For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్కొండ కోట దగ్గర మొదట బోనాలు ఎందుకు ఎత్తుతారంటే! ముస్లిం పాలకులూ గౌరవించారు, వెయ్యేళ్ల చరిత్ర

గితంతా పక్కన పెడితే తెలంగాణలో చేసుకునే ప్రతి పండగకు కూడా ఒక చార్రిత్రక నేపథ్యం ఉంటుంది. ఒక శాస్త్రీయత ఉంటుంది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే మాదిరిగానే పండుగలుంటాయి.

|

బోనాల పండుగ అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికీ తెలుసు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగలు.. బోనాల పండుగ, బతుకమ్మ పండుగ. ఇక పండుగలు వస్తే ఆ కళే వేరు. ఇప్పుడంటే హైదరాబాద్ జరంతా బోనాల పండుగలకు ఫేమస్ గావొచ్చేమో గానీ పూర్వ కాలం ఊర్లలో ఈ పండుగలను మస్త్ గా జరుపుకునేటోళ్లు.

ఇక ప్రస్తుతం ఉన్న సర్కార్ తెలంగాణ పండుగలను అధికారికంగా కూడా మంచిగానే నిర్వహిస్తుంది. బోనాల పండుగంటే అందరికీ గోల్కొండ కోటనే యాదికొస్తది. గాడ బోనమెత్తినాకే మిగతా చోట్ల బోనం ఎత్తుకుంటారు. ఈ ఆషాఢమంతా ఆదివారం, గురవారాల్లో బోనల పండుగను ఒక్కోచోట ఒక్కోరకంగా మస్తుగా చేసుకుంటారు.

గోల్కొండ కోటనే యాదికొస్తది

గోల్కొండ కోటనే యాదికొస్తది

ఇక ప్రస్తుతం ఉన్న సర్కార్ తెలంగాణ పండుగలను అధికారికంగా కూడా మంచిగానే నిర్వహిస్తుంది. బోనాల పండుగంటే అందరికీ గోల్కొండ కోటనే యాదికొస్తది. గాడ బోనమెత్తినాకే మిగతా చోట్ల బోనం ఎత్తుకుంటారు. ఈ ఆషాఢమంతా ఆదివారం, గురవారాల్లో బోనల పండుగను ఒక్కోచోట ఒక్కోరకంగా మస్తుగా చేసుకుంటారు.

ప్రతి పండగకు చార్రిత్రక నేపథ్యం

ప్రతి పండగకు చార్రిత్రక నేపథ్యం

గిదంతా పక్కన పెడితే తెలంగాణలో చేసుకునే ప్రతి పండగకు కూడా ఒక చార్రిత్రక నేపథ్యం ఉంటుంది. ఒక శాస్త్రీయత ఉంటుంది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే మాదిరిగానే పండుగలుంటాయి. డప్పులు, తాళాల మధ్య నెత్తి మీద బోనం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఆడోళ్లు. ఈ పండుగకు దేశవిదేశాల్లోనూ ఒక పేరుంది. పక్కదేశపుటోళ్లు కూడా మన బోనాలు పండుగ చేసుకుంటారు.

కంటికి రెప్పలా కాపాడే అమ్మవార్లకు

కంటికి రెప్పలా కాపాడే అమ్మవార్లకు

మన గ్రామ దేవతలకు మొక్కు తీర్చుకునే పండుగే బోనాల పండుగ. ఊరంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ పండుగ చేసుకుంటాం. జనాలందరినీ కంటికి రెప్పలా కాపాడే అమ్మవార్లకు సమర్పించేదే బోనం. భోజనాన్నే బోనం అంటారు.

పుట్టిళ్లకు వస్తారని నమ్మకం

పుట్టిళ్లకు వస్తారని నమ్మకం

బోనాన్ని వండి అమ్మవారికి నివేదించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఆషాఢంలో అమ్మవార్లంతా కూడా పుట్టిళ్లకు వస్తారని భక్తుల నమ్మకం. అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో బోనం సమర్పిస్తారు.

రెండు కళ్లు చాలవు

రెండు కళ్లు చాలవు

ఎవ్వరి ఇళ్లలో వాళ్లు చేసుకుని తినే పండుగలులాగా కాదు బోనాల పండుగ. ఈ పండుగకు జనమంతా ఏకమైతది. వేల మంది ఒకసారి వేడుకలో పాల్గొంటారు. చూడడానికి రెండు కళ్లు చాలవు. అంత కళ ఈ పండుగ తెస్తుంది.

సైంటిఫిక్ రీజన్ ఉంది

సైంటిఫిక్ రీజన్ ఉంది

ఆషాఢమంటేనే వానకాలం. ఇప్పుడు ఏవేవో రోగాలు ప్రబలుతుంటాయి. అవన్నీ రాకుండా మా పిల్లల్ని సల్లంగా సూడు తల్లీ అని అమ్మకు మొక్కేందుకే బోనం పండుగ చేసుకుంటాం. బోనం కుండకు పసుపు పూస్తరు. వేప ఆకులు కడతారు. ఇందుకు ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. వానకాలం వచ్చే బ్యాక్టీరియాను, వైరస్ ను చంపే గుణం వీటికి ఉంటుంది. అందుకే అలా చేస్తారు.

వెయ్యేళ్ల చరిత్ర

వెయ్యేళ్ల చరిత్ర

ఇక భాగ్యనరంలోని బోనాలకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. గోల్కొండలో బోనం ఎత్తినాకే అంతటా సంబరాలు చేసుకుంటాం. గోల్కొండలోని ఆలయంలో కాకతీయుల కాలం నుంచి బోనాల పండుగ చేస్తున్నారు. అందుకే అంత ప్రాముఖ్యం ఉంది.

కాకతీయుల కాలంలో ఈ ఆచారం

కాకతీయుల కాలంలో ఈ ఆచారం

అప్పట్లో రుద్రమదేవి మనుమడు ప్రతాప రుద్రుడు గోల్కొండ దగ్గర బోనాలప్పుడు పూజలు కూడా చేశాడంట. అందుకే ఇప్పుడు కూడా గోల్కొండలోని జగదాంబిక ఆలయంలోనే మొదటి పూజలు జరుగుతాయి.

అట్ల అప్పటి నుంచి ఇప్పటి దాకా

అంటువ్యాధులనేవి అమ్మవారు కోప్పడితేనే వస్తాయని ఆమెను శాంతపరచాలని బోనాల పండుగను గతంలో గోల్కొండ కోట దగ్గర మొదలుపెట్టినారంట. అట్ల అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆచారం పాటిస్తున్నారు. కాకతీయుల కాలంలో ఈ ఆచారం మొదలైంది.

ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని గుర్తించుకోవాలి

అమ్మవారి ఎదుట అన్నంపోసి తల్లీ ