For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pitru Paksha 2020 : పితృ పక్షాలలో ఇంట్లో శ్రాద్ధ పూజ ఎలా చేయాలంటే...

పితృ పక్షాలలో చాలా మంది ఇళ్లలో ఎలాంటి శ్రాద్ధ పూజలు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

|

పురాణాల ప్రకారం మన పూర్వీకులు చేసిన కొన్ని తప్పుల వలన వారి తర్వాతి జనరేషన్ వారు ఇబ్బందులకు గురి కావడం.. పితృ దోషాలకు లేదా శాపాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రాలలో ఇలాంటి దోషాలను గుర్తించవచ్చు.

Pitru Paksha : how to perform shraddha pooja at home in Telugu

పితృ దోషాల వల్ల అనేక రకాలైన కష్టాలు ఎదురవుతాయి. మన కుటుంబసభ్యులలో ఎవరైనా ప్రస్తుత జన్మలోగానీ, లేదా గత జన్మలో కాని ముసలివారికి గానీ.. తల్లిదండ్రులకు గానీ నష్టం, కష్టం కలిగించి ఉంటే అలాంటి వారికి ఈ శాపం వర్తిస్తుంది.

Pitru Paksha : how to perform shraddha pooja at home in Telugu

పితృ దోషం ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవడం.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడం.. వ్యాపారంలో అడ్డంకులు.. పెళ్లిళ్లు కాకపోవడం.. సంతానం లేకపోవడం.. విద్యార్థులకు విద్యలో ఇబ్బందులు లేదా ఇంకా ఏదైనా ఒక దానిలో సమస్యలు తలెత్తుతుంటే అందుకు పితృ దోషమే కారణమని పండితులు చెబుతున్నారు.

Pitru Paksha : how to perform shraddha pooja at home in Telugu

అందుకే ప్రతి ఒక్క వ్యక్తి తమ పితృ రుణాన్ని కచ్చితంగా తీర్చుకోవాలి. అప్పుడే వారు తృప్తి చెందుతారు. వారికి ముక్తి.. మీకు విముక్తి వంటివి లభిస్తాయి. అయితే ఇవన్నీ ఎక్కువగా మహాలయ పక్షం రోజుల్లో కేవలం వారసులే చేయాలి. అప్పుడే పితృదేవతల ఆకలిదప్పులు తీరుతాయి. దీనికి సంతృప్తి చెందిన పితృ దేవతలు మీకు ఆశీర్వాదం ఇస్తారు. అలాగే ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవీ చేయకుండా ఉండాలి.

పితృ పక్షం 2020, పితృ పక్షంలో శ్రద్ధా దినాలు జాబితా, ప్రాముఖ్యత మరియు శ్రద్ధా విధానం తెలుసుకోండి...పితృ పక్షం 2020, పితృ పక్షంలో శ్రద్ధా దినాలు జాబితా, ప్రాముఖ్యత మరియు శ్రద్ధా విధానం తెలుసుకోండి...

పితృ ప్రాణం..

పితృ ప్రాణం..

ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం వల్ల పితురులకు తృప్తి కలుగుతుందని పండితులు చెబుతారు. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ద్వరశ్మి నుండి పితృ ప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది. పితురులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం.

ఈ పూజకు విశేష ప్రాముఖ్యత..

ఈ పూజకు విశేష ప్రాముఖ్యత..

పితృ పక్షంలో ఆ తిథి నాడు శ్రాద్ధం పెట్టలేని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఎవ్వరూ శ్రాద్ధ విముఖులు కాకుండా ఉండాలి. శ్రాద్ధ మహిమ గురించి శాస్త్రాలు చాలా వివరంగా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది.

ఓనం 2020: వామనకు ఇచ్చిన మాటను కాపాడటానికి ప్రాణాలను అర్పించిన మహాబలి!ఓనం 2020: వామనకు ఇచ్చిన మాటను కాపాడటానికి ప్రాణాలను అర్పించిన మహాబలి!

పూజా విధానం..

