Latest Updates
-
గర్భిణీలు ఈ తప్పులు చేస్తున్నారా? మీ బిడ్డ ఆరోగ్యం కోసం ఇవి తెలుసుకోండి! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఉదయాన్నే ఈ ప్రోటీన్ రిచ్ పరాఠా ట్రై చేయండి..సొరకాయ రైతాతో కేక! -
ఈ రాశుల వారికి ఈరోజు ధనయోగం.. ఆదాయం పెరగడమే కాదు అదృష్టం కూడా తోడవుతుంది! -
హ్యాపీ హనుమాన్ జయంతి..మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
వైధృతి యోగం ఎఫెక్ట్.. ఈరోజు హైదరాబాద్, విజయవాడ వాసులు ఈ తప్పులు అస్సలు చేయకండి! -
హనుమాన్ దీక్ష విరమణ చేస్తున్నారా? స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ నియమాలు, ముహూర్తాలు తప్పక పాటించండి! -
చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ధనలాభం.. మీ రాశి ఉందా? -
వృశ్చికం, మీన రాశుల వారికి ధన యోగం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త! - మంగళవారం, 12 మే 2026 -
వంట నూనె తగ్గించండి.. ప్రధాని మోదీ పిలుపు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే! -
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే
అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన అద్భుత కథ!
మార్కండేయ పురాణం, హిందువుల అష్టాదశ పురాణాలలో ఒకటి జైమిని ముని మరియు మార్కండేయుడు మధ్య జరిగింగ సంవాదముగా వ్రాయబడింది.
పూర్వం శౌనకాది మహామునులు, సూతుడిని... ‘‘ఓ సూతపౌరాణికా! నీవల్ల మేము భాగవతం, భవిష్య పురాణాల గురించి చాలా సంతోషించాము. అలాగే మార్కండేయ పురాణం గురించి వివరించు’’ అని అడిగారు. అప్పుడు సూతుడు మార్కండేయ పురాణం గురించి ఇలా వివరించాడు.

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
1. ఒకచోట మృకండు అనే యోగి నివసిస్తున్నాడు. అతను తన భార్య అయిన మరుద్వతి ఇద్దరూ శివుడికి మంచి భక్తులు. వారిరువురూ ప్రతిచోట శివుని పాటలు పాడుకుంటూ, శివుని కధలను విస్తరి౦పచేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు.

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
2. అయితే ఇద్దరూ చాలా విచారంగా ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. ఆ యోగి అతని భార్య శివుని మెప్పించడానికి తీవ్రమైన తపస్సు చేయాలనీ నిశ్చయించుకున్నారు. చివరికి వారి తపస్సుతో శివుడిని మెప్పించి వారికి దర్శనమిచ్చాడు.

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
3. మృకండుడు పెద్ద ఋషి. మరుద్వతి అతని భార్య. చాలా కాలం వరకు వారికీ పిల్లలు లేరు. ఆ రిషి శివుడిని ప్రార్ధించేవాడు. శివుడు ప్రత్యక్షమై, "మృకండు నీ భక్తికి మెచ్చాను. నీకు ఎక్కువ కాలం జీవించే వందమంది పిల్లలు కావాలా, కానీ అది చాలా పిచ్చితనంగా ఉంటుంది? లేదా, కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించి ఉండే తెలివైన కొడుకు కావాలా?" అని అడిగాడు. అప్పుడు రిషి "భగవంతుడా తెలివైన పిల్లవాడు ఒక్కడు చాలు" అన్నాడు.

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
4. అప్పుడు శివుడు "మంచిది నీకు అలాంటివాడే పుడతాడు" అన్నాడు. త్వరలో ఆ ఋషి కి ఒక కొడుకు పుట్టాడు. అతనికి మార్కండేయ అని పేరుపెట్టారు. ఆ పిల్లవాడు చాలా అందంగా, తెలివిగా ఎదిగాడు. ఆ ఋషి అతనికి ఒడుగు చేసాడు. మార్కండేయుడు చాలా తేలికగా వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేసాడు. ప్రతివారూ అతనిని ఇష్టపడే వారు.

