For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శివునికి శ్రావణ మాసం ఎందుకు ప్రియమైనది?

|

పవిత్ర త్రిమూర్తులలో, బ్రహ్మా సృష్టికారకుడు, విష్ణువు స్థితికారకుడు (విశ్వం యొక్క పోషకుడు) మరియు శివుడు లయకారకుడు.

ఈ దేవతలందరి కృపాకటాక్షాలను పొందడానికి, వారికి పూజలు చేయడానికి నిర్దిష్ట రోజులు ఉన్నాయి. అదేవిధంగా, శ్రావణ మాసం మొత్తం శివునికి అంకితం చేయబడింది. శ్రావణ మాసం శివుడికి ఇష్టమైన నెల. ఎందుకు ఈ నెల అతనికి అంత ప్రియమైనదని ఆశ్చర్యపోతున్నారా? అందుకు గల కారణాలు మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. చదవండి!

Reasons Why Shravana Is The Favourite Month Of Shiva

1. శ్రావణంలో శివుడు విష్ణువు యొక్క బాధ్యతను తీసుకుంటాడు.

ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు, విష్ణువు నిద్రలోకి జారుకుంటాడు. అతను నాలుగు నెలల నిరంతరం నిద్ర తరువాత, భాధ్రపద మాసంలో దేవుత్తని ఏకాదశినాడు, తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలలు చతుర్మాసంగా పిలుస్తారు. విష్ణువు నిద్రిస్తున్న ఈ సమయంలో, శివుడు విశ్వాన్ని పోషించే బాధ్యతను తీసుకుంటాడు. అందుకే,ఈ నెల అంటే అతనికి మిక్కిలి అభిమానము.

2. సమస్త విశ్వాన్ని శ్రావణ మాసంలో శివుడు రక్షించాడు.

లక్ష్మీ దేవి, విష్ణువు యొక్క నివాసం అయిన వైకుంఠాన్ని వదిలి పెట్టినప్పుడు, విష్ణువు సహాయం కోసం బ్రహ్మ దేవుని వద్దకు వెళతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలు మరియు రాక్షసులను క్షీర సాగర మథనం చేయమని సలహా ఇచ్చారు. సముద్రుని యొక్క కుమార్తె కనుక, లక్ష్మి దేవి తప్పకుండా తండ్రి వద్దకు వెళ్లి ఉంటుందని అతని నమ్మకం, కనుక, క్షీర సముద్రంను చిలికినపుడు ఆమె సముద్రం నుండి ఉద్భవించింది.

రాక్షసులు మరియు దేవతలు, క్షీర మహా సముద్రం చిలకడం ప్రారంభించినప్పుడు, లక్ష్మీ దేవి ఉద్భవానికి ముందు ఒక కుండ వెలుగులోకి వచ్చింది. దేవతలు దీనిని హలాహలంగా గుర్తించారు. ఇది అన్ని విషాలలోకి అత్యంత శక్తిమంతమైనది. దీని యొక్క అలలు కూడా మొత్తం విశ్వాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంటాయి. శివుడి శరీరం అన్ని రకాల విషాలకు నిరోధకమైనది. అందువల్ల, అతను విశ్వాన్ని కాపాడటానికి హాలాహలాన్ని మొత్తం మింగుతాడు. హాలాహలాన్ని మింగినందున, శివని యొక్క గొంతు నీలంగా మారినది.ఈ మొత్తం సంఘటన శ్రావణమాసంలో జరిగింది. కనుక ఈ నెల ప్రత్యేకంగా శివునికి అంకితం చేయబడింది.

3. రుతుపవన వర్షాలు మండుతున్న శివుని శరీరాన్ని చల్లబరుస్తాయి.

వర్షాకాలం కూడా శ్రావణ మాసంలో ప్రారంభమవుతుంది. విషాన్ని తీసుకున్న తరువాత, శివ యొక్క శరీరం, దాని ప్రభావం కారణంగా మండటం ప్రారంభించింది. ఆ సమయంలో, గంగా నది నీటిని అతని శరీరం లోపలి నుండి లోపల నుండి ఉపశమనానికి, వర్షాలను శరీరం బయట నుండి ఉపశమనానికి ఉపయోగించారు. అందువలన, శ్రావణ మాసంలోని వర్షాలు శివునికి మరింత ప్రీతిపాత్రమైనవి.

4. శివుడు, తన కథను సనత్కుమారునికి ఇలా వివరిస్తున్నాడు.

శివుడు సనత్కుమారునికి సముద్ర మథన కథను వివరించాడని చెప్పబడింది. సూర్యుడు శివుని కుడి కన్ను అయితే, చంద్రుడు తన ఎడమ కన్నులో ఉన్నాడని మరియు త్రినేత్రం అగ్నిని సూచిస్తుందని కూడా అతను చెప్పాడు. శ్రావణ మాసం తన అభిమాన నెల కాడడానికి, ఈ సంఘటన శ్రావణ మాసంలో జరిగడం కూడా మరొక కారణం అని తెలియజేసారు.

5. పార్వతి శివుని శ్రావణ మాసంలో పూజించింది.

తన తండ్రి ఇంటిలో సతీ దేవి తన శరీరాన్ని త్యజించినప్పుడు (యోగా శక్తి సహాయంతో, ఆమె మరణించినప్పుడు),ఆమె తన మరు జీవితాలన్నింటిలోని, శివుని మాత్రమే వివాహం చేసుకుంటానని ప్రతినబూనింది. మరుజన్మలో, ఆమె పార్వతిగా జన్మించింది. పార్వతి శ్రావణ మాసంలి శివుని పూజిస్తూ, ఉపవాసాలు చేసింది. ఆమె ప్రార్ధనలకు సంతుష్టుడైన శివుడు, పార్వతిని వివాహం చేసుకున్నాడు. అందుచేత కూడా, ఈ నెల శివునికి ఇష్టమైనది అయ్యింది.

ఒక శ్రావణ సోమవారం నుంచి మొదలుపెట్టి, యువతులు 16 సోమవారాలు నిరంతరంగా ఉపవాసం పాటించేటప్పుడు, వారు కోరుకున్న లక్షణాలు ఉన్న భర్తను పొందుతారు. శివుడు ఆదర్శవంతుడు కనుక, సోమవారాలు ఉపవాసం పాటిస్తూ, అతనిని సేవించిన పడుచుకు శివుడంతటి మంచి వ్యక్తి భర్తగా వస్తాడు.

English summary

Reasons Why Shravana Is The Favourite Month Of Shiva

Reasons Why Shravana Is The Favourite Month Of Shiva,For all these deities, there are specific days when they are worshipped. Similarly, the whole month of Shravana is dedicated to Lord Shiva. In fact, Shravana is the favourite month of Lord Shiva. Wondering why this month is so dear to him? Here are the reasons. Take
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more