For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓం ‘నమ శివాయ‘ (పంచాక్షరి) మంత్రం ఎలా ఉద్భవించిందో తెలుసా...

శివుడి ఐదు ముఖాలపు పంచ బ్రహ్మలుగా పండితులు చెబుతున్నారు. వాటి పేర్లే ‘సద్యో జాత, వామ దేవ, అఘెరా, తత్పురష, ఈశాన‘. ఈ ఐదు ముఖాల్లోంచే ‘న, మ, శి, వా, య‘ అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది.

|

ఈ సృష్టిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు. ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది.

Shiva Panchakashari mantra benefits

శివుడి ఐదు ముఖాలపు పంచ బ్రహ్మలుగా పండితులు చెబుతున్నారు. వాటి పేర్లే 'సద్యో జాత, వామ దేవ, అఘెరా, తత్పురష, ఈశాన'. ఈ ఐదు ముఖాల్లోంచే 'న, మ, శి, వా, య' అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది. మరి ఈ మంత్రం స్మరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో మీరే చూడండి...

శివుడిని పూజించే ప్రతి పువ్వుకు ఒక అర్ధం మరియు ప్రయోజనం ఉంటుంది: ఈ పువ్వులతో మీ కోరికలు తీరుతాయి...శివుడిని పూజించే ప్రతి పువ్వుకు ఒక అర్ధం మరియు ప్రయోజనం ఉంటుంది: ఈ పువ్వులతో మీ కోరికలు తీరుతాయి...

ప్రపంచ నాయకుడు పరమేశ్వరుడు..

ప్రపంచ నాయకుడు పరమేశ్వరుడు..

‘న, మ, శి, వా, య‘ అనే ఐదు ముఖాలకు చైతన్యం ఇచ్చేది సాక్షాత్తు పరమేశ్వరుడు. అందుకే ఈ దేవుడిని ప్రపంచ నాయకుడిగా కొలుస్తారు అని పండితులు చెబుతున్నారు.

పంచ భూతాలు..

పంచ భూతాలు..

ఈ పంచాక్షరి మంత్రం ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు అగ్ని, గాలి, ఆకాశాన్ని సూచిస్తుంది. ఈ మంత్ర స్మరణ యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు.

ఈ మంత్రాన్ని జపిస్తే..

ఈ మంత్రాన్ని జపిస్తే..

ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తులందరూ ఎంతో శ్రద్ధతో స్మరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని జపించిన వారి మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. దీని వల్ల అద్భుతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. అంతేకాదు సానుకూల శక్తులు కూడా లభిస్తాయి.

ఒత్తిడి తగ్గుతుంది..

ఒత్తిడి తగ్గుతుంది..

ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల దుష్టశక్తులు మన దరి చేరవు. ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల మెదడు, శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు నిద్రలేమి, మానసిక, అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించి ప్రశాంతత లభిస్తుంది.

మహా శివరాత్రి 2020 : మీ విషెస్ తో భోళా శంకరుడి ఆశీర్వాదాలను పంపండి..మహా శివరాత్రి 2020 : మీ విషెస్ తో భోళా శంకరుడి ఆశీర్వాదాలను పంపండి..

108 సార్లు జపిస్తే..

108 సార్లు జపిస్తే..

ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనలో కోపం, ఆవేశం తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

ఎప్పుడు స్మరించాలంటే?

ఎప్పుడు స్మరించాలంటే?

ఓం నమ శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు. ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. తెల్లవారు జామునే స్నానం చేసి, నిటారుగా కూర్చోవాలి. కళ్లు మూసుకుని, జప మాల తీసుకుని ‘ఓం నమ: శివాయ‘ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాలి.

జపమాల లేకపోతే..

జపమాల లేకపోతే..

ఒక వేళ మీ వద్ద జపమాల లేకపోతే... మీరుే మీ వేళ్లతో అయినా లెక్కపెట్టుకోవచ్చు. ఈ మంత్రాన్ని జపించడం 108 సార్లు పూర్తయిన తర్వాత, అలాగే కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. దీని వల్ల మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తిని మీ శరీరం గ్రహిస్తుంది.

English summary

Shiva Panchakashari mantra benefits

Here we talking about shiva panchakshari mantra benefits. Read on
Desktop Bottom Promotion