For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Muharram 2021 : ఇస్లామిక్ న్యూ ఇయర్ గురించి ఈ ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసా..

ఇస్లామిక్ నూతన సంవత్సరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

ముస్లింలు రంజాన్ తర్వాత అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగల్లో మొహర్రం ఒకటి. దాదాపు పది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా ఇస్లాంకు సంబంధించిన ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి.

Muhurram : Interesting facts about Islamic New Year

ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరికీ వారి క్యాలెండర్ ప్రకారం రంజాన్ తర్వాత వచ్చే రెండో పవిత్ర మాసం నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

Muhurram : Interesting facts about Islamic New Year

దీనినే హిజ్రా న్యూ ఇయర్ లేదా హిజ్రా అని అంటారు. ఇది క్రీ.శ 622లో మొహర్రం మొదటి రోజు మక్కా నుండి మదీనాకు మహమ్మద్ ప్రవక్త ప్రయాణాన్ని సూచిస్తుంది.

Muhurram : Interesting facts about Islamic New Year

మహమ్మద్ ప్రవక్త ధర్మం కోసం అన్యాయాలను, అక్రమాలను వ్యతిరేకించారు. పాలకులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, ప్రజందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇస్లామిక్ నూతన సంవత్సరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

మొహర్రం అంటే..

మొహర్రం అంటే..

మొహర్రం అంటే వాస్తవానికి పండుగ కాదు. ఇస్లామ్ మతం యొక్క క్యాలెండర్ ప్రకారం నూతన మాసాన్ని మొహర్రం నెలగా భావిస్తారు. అయితే ఈ నెలలోని పదో రోజుకు ఓ ప్రత్యేకత ఉంది.

ఎలా జరుపుకుంటారంటే.

ఎలా జరుపుకుంటారంటే.

మొహర్రం పండుగ సందర్భంగా ముస్లింలందరూ పీర్లను కూర్చొబెడతారు. పదో రోజున పీర్లను ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సమయంలో హజరత్ ఇమామ్ హుస్సేన్ కు గుర్తుగా పంజా(ప్రతిమ)లను ఊరేగించి తమ సంతాపాన్ని తెలియజేస్తారు.

ఇస్లామిక్ క్యాలెండర్లో ఎన్ని నెలలంటే..

ఇస్లామిక్ క్యాలెండర్లో ఎన్ని నెలలంటే..

ఇస్లామిక్ క్యాలెండరులో కూడా అచ్చం తెలుగు, ఇంగ్లీష్ ఎన్ని నెలలైతే అన్నే నెలలు అంటే 12 మాసాలు ఉంటాయి. కానీ కేవలం 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఇస్లామిక్ న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువ మత కార్యక్రమాలు సాధారణంగా ఉండవు. కొన్ని ముస్లిం దేశాలలో ఈరోజు అధికారిక సెలవు దినం కానీ.. మరికొన్ని దేశాలలో అది సెలవు దినం కాదు.

శత్రు సైన్యం..

శత్రు సైన్యం..

చరిత్ర ప్రకారం.. మొహర్రం నెలలో తొలి రోజున ఇరాక్ లో కర్బలా మైదానంలో యుద్ధం ప్రారంభమైంది. యజీద్ సైన్యం హుస్సేన్ తో పాటు కుటుంబసభ్యులను, మహిళల్ని, పసిపిల్లల్ని సైతం పాశవికంగా హతమార్చింది. మొహర్రం నెల పదో రోజు సాయంత్రం నమాజ్ చేస్తున్న సమయంలో ఇమాం హుస్సేన్ ను శుత్రు సైన్యం చుట్టుముట్టింది.

నిప్పులపై నడుస్తారు..

నిప్పులపై నడుస్తారు..

శత్రువుల చేతిలో దాదాపు 70 మంది వరకు మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులయ్యారు. ఈ సందర్భంలో హజరత్ హుస్సేన్ ఆ తెగకు శాపం పెడతారు. ఈ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని ప్రార్థిస్తూ ప్రాణాలు విడుస్తాడు..యుద్ధం ముగిసిన తర్వాత యాజిద్ తెగ వారు పశ్చాత్తాపం చెందుతారు. దైవ ప్రవక్త మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారిని మా చేతులతో హతమార్చాం.. కానీ మమ్మల్ని క్షమించాలని గుండెల మీద చేతులతో బాదుకుంటూ.. గట్టిగా ఏడుస్తూ నిప్పులపై నడుస్తారు.

నేటికీ అదే ఆచారం..

నేటికీ అదే ఆచారం..

అలా ప్రారంభమైన ఆచారాం నేటికీ చాలా చోట్ల కొనసాగుతోంది. పీర్ల ప్రతిమలను కూర్చొబెట్టిన వారు ఎర్రగా మండే నిప్పు కణికలలో నడుచుకుంటూ వెళ్తారు. మరోవైపు మహ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తులు అమరులైన తమ పెద్దలను తలచుకుంటూ వారికి సంతాపంగా రెండురోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తారు. అయితే మొహర్రం నెలలో ముస్లింలు తమ ఇళ్లల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.

English summary

Muhurram 2020 : Interesting facts about Islamic New Year

Hijri New Year 2020: The New Year signifies a time to reflect on the year gone by and look forward to the upcoming year.
Desktop Bottom Promotion