Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఈ సంకేతాలుంటే.. మీకు గత జన్మతో సంబంధం ఉన్నట్టే...!
మీ అందరికీ మగధీర సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో హీరో రామ్ చరణ్ కు కాజల్ చేయి తగలగానే ఏదో షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అకస్మాత్తుగా తన గత జన్మ గురించి గుర్తొస్తుంది అలా అన్నమాట.
ఈ విశ్వంలో తమ గత జన్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవ్వరికైనా ఉంటుంది. అసలు గత జన్మ అనేది ఉందా లేదా అనే దానిపైనా కంటే గత జన్మంలో ఏ జీవిగా పుట్టామో తెలుసుకోవాలనే కుతుహాలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. గత జన్మ కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అవన్నీ సూపర్ హిట్ కూడా అయ్యాయి.
దీంతో మనలో చాలా మంది గత జన్మ గురించి మరింత ఆసక్తి పెరిగింది. మీరు గత జన్మలో ఎలా పుట్టారు? మీరు ఎలాంటి వ్యక్తిగా పుట్టారో తెలుసుకోవాలని ఆరాట పడుతున్నారా? అయితే మీకు గత జీవితం గురించి ఆశ్చర్యకరంగా మరియు వింతగా అనిపించే కొన్ని సంకేతాలను పరిశీలించండి. మీరు మీ పూర్వ జన్మ ఆలోచనలతో ఆకర్షితులై, మీకు గత జన్మలో జీవితం ఎలా ఉండేదో తెలుసుకోండి...

కొన్ని శాశ్వత క్షణాలు..
మీరు ప్రస్తుత జీవితంతో సంబంధం లేని కొన్ని క్షణాలు మీకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా భావించారా? ఉదాహరణకు, మీరు ఎన్నడూ లేని ప్రదేశంలో నివసించినట్లు లేదా మీకు పూర్తిగా తెలియని పనులు చేసినట్లు అనిపించినా కూడా అది గత జీవితానికి సంబంధించిన సంకేతాలలో ఒకటి.

అచ్చం సినిమాలోలాగా..
మీ అందరికీ మగధీర సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో హీరో రామ్ చరణ్ కు కాజల్ చేయి తగలగానే ఏదో షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అకస్మాత్తుగా తన గత జన్మ గురించి గుర్తొస్తుంది అలా అన్నమాట. ఇలాంటివి మీ మనసుకు అనిపిస్తే మీకు గత జన్మతో సంబంధం ఉన్నట్టే.

అనుభవాలు అస్పష్టంగా..
మీరు ఇంతకుముందు ఒక నిర్దిష్ట భాష విన్నట్లు లేదా ఒక నిర్దిష్టమైన వాక్యాన్ని మాట్లాడినట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఉదాహరణకు మీరు మీ స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా మీరు ఈ క్షణం ముందు జీవించారని మీకు అనిపిస్తుంది. ఈ భావన ఆ వ్యక్తి లేదా ఆ ప్రదేశంతో పరిచయం కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటివి మీ ప్రస్తుత జీవితంలో మీరు ఎప్పటికీ చూసి ఉండరు. లేదా అనుభవించకపోయి ఉండరు. కానీ దాంతో మీకు కనెక్షన్ ఉందని భావిస్తారు. ఇలాంటి అనుభవాలు అస్పష్టంగా ఉంటాయి కాబట్టి మీకు కొంత బాధ కలిగించొచ్చు.

వింత భయాలు..
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి వారి అనుభవాలను బట్టి వేర్వేరు రకాల భయాలు కలిగి ఉంటారు. కానీ కొంతమంది వింత భయాలు కలిగి ఉంటారు. వీరికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. వీరు ఎప్పుడు ప్రమాదం లేదని తెలిసినా కూడా తెగ భయపడిపోతుంటారు. అయితే ఈ భయాలు గత జన్మతో ముడిపడి ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి.

అద్భుతమైన టాలెంట్..
ఒక పిల్లవాడు.. అది కేవలం రెండు లేదా మూడు సంవత్సరాల వయస్సులో ఉన్న చిన్నారి డ్యాన్సులో ఎంతో ప్రావీణ్యం ఉన్నట్టు చక్కగా చేస్తుంటాడు. అలాంటి వారిని ఇతర పిల్లలతో పోల్చి చూసినప్పుడు వారి రంగంలో వారు అసాధారణమై టాలెంట్ చూపుతుంటారు. ఇలాంటి వాటిని గత జీవితానికి సంకేతంగా భావిస్తారు.

విచిత్రమైన కలలు..
చాలా మంది ప్రజలు చాలా సమయాల్లో విచిత్రమైన పీడకలలను లేదా సాధారణ కలలను కంటూ ఉంటారు. అలాంటి కలలే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. దీని వెనుక గల కారణాన్ని వారు తెలుసుకోలేకపోతారు. అయితే ఇలాంటి తరచుగా వస్తుంటే గత జన్మలో మీకు సంబంధించిన మంచి మధుర క్షణాలు లేదా బాధలను గుర్తు చేస్తుందని చాలా మంది భావిస్తారు.

తెలియని ప్రదేశంలో..
మీరు మీకు ఎప్పటికీ తెలియని కొత్త ప్రదేశంలో ఉండాలని కలలు కంటున్నట్టు.. మీ ప్రస్తుత జీవితం నుండి తెలియని వ్యక్తిని కలవడం.. ఇలాంటి కలలను విస్మరించడానికి బదులుగా.. మీరు నిజంగా అందులో ఒక సంబంధాన్ని కూడా కనుగొంటారు. మీ గత జన్మలో ఎవరో కూడా తెలుసుకోవచ్చు.

వింత గుర్తులు..
శరీరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుర్తులు (పుట్టుమచ్చలు) ఉండే వారు చాలా మందే ఉంటారు. అందరూ వీటిని సాధారణమైనవిగా భావిస్తారు. కానీ సైన్స్ ప్రకారం గర్భంలో మన స్థానం కారణంగా లేదా కొన్నియాదృచ్ఛిక వర్ణద్రవ్యం కారణంగా ఇవి జరుగుతాయి.

మీకు బలమైన నమ్మకం ఉంటే..
అయితే మీరు మీ మునుపటి జీవితానికి సంబంధించి మీకు బలమైన నమ్మకం ఉంటే, మీరు గత జీవిత చరిత్ర గురించి ఆలోచించవచ్చు. అయితే మీరు మీ ప్రస్తుతం ఉన్న జీవితంపై కూడా శ్రద్ధ వహించాలి. దాని నుండి ఉత్తమమైనదాన్ని పొందడమే మంచిది. మీకు అప్పుడప్పుడు కలిగే సందేహాలకు సమాధానాలు కనుగొనడంలో ఇలాంటివి మీకు తప్పకుండా సహాయపడతాయని ఆశిస్తున్నాం.



Click it and Unblock the Notifications
