Latest Updates
-
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు
Navratri 2021: దేవీ నవరాత్రుల రహస్యాల గురించి తెలుసా...
దేవీ నవరాత్రుల రహస్యాల గురించి తెలుసా...
హిందువుల క్యాలెండర్ ప్రకారం అశ్విని మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగలలో నవరాత్రి ఉత్సవాలు ఒకటి. ఈ సంవత్సరం 2021 అక్టోబర్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గా మాతను అత్యంత పవిత్రమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహిషాసురుడిని సంహరించేందుకు అమ్మవారు ఈ అవతారం ఎత్తారని.. చెడుపై మంచి విజయం సాధించినందుకు, ప్రతికూల శక్తులను నాశనం చేసేందుకు దేవీ అవతారంలో అమ్మవారు వచ్చారని చాలా మంది నమ్ముతారు.

ఈ నవరాత్రులను మన దేశంలో కొన్ని చోట్ల దుర్గా పూజ అని కూడా పిలుస్తారు. ఈ తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ఆరాధిస్తారు. ఈ సందర్భంగా నవరాత్రుల యొక్క పురాణాలు మరియు ప్రాముఖ్యత గురించి తెలియజేసేందుకు మేమొచ్చేశాం.. ఆ రహస్యాలేంటో మీరు కూడా చూసేయ్యండి.

నవరాత్రుల రహస్యం..
పురాణాల ప్రకారం, దేవీ నవరాత్రల సమయంలో ముందు మూడు రోజులు ఉపవాసం ఉంటే దుర్గుణాలు పోతాయి... తర్వాత మూడు రోజులు ఉపవాసం ఉంటే సద్గుణాలు వస్తాయి.. చివరి మూడు రోజులు సద్గుణాలు మనలో చేరి, ధర్మానుష్టంగా బయటకు వస్తే.. సరస్వతీ దేవి ప్రీతి చెంది.. వారికి జ్ణానం ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

పురాణాలతో దుర్గా పూజ అనుబంధం..
దుర్గా దేవితో యుద్ధం సమయంలో ఘోరంగా ఓడిపోయి.. ఆమె చేతిలో సంహరించబడ్డ మహిషాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మాదేవుడిని ఆకట్టుకున్నాడు. దీంతో అతను ఏదైనా మానవుని మరియు జంతువుల రూపాన్ని పొందడానికి ఓ వరం పొందాడు.

అందమైన మహిళా రూపంలో..
ఆ తర్వాత మహిషాసురుడు ఓ అందమైన మహిళ రూపంలో మారిపోయి.. ఒక ఆశ్రమంలోకి వెళ్లాడు. అక్కడ అనేక మంది ప్రజలను ఆవాహన చేసుకున్నాడు. అక్కడుండే వాటినన్నింటినీ నాశనం చేసేశాడు. అక్కడుండే వారికి చాలా కోపం తెప్పించాడు. దీంతో అక్కడుండే వారంతా తమ శక్తులను ఉపయోగించి.. తను ఒక మహిళ చేత చంపబడాలని శపించారు.

విశ్వానికి భంగం..
ఆ వెంటనే తను ఇంద్రుడిని వెళ్లగొట్టి ఈ లోకానికి రాజు అవుదామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా విశ్వం నుండి శాంతి మరియు ఆధ్యాత్మికతకు భంగం కలిగించడం ప్రారంభించాడు. తననే ఆరాధించాలని ప్రజలను బలవంతం చేస్తాడు.

ఏ దేవుడు గెలవలేకపోయాడు..
ఆ సమయంలో చాలా మంది దేవుళ్లు తనతో పోరాటం చేసినప్పటికీ.. ఏ ఒక్క దేవుడు ఓడించలేకపోయారు. కేవలం ఒక మహిళ ఈ మహిషాసురుడిని సంహరిస్తుందని శాపాన్ని వారు గుర్తు చేసుకున్నారు. అప్పుడు త్వరలోనే పవిత్ర త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పార్వతీదేవిని దుర్గాదేవిగా మార్చారు.

మహిషాసురుడిని సంహరించడానికి..
అప్పుడు దుర్గాదేవి శరీరం అందరి దేవతల నుండి దైవిక శక్తితో ఆశీర్వదించబడి.. మహిషాసురుడిని యద్ధంలో సంహరించేందుకు వివిధ రూపాలను తీసుకున్నారు. ఆ దేవి తన తెలివితేటలను మరియు శక్తిని ఆ రాక్షసుడిని మట్టుబెట్టింది. అతని భీభత్సం నుండి ఈ విశ్వాన్ని రక్షించింది.

దుర్గా పూజ ప్రాముఖ్యత..
నవరాత్రి యొక్క అన్ని ఆచారాలలో, మహా అష్టమి(నవరాత్రి ఎనిమిదో రోజు)రోజున జరిగే పూజలు కన్యపూజలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ రోజున 2 నుండి 9 సంవత్సరాల మధ్య వయస్సు గల అమ్మాయిలను ఆరాధిస్తారు. ఈ ఆడపిల్లలంతా పార్వతీ, లక్ష్మీ మరియు సరస్వతి దేవత యొక్క పిల్లల రూపం అని నమ్ముతారు.

ప్రత్యేక కార్యక్రమాలు..
ఈ పండుగను చిరస్మరణీయంగా ఆస్వాదించడానికి ప్రజలంతా నవరాత్రి సమయంలో జానపద నృత్యాలు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
భారతదేశంలో అక్టోబర్ ఏడో తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు దేవీ నవరాత్రలు ప్రారంభం కానున్నాయి. పదో రోజున విజయదశమి(దసరా) పండుగను జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications