For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Peculiar temples : దోమలు, కప్పలు, గబ్బిలాలు, మూషికాలకు ఆలయాలున్నాయని మీకు తెలుసా...

ఇప్పటివరకు మనం పాములను పూజించడం.. ఆవులను ఆరాధించడం వంటి వాటినే చూశాం.

|

కరోనా వైరస్ మహమ్మారి చైనాలో పుట్టిందని మనందరికీ తెలుసు. అయితే అది గబ్బిలాల నుండి వచ్చిందని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. వీటి నుండే కరోనా విపరీతంగా వ్యాపించిందనే పుకార్లు తెగ షికార్లు చేశాయి. దీంతో వాటిని చూసి అందరూ భయపడ్డారు.

Peculiar temples : Here worshipping bats, frogs, rats & mosquitos

మనం కూడా గబ్బిలాలను తాకితే మనకు కరోనా వస్తుందేమో అని ఆందోళన చెందారు. ఇక మన దేశంలో గబ్బిలాలు అంటే అరిష్టానికి సంకేతంగా భావిస్తారు. ఇలాంటి భావనే మెజార్టీ ప్రజలలో కూడా ఉంది. అయితే అలాంటి గబ్బిలాలకు ఒక దేవాలయం ఉందట.

Peculiar temples : Here worshipping bats, frogs, rats & mosquitos

అంతేకాదు వాటిని పరమ పవిత్రంగా భావించి నిత్యం కొలుస్తారట ఆ ప్రాంత ప్రజలు. ఇప్పటివరకు మనం పాములను పూజించడం.. ఆవులను ఆరాధించడం వంటి వాటినే చూశాం. అయితే తాజాగా గబ్బిలాల అంశం తెరపైకి రావడంతో.. వీటితో పాటు మరికొన్ని వింత దేవాలయాల గురించి ప్రస్తావన ముందుకొచ్చింది.

Peculiar temples : Here worshipping bats, frogs, rats & mosquitos

అది ఏంటంటే గబ్బిలాలను పూజించడం ఒక ఎత్తు అనుకుంటే కప్పలు, ఎలుకలు, దోమలను కొందరు ప్రజలు పరమ పవిత్రంగా ఆరాధిస్తారట. అంతేకాదు వాటి కోసం ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా అవి ఎక్కడ ఉన్నాయి? ఎందుకు వాటిని పూజిస్తారనే విషయాలను తెలుసుకుందాం...

బవాలి ఆలయం..

బవాలి ఆలయం..

సాధారణంగా గబ్బిలాలను ఎవరైనా అశుభానికి సంకేతంగా భావిస్తారు. అయితే గబ్బిలాలను కూడా పూజించే వారు మన దేశంలోనే ఉన్నారు. అది ఎక్కడో కాదు కరువు ప్రాంతమైన బీహార్ రాష్ట్రంలో. ఆ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పాట్నా మరియు ముజఫర్ పూర్ మధ్య గబ్బిలాల కోసం అక్కడి ప్రజలు ఒక ఆలయాన్ని నిర్మించారు. బాలి ప్రాంతంలో గబ్బిలాల సమూహం ఉంటుంది. ఇది గబ్బిలాలు నివసించే గుహ. ఇక్కడ వేలాది గబ్బిలాలు ఉంటాయి.

గాయాలను నయం చేసేందుకు..

గాయాలను నయం చేసేందుకు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలి ప్రాంతంలో ఒక గుహ కింద నది ప్రవహిస్తుంది. ఈ నది నీటిని గాయాలను నయం చేసేందుకు ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో బాలిని దేవుడిగా పూజిస్తారు. ఇది పర్యాటక కేంద్రం కూడా. పర్యాటకులు ఎల్లప్పుడూ ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఈ గబ్బిలాలు పగటిపూ గుహ లోపల ఉంటాయి. ఎందుకంటే గబ్బిలాలు పగటిపూట చూడలేవు. కానీ సూర్యస్తమయం వేళ అవి గుహ నుండి బయటకు వచ్చి అక్కడ తిరుగుతూ ఉంటాయి. నేటికీ అక్కడి గ్రామస్తులు తమ గ్రామాన్ని గబ్బిలాల ద్వారా రక్షింపబడుతామని నమ్ముతారు.

కప్పల ఆలయం..

కప్పల ఆలయం..

ఉత్తరప్రదేశ్ లోని ఆయిల్ టెంపుల్ లో కప్పలను దేవతలుగా పూజిస్తారు. భారతదేశంలో కప్పలు పూజించే ఏకైక చమురు ఆలయం ఇది. యుపిలోని ఈ ఆలయం మండుక తంత్ర ఆలయం మరియు శివుడు కప్ప వెనుక కూర్చున్న భంగిమను ఈ ఫొటోలో చూడొచ్చు. అంతేకాదు ఈ కప్పల ఆలయంలో శివలింగం కూడా ఉంది. ఇంకో ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే ఇది తరచుగా రంగు మారుతూ ఉంటుందట. ఇంకో విచిత్రమేమిటంటే.. ఏ దేవాలయంలో అయినా కూర్చున్న నందిని చూసే మనం.. ఈ ఆలయంలో మాత్రం నిలబడి ఉన్న నంది విగ్రహాన్ని చూడొచ్చట. ఈ కప్ప ఆలయానికి సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉందట. అంతేకాదు విపత్తుల నుండి ప్రజలను రక్షించడానికి ఈ ఆలయం నిర్మించబడిందట.

ఎలుకల ఆలయం..

ఎలుకల ఆలయం..

ఇక వినాయకుడి వాహనం అయిన మూషికానికి కూడా మన దేశంలో ఓ ఆలయం ఉందని అతి తక్కువ మందికే తెలుసు. ఇది ఎక్కడుందటే రాజస్థాన్ లోని బికానెర్నాలోని కర్ణిమాతా ఆలయంలో ఎలుకలను దేవతలుగా పూజిస్తారు. ఈ ఆలయాన్ని ఎలుకల తల్లి అని కూడా అంటారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే భక్తులందరూ ఇక్కడ ఎలుకలను దేవునికి బహుమతులుగా సమర్పిస్తారట.

దోమకు ఓ గుడి..

దోమకు ఓ గుడి..

వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది పచ్చి నిజం. ఈ దోమల ఆలయం ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అది కూడా ప్రకాశం జిల్లాలో 2008 సంవత్సరంలో కేవలం 5 వేల రూపాయల ఖర్చుతో డాక్టర్ ఎం.సతీష్ కుమార్ ఈ ఆలయాన్ని నిర్మించారు. దోమల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ గుడిని నిర్మించారట.

English summary

Peculiar temples : Here worshipping bats, frogs, rats & mosquitos

Here are the peculiar temples : Here worshipping bats, frogs, rats & mosquitos. Take a look.
Story first published:Wednesday, May 27, 2020, 19:03 [IST]
Desktop Bottom Promotion