For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్జల ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయట..!

నిర్జల ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి...

|

హిందూ పంచాగం ప్రకారం, ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఒక్క ఏకాదశికి ఏదో ఒక ప్రత్యేకత అనేది కచ్చితంగా ఉంటుంది. తిథుల ప్రకారం, ఏకాదశి రోజున శుభప్రదంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Nirjala Ekadashi 2022 Daan

జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున నీటిని తాగడం మానేస్తారు. అందుకే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. పురాణాలను పరిశీలిస్తే.. ఈరోజును భీమసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో జూన్ 10వ తేదీన అంటే శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి వచ్చింది. ఈసమయంలో ఉండే ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని సక్రమంగా పాటించకపోతే కోరికలు నెరవేరకుండా పోతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే నిర్జల ఏకాదశి శుభ ముహుర్తం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

Nirjala Ekadashi 2022 Daan

విష్ణుమూర్తి అనుగ్రహం కోసం..
నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే ఏకాదశి రాత్రి వేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చేయాలని చేస్తుంటారు. ఇక ఉపవాస విరమణ సమయంలో ద్వాదశి నాడు బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను దానంగా ఇస్తారు. అలాగే అతిథులను భోజనానికి పిలిచి, ఉపవాస వ్రతాన్ని విరమించడం వంటివి చేస్తారు. ఈ రోజున ఎవరైనా తమ శక్తి, సామర్థ్యం మేరక దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు.

Nirjala Ekadashi 2022 Daan
వీటిని దానం చేయండి..
ఈ పవిత్రమైన జల(నీటిని) దానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయట. దీని వల్ల మీకు అద్భుతమైన ఫలితాలొస్తాయట.
అదే విధంగా నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయంలో మామిడి, పుచ్చకాయ వంటి పండ్లను విరాళంగా ఇవ్వాలి. వీటిని దానం చేయడం వల్ల కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయట.
అదే విధంగా నీటితో నిండిన కూజాను కూడా దానం చేయాలి.
నిర్జల ఏకాదశి రోజున చక్కెరను దానం చేయడం వల్ల మంచి ప్రయోనాలు దక్కుతాయట.
ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు డబ్బును విరాళంగా ఇస్తే మీ జీవితంలోని దోషాలన్నీ తొలగిపోతాయట.
మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కావాలంటే ఈరోజున కచ్చితంగా పాలు, పాల పదార్థాలను దానం చేయాలి.

English summary

Nirjala Ekadashi 2022 Daan: List of Things to Donate on Nirjala Ekadashi in Telugu

He are we are talking about the Nirjala Ekadashi 2022 Daan: List of Things to Donate on Nirjala Ekadashi in Telugu. Have a look
Story first published:Thursday, June 9, 2022, 13:12 [IST]
Desktop Bottom Promotion