Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే...!
కరోనా వైరస్ మహమ్మారి గురించి స్వర్ణలత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనా వైరస్ మన దేశంలో రోజురోజుకు పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే మూడో స్థానానికి కూడా చేరిపోయింది.

మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ కరోనా మహమ్మారికి విరుగుడు కోసం దేశవ్యాప్తంగా పలు కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఇటీవలే హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ కూడా తమ వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్ అయితే వెంటనే మార్కెట్లోకి విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. ఇది ఇలా ఉండగా.. కరోనా వైరస్ గురించి ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా స్వర్ణలత పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మీరు చేసుకున్నదే....
ఉజ్జయినీ మహంకాళి బోనాల కార్యక్రమంలో స్వర్ణలత పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. ‘‘ఎవరు చేసుకున్న పాపాలను వాళ్లు అనుభవించక తప్పదు.. మీరు చేసుకున్నదే కదా.. కట్టడి చేద్దామని అనుకున్నా.. కానీ మీరే చేతులారా చేసుకుంటున్నారు''అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంతోషం లేదు..
‘నాకు సంతోషం అనేదే లేదు రా బాలక.. నా ప్రజలు చేసిన దానికి నేను ఎంతో దు:ఖిస్తున్నాను. నా ప్రజలందరినీ నేను తప్పనిసరిగా కాపాడతాను. అయితే రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి.. ముందుగానే హెచ్చరిస్తున్నా' అని అన్నారు.

భక్తి భావంతో నన్ను కొలవాలి..
‘‘మీరందరూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రాబోయే రోజుల్లో మీరు తప్పనిసరిగా చేసుకున్నదానికి అనుభవించాల్సి ఉంటుంది. మీరందరూ నన్ను భక్తి భావంతో కొలవాలి.

ఐదు వారాల పాటు..
ఐదు వారాల పాటు సాకబెట్టి.. నాకు యజ్ణ హోమాలు జరిపించండి. కామంతో, కోపతాపాలతో కాదు.. భక్తిభావంతో చేస్తే తప్పనిసరిగా కాపాడతాను. గడప గడప నుండి నాకు ఫలహారాలు ఐదువారాలు తప్పనిసరిగా రావాలి. మహమ్మారిని తప్పకుండా తొలగిస్తా'నని ఆమె భరోసా ఇచ్చారు.

కరోనా ప్రభావంతో పాటు..
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండగా.. భక్తులందరూ అమ్మవారు భవిష్యవాణిలో ఏమి చెబుతారో అని చాలా ఆసక్తి చూపారు.

వర్షాలు, పంటల గురించి..
ఈ భవిష్యవాణి కార్యక్రమంలో ఈ సంవత్సరం వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయని, కరోనా వైరస్ ప్రభావం ఇంకెంత కాలం ఉంటుందనే ప్రశ్నలడిగారు. ఇందుకు సమాధానంగా.. ప్రజలంతా చేజేతులా సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని.. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందేనని అమ్మవారు స్పష్టం చేశారు.

అమ్మవారికి బోనాలు..
అంతకుముందు పరిమిత సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. ఇలా అమ్మవారికి బోనాలు సమర్పిస్తే, తమ కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. ప్రతిఏటా ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.

రాష్ట్ర పండుగగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. గతంలో కూడా కలరా వ్యాధికి గురై అందరూ ప్రాణాలను కోల్పోతుంటే, అమ్మవారు కరుణించబట్టే, ఆ వ్యాధి తగ్గు ముఖం పట్టిందని పెద్దలు చెబుతుంటారు.

అమ్మవారు పుట్టింటికి..
అయితే ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని, అందుకే భక్తులందరూ ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని, తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చినట్లు భావిస్తారని, అందుకే భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారని మరికొందరు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications