For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవంబర్ 2019 : ఈ నెలలో వాహనాలు అమ్మడానికి మరియు కొనడానికి మంచి రోజులివే..

మన దేశంలోని చాలా మంది ప్రజలు ఏదైనా పని మొదలు పెట్టడానికి గాని లేదా ఏదైనా వస్తువు లేదా వాహనం కొనుగోలు చేయడానికి పవిత్ర సమయాన్ని, మంచి ముహుర్తాన్ని చూస్తారు.

|

మీరు నవంబర్ నెలలో మీ వాహనాన్ని కొనాలని లేదా అమ్మాలని ప్లాన్ చేసుకుంటున్నారా? కారు, స్కూటర్, బైక్ లేదా ట్రక్ తో పాటు ఆటో మొబైల్స్ కు సంబంధించిన వాహనాల విక్రయాల కోసం శుభ సమయం ఎప్పుడుందో మీకు తెలుసా? దీపావళి పండుగ ముగిశాక నవంబర్ నెలలోని కార్తీక మాసంలో శుభ ముహూర్తాలు, మంచి రోజులు ఎప్పుడు ఉన్నాయో తెలుసా? అయితే ఈ స్టోరీలో అలాంటి వివరాలన్నీ తెలుసుకోండి. మీకు ఇష్టమైన వాహనాన్ని కొనుగోలు చేయండి లేదా మీ పాత వాహనాన్ని అమ్మడం వంటివి చేయండి.

November

మన దేశంలోని చాలా మంది ప్రజలు ఏదైనా పని మొదలు పెట్టడానికి గాని లేదా ఏదైనా వస్తువు లేదా వాహనం కొనుగోలు చేయడానికి పవిత్ర సమయాన్ని, మంచి ముహుర్తాన్ని అనుసరించడం యుగయుగలుగా నడుస్తోంది. ఇది భారతదేశంలో గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది.

1) నవంబర్ 3వ తేదీన

1) నవంబర్ 3వ తేదీన

కార్తీక మాసం ప్రారంభంలోని నవంబర్ 3వ తేదీ అయిన ఆదివారం నాడు భాను సప్తమి. ఆ రోజు ఉదయం 7:40 నుండి ఉదయం 9:23 గంటల వరకు ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా మంచి పనులు చేసుకోవచ్చు.

నవంబర్ 4వ తేదీన..

నవంబర్ 4వ తేదీన..

కార్తీక మాసంలోని నవంబర్ నెలలో 4వ తేదీ అయిన సోమవారం నాడు ఉదయం 4:57 నుండి 6:35 శుభముహుర్తం ఉంది. ఈరోజున అష్టమి ఉంటుంది. చాలా మంది అష్టమి రోజున మంచి పనులను వాయిదా వేసుకుంటారు. కానీ ఆ రోజు ఎలాంటి వర్జ్యం లేదు.

నవంబర్ 5వ తేదీన..

నవంబర్ 5వ తేదీన..

కార్తీక మాసంలోని ఈ 5వ తేదీ అయిన మంగళవారం రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే పుష్కర బ్రహ్మపుత్రా నది పుష్కరాలు ఈరోజు నుండే ప్రారంభమవుతాయి. ఉదయం 5.17 గంటలకు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈరోజు నవమి మొదలవుతుంది.

 నవంబర్ 6వ తేదీన..

నవంబర్ 6వ తేదీన..

నవంబర్ 6వ తేదీ అయిన బుధవారం నాడు శుభ ముహుర్తం ఉదయం 6:37 నుండి ఉదయం 7:21 గంటల వరకు ఉంది. మంగళవారం ప్రారంభం అయిన నవమి బుధవారం నాడు ఉంటుంది. 6వ తేదీన నవమి పూర్తవ్వునుంది.

నవంబర్ 8వ తేదీన..

నవంబర్ 8వ తేదీన..

నవంబర్ 8వ తేదీన ఏకాదశి ప్రారంభమవుతుంది. హిందువులందరూ ఈ రోజున చాలా పవిత్రంగా భావిస్తారు. ఈరోజు మొత్తంలో ఏ పని చేసినా మంచి ఫలితమే ఉంటుందని చాలా మంది చెబుతారు.

నవంబర్ 9వ తేదీన..

నవంబర్ 9వ తేదీన..

నవంబర్ 9వ తేదీన ద్వాదశి ప్రారంభమవుతుంది. ఈరోజు ద్వాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశీ అంటారు. తులసీ దామోదర కళ్యాణోత్సవం ఆరంభం అవుతుంది. ఈరోజున శని త్రయోదశి, శని ప్రదోషమి కూడా. ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఏ పని మొదలుపెట్టినా అంతా మంచే జరుగుతుందని హిందువులందరూ భావిస్తారు.

నవంబర్ 10వ తేదీన..

నవంబర్ 10వ తేదీన..

నవంబర్ 10వ తేదీన అయిన ఈరోజు ఆదివారం. ఈరోజు తిథి త్రయోదశి. ఈరోజు చాలా మంచి రోజు. శుభ ముహుర్తం ఉదయం 6:39 నుండి సాయంత్రం 4:33 గంటల వరకు ఉంటుంది. ఈరోజు రేవతి నక్షత్రం కూడా ఉంటుంది.

నవంబర్ 14వ తేదీన..

నవంబర్ 14వ తేదీన..

నవంబర్ 14వ తేదీన గురువారం రోజున సాయిబాబాను చాలా హిందువులు ఎంతో భక్తితో కొలుస్తారు. ఈరోజు శుభ ముహుర్తం ఉదయం 6:43 నుండి రాత్రి 7:55 గంటల వరకు ఉంటుంది. ఈరోజు తిథి విధియ, ఈరోజు రోహిణి నక్షత్రం ఉంటుంది.

English summary

November 2019: Auspicious Dates For Buying And Selling Of Vehicles This Month

If you are planning to either buy or sell your vehicle in the month of November, then it is better to check out the auspicious dates. No matter what automobiles you buy, be it a car, scooter, bike or a truck, make sure you see the muhurat and the shubh time.
Desktop Bottom Promotion