పూజా విధానం..

శ్రాద్ధా పూజకు ముందు కనీసం ఒకరోజు ముందు మాంసాహారం తినకూడదు.

ఓంకారం మంత్రం జపించడం ద్వారా పూజలను ప్రారంభించాలి. గురు, వినాయక, అశ్విని, దేవతలు మరియు మహా విష్ణువులను ప్రార్థించాలి.

ముందుగా రాగి పాత్రను మీ ఎడమ అరచేతిలో తీసుకుని, అందులో నీటిని నింపండి. అప్పుడు కింద ఉండే మంత్రాన్ని జపించండి.

‘గంగేచా యమునస్వేచివ గోదావరి సరస్వతి

నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిడమ్ కురు'

పై మంత్రాన్ని జపిస్తూ మీరు పితృ తర్పణం చేయాలి.

పూర్వీకుల కోసం..

పూర్వీకుల కోసం..

పితృ మరియు తల్లి వైపు నుండి 40 తరాల పూర్వీకుల కోసం ప్రార్థించాలి. కొన్ని సెకన్ల పాటు ధ్యానం చేయాలి. ‘పితృులందరూ నా వినయపూర్వకమైన సమర్పణను అంగీకరించి, తర్వాతి సంవత్సరాల్లో కూడా ఈ పవిత్ర కార్యాన్ని కొనసాగించడానికి నన్ను ఆశీర్వదించండి' అని కోరుకోండి.

ఆ తర్వాత రాగి పాత్ర నుండి ఒక చెంచా నీరు తీసుకుని, మీ కుడి చేతిలో వేసుకుని, స్వీయ శుద్ధీకరణ చర్యగా(శరీరం మరియు మనసు రెండూ) మీ శరీరంపై తలపై చల్లుకోండి.

నల్ల నువ్వులతో..

నల్ల నువ్వులతో..

మీ చేతిలో నల్లని నువ్వులతో పితృులను ఆహ్వానించండి. ఆ సమయంలో ఈ శ్లోకాన్ని జపించండి.

‘మామా వర్గాద్ దోయా' ‘ఓం నమో నారాయణాయ' అనే మంత్రాన్ని మూడు సార్లు జపించడం ద్వారా మీ చూపుడు వేలు ద్వారా దానిపై నీటిని పోయండి. ఆ తర్వాత కొద్దిగా వండిన అన్నం తీసుకుని నువ్వుల గింజలతో కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న బంతులు మాదిరిగా తయారు చేసి ఒక ప్లేటులో సిద్ధంగా ఉంచండి.

పూర్వీకులను ధ్యానించండి..

పూర్వీకులను ధ్యానించండి..

మీ కుడి చేతితో ఆ బియ్యపు బంతిని తాకి మీ పూర్వీకులను తలచుకోండి. నీటితో కొన్ని నువ్వులను తీసుకుని, పిండం మీద పోసి ‘తిలోడగం సమర్పాయమి' అని చెప్పండి. పూజ ముగిసిన తర్వాత ఆ పూజా సామాగ్రిని అంతా ఒక పాత్రలో సేకరించి, మీ ఇంటికి దగ్గర్లోని సరస్సు, నది, సముద్రం దగ్గరికి వెళ్లి ‘ఇదం పిండం గయార్ పిథో అస్తు' అని జపించండి. వాటిని అక్కడే వదిలేయండి.

దేవాలయాల సందర్శన..

దేవాలయాల సందర్శన..

ఈ తతంగమంతా పూర్తయిన తర్వాత మీకు దగ్గర్లో ఉన్న దేవాలయాలను సందర్శించండి. ఆ తర్వాత పేదలకు దానం చేయండి.. లేదా అన్నదానం చేయండి. అలాగే ఈరోజు రాత్రి భోజనానికి దూరంగా ఉండండి.

English summary

Pitru Paksha : how to perform shraddha pooja at home in Telugu

Here we talking about Pitru paksha 2020 : how to perform shradda pooja at home in Telugu. Read on
Desktop Bottom Promotion