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
5. ఆ పిల్లవానికి పదహారు సంవత్సరాలు వచ్చిన తరువాత, మృకండు ఋషి చాలా విచారించాడు. ఒకరోజు మార్కండేయుడు తన తండ్రితో ఇలా అన్నాడు. "నాన్నా, ఎందుకు మీరంతా విచారంగా కనిపిస్తున్నారు"?

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
6.అప్పుడు ఋషి ఇలా అన్నాడు, "కుమారా! నీకేం చెప్పను? శివుడు నిన్ను నాకు ఇచ్చినపుడు, నువ్వు పదహారు ఏళ్ళు మాత్రమే బ్రతుకుతవని చెప్పాడు. ఇప్పుడు నీకు పదహారు సంవత్సరాలు వచ్చాయి. ఈ సంవత్సరం చివర్లో నిన్ను కోల్పోవడానికి నీ తల్లి ఎలా భరిస్తుంది?"

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
7. మార్కండేయుడు ఇలా అన్నాడు, "నాన్నా! అదా కారణం? శివుడు అతని భక్తుల పట్ల చాలా దయకలవాడు. మీరే నాకు ఈ విషయాన్నీ చెప్పారు. ఆయన చాలామందిని మృత్యువు నుండి రక్షించారు. ఈ విషయాన్నీ నేను పురాణాలలో చదివాను.

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
8. అందువల్ల ఈ రోజు నుండి నేను శివుడిని పగలు రాత్రి పూజిస్తాను. నాకు ఖచ్చితంగా తెలుసు, ఆయన నన్ను కూడా రక్షిస్తారు!"
మృకండు ఋషి కొడుకు చెప్పిన మాటలు విని చాలా సంతోషించాడు. అతను పిల్లాడిని దీవించాడు.

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
9. మార్కండేయుడు సముద్రపు వొడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అతను శివుడిని పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి పూజించడం మొదలు పెట్టాడు. అతను భజనలు పడేవాడు, తరచుగా ఆనందంతో నృత్యం చేసేవాడు.

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
10. చివరి రోజు, మృత్యు దేవత అయిన యముడు వచ్చేటప్పటికి, మార్కండేయుడు భజనలు చేస్తున్నాడు. యముడు ఎద్దుపై స్వారీ చేస్తున్నాడు. అతని చేతిలో ఉరి ఉండి. అతను మార్కండేయుడితో, "ఆపు నీ భజనలు! ఈ ప్రపంచంతో నీ జీవితం అయిపొయింది. చనిపోవడానికి సిద్ధంగా ఉండు" అన్నాడు.

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
11. మార్కండేయుడు భయపడలేదు. అతను తల్లిని హత్తుకున్నట్టు శివలింగాన్ని హత్తుకున్నాడు.
యముడు తన ఉరిని పిల్లవాడి మెడ చుట్టూ వేసి, శివలింగంతో పాటు లాగాడు. వెంటనే శివలింగం పగిలి, శివుడు బైటికి వచ్చాడు, శివుడు యముడిని గుండెల మీద తన్ని ఇలా అన్నాడు, "యమ, వెళ్ళిపో! ఈ పిల్లవాడిని తాకొద్దు. ఇతను నాకు అమిత భక్తుడు. ఇతను ఎప్పటికీ బతికే ఉంటాడు!" అని.

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
12. యముడు క్షణంలో వెళ్ళిపోయాడు. మార్కండేయుడు ఎప్పటికంటే మరింత తీవ్రంగా శివుడిని ప్రార్ధించాడు. ఈ ప్రార్ధన ప్రతి వరుస చివరలు, "చావు నన్ను ఏమి చేస్తుంది?" అని చెప్తుంది. చాలామంది ఈ ప్రార్ధనలు ఇప్పటికీ పఠిస్తూ ఉంటారు.

అల్పాయుష్యుడైన మార్కండేయుడు మరణాన్ని జయించిన కథ
13. మార్కండేయుడు ఇంటికి వచ్చి, అతని తల్లితండ్రుల పదాలకు నమస్కరిస్తాడు. వారు ఆశ్చర్యపోయి అతనిని ఆనందంతో కౌగిలించు కుంటారు. మార్కండేయుడు ఒక గొప్ప ఋషిగా మారి, చాలాకాలం జీవించాడు.



Click it and Unblock the Notifications