ఒక నెమలి ఈకతో మీకున్న అన్ని దోషాలను తొలగించుకోండి !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

నెమలి-ఈక ఎందుకు పవిత్రమైనది? ఈ నెమలి ఈకను మనం నివసించే ఇంటిలో ఉన్న అన్ని ప్రదేశాలలో ఒక మంచి అలంకరణకు ఉపయోగించవచ్చని మనం ఆలోచిస్తాం. అయితే, ఒక సాధారణ నెమలి ఈకలు చాలా దోషాలను తొలగించగలవని మరియు మీ ఇంటి యొక్క వాస్తుకు మంచిదని మీకు తెలుసా? అది ఎలాగో ఇక్కడ చూద్దాం.

మీ ఇంటి వాస్తు దోషలను సరి చేయటానికి :

మీ ఇంటి వాస్తు దోషలను సరి చేయటానికి :

మీరు దీని కోసం 8 నెమలి ఈకలను ఉపయోగించాలి. వాటన్నిటినీ దగ్గరగా కలిపి తీసుకుని, వాటి దిగువ భాగాన్ని ఒక తెల్లటి దారముతో గట్టిగా కట్టండి. ఇప్పుడు మీరు జపించవలసిన మంత్రం : ఓమ్ సోమయే నమః !

శని-దోష నివారణకు :

శని-దోష నివారణకు :

నల్లని దారంతో మూడు నెమలి ఈకలను కలిపి కట్టాలి. తాంబూలంలో వాడే కొన్ని చెక్కలను ఉంచి, వాటిపై నీటిని జల్లుతూ, ఈ మంత్రమును 21 సార్లు జపించాలి : ఓం శనేశ్వరాయ నమః శపించు.

లాకర్కు సమీపంలో :

లాకర్కు సమీపంలో :

డబ్బులు దాచుకునే లాకర్కు సమీపంలో మీరు ఒక నెమలి ఈకను ఉంచాలి. నెమలి ఈక సంపదని ఆకర్షించి, స్థిరత్వాన్ని సిద్ధింపజేస్తుంది.

మీ ఇల్లు మరింత అందంగా ఉండటానికి :

మీ ఇల్లు మరింత అందంగా ఉండటానికి :

నెమలి కూడా అందంతో సంబంధమును కలిగి ఉంటుంది. నృత్యం చేస్తున్నట్లుగా ఉన్న నెమలి పెయింటింగ్ను మీ లివింగ్ రూమ్లో ఉంచినట్లయితే, మీ గదిలో అందమును, శోభను మరియు ఆకర్షణను కలగజేస్తుంది.

ప్రతికూల-శక్తుల కొరకు :

ప్రతికూల-శక్తుల కొరకు :

మీ ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తులనైనా (లేదా) వాస్తు దోషాలను తొలగించడంలో నెమలి ఈకలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీ ఇంటి ప్రవేశద్వారం వద్ద కొన్ని నెమలి ఈకలను ఉంచండి.

ఆఫీస్లో అలంకరణకు :

ఆఫీస్లో అలంకరణకు :

మీరు మీ ఉత్పాదకతను పెంచడానికి మీ కార్యాలయంలో ఒక అందమైన నెమలి పెయింటింగ్ను (లేదా) నెమలి ఈకను ఉంచవచ్చు.

ప్రదర్శన కోసం కాదు :

ప్రదర్శన కోసం కాదు :

ఒక ప్రత్యేకమైన గదిలో ఉన్న వాస్తు దోషాలను తొలగించటానికి ఉపయోగించబడుతున్న నెమలి ఈకలను ఒక ప్రదర్శనగా పరిగణించరాదని, మరియు వాటికై సరైన జాగ్రత్తలను తీసుకోవాలి.

సరైన జాగ్రత్తలను తీసుకోండి :

సరైన జాగ్రత్తలను తీసుకోండి :

ఈ నెమలి ఈకల పైన దుమ్ము, ధూళి చేరకుండా చూసుకోవాలి. ఎందుకంటే, ఇది మీ ఇంటిలో కొన్ని ప్రత్యేక కారణాల కోసం ముఖ్యమైన అవసరంగా ఉపయోగించబడుతోంది కాబట్టి.

ఆరోగ్యం మరియు శ్రేయస్సు :

ఆరోగ్యం మరియు శ్రేయస్సు :

పూర్వ కాలంలో, శరీరం నుండి పాయిజన్ను తొలగించే మందుగా నెమలి ఈకలను ఉపయోగించేవారు. ఈ కారణం చేత ఈ నెమలి ఈకలు ఆరోగ్యము మరియు శ్రేయస్సుతో సంబంధమును కలిగి ఉంటాయి.

తెగుళ్లను దూరంగా ఉంచుతుంది :

తెగుళ్లను దూరంగా ఉంచుతుంది :

ఈ నెమలి ఈకలు మీ ఇంటి నుండి బల్లులను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ విధంగా నెమలి ఈకలు మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతాయి.

ప్రేమను పెంచుతుంది :

ప్రేమను పెంచుతుంది :

పడకగదిలో ఉన్న నెమలి చిత్రము, మీ జంటల మధ్య సన్నిహిత్యమును మరియు అవగాహనను పెంచేలా చేస్తుంది.

ఇంటి తలుపుకు నెమలి చిత్రాన్ని ఉంచండి :

ఇంటి తలుపుకు నెమలి చిత్రాన్ని ఉంచండి :

నెమలి చిత్రాన్ని మీ ఇంటి తలుపు ముందు ఉంచాలి, ఇది మీ ఇంటివైపు ఆవహించి ఉన్న చెడు శకునాలను మరియు ప్రతికూల శక్తులను తీసుకుంటుంది.

వేదాలలో పేర్కొనబడినది :

వేదాలలో పేర్కొనబడినది :

మన వేదాలలో మరియు ఇతర పురాతనమైన అన్ని పక్షి గ్రంథాలలో నెమలి చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్నది. 'నెమలి' ఈక లేకుండా శ్రీ కృష్ణుడి తన రూపాన్ని అసంపూర్తిగా కలిగి ఉంటారు.

ఆధ్యాత్మిక శక్తి :

ఆధ్యాత్మిక శక్తి :

పురాణ గ్రంథాల ప్రకారం, నెమలి ఈకలు కూడా ఆధ్యాత్మిక శక్తిలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

అన్ని గ్రహ చక్రాలకు ఉపయోగకరమైనది :

అన్ని గ్రహ చక్రాలకు ఉపయోగకరమైనది :

నెమలి ఈకను సరిగ్గా ఉపయోగించినట్లయితే, మీ జన్మ కుండలి నుండి ఎదురయ్యే అన్ని బలహీన ప్రభావాలను తొలగించే శక్తి వీటికి ఉంది.

అనుకూలత మరియు సమతుల్యత :

మీ ఇంట్లో ఒక నెమలి ఈకను ఉంచడం ఎంతో ప్రాముఖ్యమైనది - ఎందుకంటే ఇది, మీ జీవితంలో స్థిరత్వమును మరియు సమతుల్యతను తీసుకువస్తుంది.

English summary

Remove all your doshas with a peacock feather!

How Peacock Feather Remove all Doshas: Remove all your doshas with a peacock feather! Did you know that a simple peacock feather can even remove many doshas and is good vastu for your house? Here’s how.