For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Murudeshwar Temple: మురుడేశ్వర ఆలయం: విశిష్టతలు, చరిత్ర, పురాణం

|

Murudeshwar Temple: కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది మురుడేశ్వర ఆలయం. సముద్రతీరాన ఈ ఆలయం చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు. కందుక కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు. ఇక్కడి రాజగోపురం 20 అంతస్తులతో ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా రెండు ఏనుగు విగ్రహాలు ఉంటాయి.

ఆలయం దాని సహజమైన రూపంలో ఉన్న గర్భగుడి మినహా కొంచెం ఆధునికంగా కనిపించేలా పునరుద్ధరించబడింది. స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడి మృదేశ లింగం శివుని అసలు ఆత్మలింగంలో ఒక భాగమని స్థానికులు చెబుతుంటారు. ఈ పట్టణానికి మృదేశ లింగానికి మృడేశ్వర అని పేరు పెట్టారు. అయితే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దీనిని మురుడేశ్వర అని పేరు మార్చారు.

మురుడేశ్వర్ ఆలయ పురాణం:

మురుడేశ్వర్ ఆలయ పురాణం:

జానపద కథల ప్రకారం, రావణుడు తన 'ఆత్మ లింగాన్ని' (శివుడి ఆత్మ) తనకు అప్పగించమని కోరుతూ, శివుడిని తీవ్రంగా ప్రార్థించాడు. శివుడు అతని భక్తికి చాలా పొంగిపోతాడు. అతను లింగాన్ని లంకకు చేరుకునే వరకు భూమిని తాకకూడదనే షరతుతో అతనికి లింగాన్ని ఇస్తాడు. అంటే రావణుడు లంకకు చేరే వరకు విశ్రాంతి తీసుకోలేడు. రావణుడు కైలాస పర్వతం నుండి ఆత్మలింగాన్ని తన రాజ్యమైన లంకకు తీసుకెళ్తాడు. ఇంతలో ప్రమాదాన్ని పసి గట్టిన గణేశుడు రావణుడి వద్దకు వచ్చి గోకర్ణ సముద్రపు ఒడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలా మోసగిస్తాడు. తన ఆత్మ లింగాన్ని భూమి నుండి పైకి లేపేందుు ప్రయత్నిస్తాడు. కానీ అతను దానిని కదిలించలేకపోతాడు. కోపంతో రగిలిపోతూ, రావణుడు తన శక్తినంతా ఉపయోగించి లింగాన్ని ధ్వంసం చేశాడు. దాని ఫలితంగా కొన్ని విరిగిన లింగ ముక్కలు ఆ ప్రదేశమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. లింగాన్ని కప్పడానికి ఉపయోగించిన వస్త్రం, కందుక గిరి వైపు వెళ్లింది. అలా ఈ కందక గిరిపై పరమ శివుని ఆలయం వెలిసిందని స్థానికులు చెబుతుంటారు.

మురుడేశ్వర దేవాలయ విశిష్టత:

మురుడేశ్వర దేవాలయ విశిష్టత:

* ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన శివుడి విగ్రహం ఉంటుంది.

* పక్కనే విశాలమైన అరేబియా సముద్రం ఉంటుంది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని మంత్రముగ్దులను చేస్తుంది.

* 20 అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత. దీని పైకి వెళ్లి ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు. అలాగే పక్కనే ఉన్న సముద్రాన్ని ఆస్వాదించవచ్చు.

* గోపురం శిఖరం వరకు వెళ్లడానికి రెండు లిఫ్టులు ఉంటాయి.

* ఈ రాజగోపురం ఎత్తు 249 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా ​​ఇది ప్రసిద్ధి గాంచింది.

* ఆలయానికి వెళ్లే మెట్ల దగ్గర రెండు పెద్ద పెద్ద భారీ ఏనుగులు విగ్రహాలు ఉంటాయి.

* కందుక కొండ ఉపరితలంపై అనేక శిల్పాలు నిర్మించబడ్డాయి. వీటిలో గీత ఉపదేశము, సూర్య రథం మరియు రావణుడి నుండి ఆత్మలింగాన్ని స్వీకరించిన గణేశుడి శిల్పం ఉన్నాయి.

* ఆలయం వెనుక ఒక కోట ఉంటుంది. ఇది కూడా మంచి పర్యాటక ప్రదేశం.

* మహా శివరాత్రి నాడు కర్నాటక నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

* ఆలయ నిర్మాణం చాళుక్య మరియు కదంబ శిల్పాలతో ద్రావిడ నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొంది నిర్మించారు.

* గర్భగుడి లోపల భూమికి 2 అడుగుల దిగువన ఉన్న శివుని లింగాన్ని చూడవచ్చు.

* ఇక్కడి శివుడి విగ్రహంపై సూర్య కిరణాలు పడితే అది మెరుస్తుంది.

* ఈ భారీ విగ్రహాన్ని చెక్కడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది.

మురుడేశ్వర్ ఆలయం: ఎప్పుడు సందర్శించాలి

మురుడేశ్వర్ ఆలయం: ఎప్పుడు సందర్శించాలి

భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రపై ఆసక్తి ఉన్న వ్యక్తులు మురుడేశ్వర ఆలయాన్ని సందర్శించవచ్చు. ప్రత్యేకించి శివుని యొక్క అద్భుతమైన ఎత్తైన విగ్రహం కారణంగా వారాంతాల్లో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది.

ఇక్కడ ఇంకేం ఉన్నాయి:

ఇక్కడ ఇంకేం ఉన్నాయి:

మురుడేశ్వర్ కేవలం భక్తులకు మాత్రమే కాదు. మురుడేశ్వర్ బీచ్‌లో వాటర్ ‌స్పోర్ట్స్ కూడా ఉంటాయి. పడవల సౌకర్యం, స్కూబా డైవింగ్ కూడా ఆస్వాదించవచ్చు. ఇక్కడి అద్భుతమైన దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. నేరుగా చూస్తేనే దానిని అనుభూతి చెందగలుగుతాం.

మురుడేశ్వర ఆలయ సమయాలు:

మురుడేశ్వర ఆలయ సమయాలు:

సమయాలు: 3:00 AM - 1:00 PM, 3:00 PM - 8:00 PM

ఆలయాన్ని సందర్శించడానికి అవసరమైన సమయం: 2-3 గంటలు

దుస్తుల కోడ్: పురుషులకు- ధోతీలు మాత్రమే, టీ-షర్టు, జీన్స్ మరియు ప్యాంట్‌లు వేసుకుంటే అనుమతి ఉండదు.

మహిళలకు- దుపట్టాతో కూడిన చీర మరియు చుడీదార్ మాత్రమే ధరించాలి. అవి కాకుండా వెస్టర్న్ వేర్ వేసుకుంటే ఆలయంలోకి అనుమతించరు.

English summary

Murudeshwar Temple, Karnataka History, Timings, Legends, Attractions and How to Reach in Telugu

read on to know Murudeshwar Temple, Karnataka History, Timings, Legends, Attractions and How to Reach in Telugu
Story first published: Saturday, July 23, 2022, 17:00 [IST]
Desktop Bottom Promotion