For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ తోబుట్టువులతో రాఖీ పౌర్ణమి సందేశాలను పంచుకోండిలా...

రక్షాబంధన్ అంటేనే అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య అనురాగం, ఆప్యాయతలను పెంచే పండుగ. మన దేశంలో ముఖ్యమైన పండుగలలో ఇదొకటి. విషేస్ తెలిపేందుకు సోదర, సోదరీమణులకు సందేశాలను వాట్సాప్ లో షేర్ చేయండి.

|

రక్షా బంధన్ పేరులోనే రక్షణ అనే అర్థం ఉంది కాబట్టి ఈ పండుగకు రక్షా బంధన్ అనే పేరొచ్చింది. రక్ష అంటే రక్షణ అని .. బంధన్ అంటే కట్టడం అని అర్థం. అన్న లేదా తమ్ముడు తమకెప్పుడూ అండగా ఉండాలని, వారినెప్పుడూ విజయం వరించాలని, వారు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకునే వారు సోదరీమణులు. వారు సంతోషంగా ఉంటే తమకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటారని అక్కా, చెల్లెల్ల నమ్మకం. అంతేకాదు సోదరీమణులను సంతోషపెట్టేందుకు అన్నా లేదా తమ్ముడు చిరుకానుకలు సైతం ఇస్తుంటారు.

ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా కొందరు అన్నా చెల్లెలు లేదా అక్కా తమ్ముళ్ల కోరికలు లేదా వారి మాటలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. అవేటంటే..
"ఒక అన్నయ్య లేదా తమ్ముడిని ఓ సోదరి ఏమి కోరుతుందంటే మన తల్లిదండ్రులను ఎప్పటికీ అనాధశ్రమంలో చేర్పించే దుస్థితికి దయచేసి తీసుకురావద్దు.
అదే విధంగా ఓ అక్క లేదా చెల్లెల్లిని వారి సోదరులు ఏమి కోరారంటే.. నీవు అడుగు పెట్టిన మెట్టినింట్లో మీ అత్త, మామలకు కూడా అలాంటి పరిస్థితి రానీవ్వద్దు" అని అన్న మాటలు ఇప్పటితరం వారిని ఒక్కసారిగా ఆలోచింపజేశాయి.

అనురాగం, ఆప్యాయతలను పెంచే పండుగ..

అనురాగం, ఆప్యాయతలను పెంచే పండుగ..

రక్షా బంధన్ అంటేనే అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య అనురాగం, ఆప్యాయతలను పెంచే పండుగ. మన దేశంలో ముఖ్యమైన పండుగలలో ఇదొకటి. మీ మధ్య సోదర, సోదరీమణుల బంధం మరింత బలపడేలా కింద ఉన్న సందేశాలను వాట్సాప్ లో షేర్ చేయండి.. మీరెంతలా మీ రక్తసంబంధీకులను అభిమానిస్తున్నారో.. మీకు వారిపై ఎంత ప్రేమ ఉందో ఈ విధంగా తెలపండి..

అమ్మలో అర్ధం.. నాన్నలో సగమై..

అమ్మలో అర్ధం.. నాన్నలో సగమై..

అమ్మలో అర్ధం.. నాన్నలో సగమై..

ఉండేవాడే అన్న..

నీకు ఏ కష్టం రాకుండా చూసుకునే అన్నయ్యా..

నీ దీవెనలే నాకు కొండంత అండ..

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..

ఆకలేస్తే తినిపించావు..

ఆకలేస్తే తినిపించావు..

నేను ఏడిస్తే ఓదార్చావు..

నాకు ఆకలేస్తే తినిపించావు..

నా ఆనందం కోసం అన్నివేళలా శ్రమించావు..

నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను..

కనీసం మరో జన్మలో నీ చెల్లెల్లిగాను పుట్టాలని కోరుకుంటూ..

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..

రాఖీ పౌర్ణమి సాక్షిగా దీవిస్తే ఆనందిస్తా..

రాఖీ పౌర్ణమి సాక్షిగా దీవిస్తే ఆనందిస్తా..

నీ ఎదుటే పెరిగాను..

నీ ఎదురుగానే తిరిగాను..

నువ్వు గారభం చేస్తే చిన్న పిల్లనవుతా..

రాఖీ పౌర్ణమి సాక్షిగా దీవిస్తే ఆనందిస్తా..

నన్ను దీవించు అన్నయ్యా..

ఎల్లవేళలా నన్ను ఇలాగే ప్రేమించు..

నీ చిన్నారి చెల్లెలు..

అలక తీర్చే నాన్నలా మారావు..

అలక తీర్చే నాన్నలా మారావు..

నేను అలసిపోతే అమ్మలా జోల పాట పాడావు..

నేను అలిగితే అలక తీర్చే నాన్నలా మారావు..

ప్రేమానురాగాలను పంచే అన్నయ్యగా నిలిచావు..

నీ ఆశీస్సులు నిత్యం కోరుకుంటూ..

రాఖీ పండుగ శుభాకాంక్షలు..

కొండనైనా పిండి చేయగల ధైర్యం..

కొండనైనా పిండి చేయగల ధైర్యం..

మా అన్నయ్య అండగా ఉంటే..

కొండనైనా పిండి చేయగల ధైర్యం..

ఎంతటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదిరించే అన్నయ్యే..

నా జీవితంలో ఆదర్శం..

నిన్ను అభిమానించే నీ చెల్లెలు..

నేను నిత్యం ఆరాధించే అన్నయ్యకు..

నేను నిత్యం ఆరాధించే అన్నయ్యకు..

కనిపించని ఆ దేవుడి కన్నా..

కనిపెంచిన తల్లిదండ్రుల కన్నా..

అనునిత్యం నన్ను కంటికి రెప్పలా కాపాడుకునే

నా అన్నయ్యే నాకు మిన్న..

నేను నిత్యం ఆరాధించే అన్నయ్యకు

రక్షా బంధన్ శుభాకాంక్షలు..

మరచిపోలేను అలాంటి రోజులు..

మరచిపోలేను అలాంటి రోజులు..

ఎప్పుడూ సరదా గొడవలు..

అప్పుడప్పుడు అలకలు..

చివరికి బుజ్జగింపులు, ఊరడింపులు..

మరచిపోలేను అలాంటి రోజులు..

వాటిని గుర్తు చేసుకుంటూ..

రాఖీ పండుగ శుభాకాంక్షలు..

నా కంటికి ఎప్పుడు చిన్న పిల్లగానే..

నా కంటికి ఎప్పుడు చిన్న పిల్లగానే..

నీవు ఎంత ఎత్తుకు ఎదిగినా..

నా కంటికి ఎప్పుడు చిన్న పిల్లగానే..

బాహుబలి అంతా ప్రేమను పంచి..

మనస్ఫూర్తిగా దీవించే చెల్లికి

రాఖీ వేడుక శుభాకాంక్షలు..

English summary

rakshabandhan 2019: Quotes And Whatsapp Messages To Send To Your Near & Dear Ones

Rakshabandhan is a festival of love and affection between the two brothers. This is one of the important festivals in our country. Share the messages below on WhatsApp to make your brother and sister bond .. How much do you love your blood relatives..
Desktop Bottom Promotion