే...

మనకు కనిపించే గగనమే ఒక లింగం. భూమి అనేది దాని పీఠం. అదే సమస్త దేవతలకు నిలయం. ఇదే అంతా లయం చెందుతుంది. అందుకే దీనిని లింగం అని అంటారు. ‘లిం‘ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్న దానిని, ‘గం‘ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తు ఉంటుంది. అందుకే అది ఒక లింగమైంది.

శివ లింగం..

శివ లింగం..

శివుని పురాణ కథల ప్రకారం.. శివ లింగ అంటే శివుడితో సంబంధం ఉన్న చిహ్నం మరియు లింగం. జ్యోతిర్లింగం అనేది శివుని యొక్క అభివ్యక్తి. ఇది ‘స్వయంభు‘గా సంభవిస్తుంది. ఇలా జ్యోతిర్లింగాలు 64 ఉన్నప్పటికీ, మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు సొంతంగా ఉనికిలోకి వచ్చాయి. మన దేశంలో అనేక శివలింగాలు ఉన్నాయి. శివుని భక్తులంతా వాటిని అత్యంత భక్తితో ఆరాధిస్తారు.

ఈ జ్యోతిర్లింగాలు..

ఈ జ్యోతిర్లింగాలు..

ఈ జ్యోతిర్లింగాలు మన దేశంలోని 12 వేర్వేరు ప్రదేశాలలో వెలిశాయి. శివుడు కాంతి రూపంలో కనిపించే చోటు. శివుడు భారతదేశంలోని 12 వేర్వేరు ప్రదేశాలలో జ్యోతిర్లింగ రూపంలో ప్రసిద్ధి చెందాడు. ఈ 12 జ్యోతిర్లింగాలు 12 వేర్వేరు రాశిచక్ర గుర్తులను కూడా శాసిస్తాయి.

జ్యోతిర్లింగ కథ..

జ్యోతిర్లింగ కథ..

శివ పురాణంలోని ఓ పౌరాణిక కథనం ప్రకారం, ఒకప్పుడు విశ్వాన్ని ఏర్పాటు చేసేవాడు బ్రహ్మ మరియు విష్ణువు. విశ్వం యొక్క పెంపకందారుడు, వారిలో ఎవరు గొప్ప అనే దానిపై చర్చ జరిగింది. వారి చర్చ చాలా ఎక్కువసేపు సాగింది. ఇది ఇతర దేవుళ్లను భయపెట్టింది. బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య చర్చను ఆపడానికి ఇతర దేవుళ్లు శివుడిని ఆశ్రయించారు.

శివుడిని పూజించే ప్రతి పువ్వుకు ఒక అర్ధం మరియు ప్రయోజనం ఉంటుంది: ఈ పువ్వులతో మీ కోరికలు తీరుతాయి

కాంతి రూపంలో..

కాంతి రూపంలో..

ఆ సమయంలో శివుడు కాంతి స్తంభం రూపంలో కనిపించాడు. విష్ణువు మరియు బ్రహ్మ జ్యోతి(కాంతి) స్తంభంతో ఆశ్చర్యపోయారు. కానీ యొక్క మూలాన్ని మరియు ముగింపును కనుగొనలేకపోయారు. దీనిని మొదట ఎవరైతే చేరుకుంటారో వారే గొప్పవారు అని వారిద్దరూ నిర్ణయించుకున్నాడు.

ఎంత శోధించినా..

ఎంత శోధించినా..

వారు ఇద్దరూ కాంతి యొక్క మూలాన్ని మరియు ముగింపును శోధించడానికి వెళ్లారు. కానీ దానిని మాత్రం కనుగొనలేకపోయారు. అప్పుడు శివుడు అసలు రూపంలోకి మారి, ఈ ముగ్గురిలో ఎవరూ బ్రహ్మ, విష్ణు, మహేష్(శివ) ఒకరికొకరు గొప్ప వారు కాదని వివరిస్తాడు. కానీ ముగ్గురు సామూహిక శక్తి అని, ఇది చాలా గొప్పదిగా ఉంటుందని చెబుతారట. అలా జ్యోతి స్తంభం తరువాత ‘జ్యోతిర్లింగ‘గా పిలువబడింది.

English summary

Maha Shivratri 2020: Know The Difference Between Jyotirlinga And Shivlinga

This year, devotees of Lord Shiva will be celebrating Maha Shivratri on 21 February 2020. On this day theyll visit and worship different Jyotirlingas and Shivlingas but do you know what is the difference between them? Read the same below.
Story first published: Thursday, February 20, 2020, 17:31 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more