Latest Updates
-
చిన్న గొడవలకే భార్యాభర్తల మధ్య అహం.. ఈ ఏడు మంత్రాలతో అన్యోన్య బంధం.! -
ఖరీదైన సీరమ్‌లు వద్దు.. ఈ ఒక్క కూరగాయతో మెరిసే ముఖం మీ సొంతం.! -
పోషకాల గని..డిన్నర్ లోకి హెల్తీ బ్రోకలీ చీజ్ పరాఠా..ఒక్క ముక్క కూడా మిగల్చరు! -
ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పిన ‘మాయ’ అంటే నిజంగా ఏమిటి? -
ఒత్తిడితో కంటి మీద కునుకు కరువు.. ఈ యోగాసనాలతో ఇట్టే నిద్ర పట్టేస్తుంది.! -
సియా పాయింట్ ఎక్కడ? కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు తర్వాత ఆ కోటకి పోటెత్తిన పర్యాటకులు -
బంధంలో పెరుగుతున్న ప్రైవేట్ ‘స్పేస్’.. దూరం చేస్తుందా లేక ప్రేమను పెంచుతుందా.? -
వ్యాధినిరోధక శక్తిని పెంపు, ఎముకలకు కొండంత బలం..హైదరాబాదీ పెళ్లిళ్ల స్పెషల్ మటన్ మరాగ్ -
మీ పిల్లల్లో చుండ్రు సమస్య.. ఈ జెల్‌ను కాసేపు తలకు పట్టిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.? -
రోజుకు ఎన్ని పండ్లు తినాలి? డాక్టర్ చెబుతున్న చేదు నిజాలివే!
Markandeya Jayanti 2022: మార్కండేయ జయంతి ఎప్పుడు? చిరంజీవుడిగా ఎలా మారాడు?
మార్కెండేయ జయంతి తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలో మార్కండేయ జయంతిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 3వ తేదీన గురువారం నాడు మార్కేండయ జయంతి వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం, బృగ మహర్షి కుమారుడు మార్కేండేయుడు.

అల్పాయుష్కుడైన తనను 16 సంవత్సరాల వయసులోనే ఆ పరమేశ్వరుడు మరణం నుండి తప్పించాడని చాలా మంది నమ్ముతారు. అందుకే మార్కండేయ మహర్షి జయంతి రోజున భక్తులందరూ ప్రత్యేక పూజలు, రథోత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మార్కండేయ జయంతి చరిత్ర గురించి.. మార్కేండేయుని ప్రాముఖ్యత గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అష్టాదశ పురాణాలలో..
హిందువుల అష్టాదశ పురాణాలలో ఒకటి మార్కండేయుని పురాణం. శివుని భక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ మార్కండేయుడిని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చిన్నారుల్లో దేవుని పట్ల విశ్వాసాన్నీ, కోరికలను నెరవేర్చుకోవడంలో చూపాల్సిన పట్టుదల పెంచేందుకు మార్కేండేయుని కథను ఆదర్శంగా చెబుతారు.
పూర్వం మృకండుడు అనే ఒక ముని ఉండేవాడు. ఆయనకు మరుద్వతి అనే భార్య ఉండేది. ఆయన పరమేశ్వరుడిని స్మరించుకుంటూ ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు తనను తన్నుకుంటూ పోయినా పట్టించుకునేవాడు కాదట. ఆ భోలేనాథుడిని స్మరించుకుంటూ హాయిగా జీవిస్తున్న ఆ దంపతులిద్దరికీ ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టలేదట. పిల్లలు పుట్టాలని కోరుకుంటూ వారు వారణాసికి చేరుకుని అక్కడ పరమేశ్వరుడిని పూజించడం ప్రారంభిస్తారు.

పరమేశ్వరుడు ప్రత్యక్షమై..
వారి దీక్షకు ముగ్దుడైన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమై ‘మీకు తప్పకుండా పిల్లలు పుడతారు.. కానీ ఎలాంటి పిల్లలు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే 16 సంవత్సరాలు మాత్రమే జీవించే ఉత్తమ పురుషుడు కావాలా' అని అడిగాడట. అప్పుడు వారిద్దరూ ‘వ్యక్తిత్వం లేని వ్యక్తులు ఎన్నిరోజులు ఉంటే మాత్రం ఏం లాభం. మాకు ఉత్తమ, తెలివితేటలు ఉండే వ్యక్తి, అల్పాయుషు ఉన్నా పర్వాలేదు' అని కోరుకున్నారట.

మార్కండేయుని జననం..
వారి కోరిక మేరకు శివుడు వారి కోరికను నెరవేరుస్తాడు. అప్పుడే ఆ భార్యభర్తలిద్దరికీ ప్రకాశించే ఓ బాలుడు సంతానం కలుగుతాడు. మృకందుని కొడుకు కాబట్టి తనకు మార్కండేయ అనే పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు అందంగా, తెలివిగా, సకల గుణాలు ఉన్న వ్యక్తిగా పెరుగుతాడు. వ్యక్తిత్వంలో తనకు ఎవరు సాటి రారని నిరూపించుకుంటాడు.

ఆయష్షు తీరనుందని..
ఇదిలా ఉండగా.. ఓ రోజు మృకందుని ఆశ్రమానికి సప్తరుషులు వస్తారు. మార్కండేయుడిని చూడగానే తనకు త్వరలో ఆయుష్షు తీరనుందని వారికి తెలిసిపోతుంది. అప్పుడు తనను బ్రహ్మదేవుని వద్దకు తీసుకెళ్తారు. తనను అను నిత్యం పరమేశ్వరుని పూజించమని సూచిస్తారు. అందరూ కలిసి శివ నామ స్మరణ చేస్తే ఎలాంటి మరణం దరి చేరదని మార్కండేయునికి తెలియజేస్తారు.

శివలింగాన్ని పట్టుకుని..
అప్పటినుండి మార్కండేయ ప్రతిరోజూ శివలింగం ఎదుట కూర్చొని శివనామ స్మరణ చేస్తుంటాడు. మరోవైపు మృత్యుఘడియలు సమీపిస్తుంటాయి. యముని ఆదేశాలతో యమభటులు మార్కండేయుని తీసుకొచ్చేందుకు బయలుదేరతారు. అయితే తను నిత్యం శివుడి జపంలో ఉండటం వల్ల తన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతారు. దీంతో యముడే స్వయంగా మార్కండేయుని స్వయంగా బయలుదేరుతాడు. తన వద్దకు వెళ్లి ‘శివ ధ్యానం ఆపి ఇటువైపు రా.. నీకు మృత్యువు దగ్గరకొచ్చింది' అని అంటాడు యముడు. ఆ మాటలను విన్న మార్కండేయ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు.

యమపాశం తగలగానే..
యమునికి ఏం చేయాలో తోచక.. తన అస్త్రమైన యమపాశాన్ని మార్కండేయుని మీదకు వదులుతాడు కానీ మార్కండేయునితో ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు పరుగెత్తుతాడు. తమ మీదకు, తన భక్తుని మీదకు యమపాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క దెబ్బతో మట్టుబెడతాడు. అప్పుడే పరమేశ్వరునికి ‘కాలాంతకుడు' అనే పేరు వచ్చింది. కానీ యముడు లేకపోతే చావుపుట్టుకల జీవనచక్రం ముందుకు సాగదు కదా! అందుకే దేవతలందరూ శివుడిని ప్రార్థించి.. తనను శాంతింపజేస్తారు. అప్పుడు శివుడు మళ్లీ యముడిని తిరిగి జీవించేలా చేస్తాడు. అయితే మార్కండేయ వద్దకు ఎప్పుడూ రాకూడదనీ.. తన భక్తులెవరినీ నరకానికి తీసుకుపోరాదని హెచ్చరిస్తూ వదిలేస్తాడు శివుడు. ఆ తర్వాత మార్కండేయుటు ఇంటికొచ్చి తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తాడు. ఇది చూసి ఆశ్చర్యపోయిన వారు ఎంతో ఆనందిస్తారు. అప్పటి నుండి మార్కండేయుడు గొప్ప రుషిగా మారి, చాలా కాలం జీవించాడు.

ఎక్కడ జరిగిందంటే..
ఈ సంఘటన మొత్తం తమిళనాడులోని ‘తిరుక్కడయూరు' అనే ప్రాంతంలో జరిగిందని చాలా మంది నమ్ముతారు. అప్పటి నుండి మార్కండేయుడు చిరంజీవిగా ఉండటమే కాదు.. అష్టాదశ పురాణాలలో ఒకటైన ‘మార్కండేయ పురాణాన్ని' కూడా రాశాడు. శివకేశవుల లీలలే కాకుండా దేవీ మహత్మ్యం కూడా నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలో మార్కండేయ జయంతిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 3వ తేదీన గురువారం నాడు మార్కేండయ జయంతి వచ్చింది.



Click it and Unblock the Notifications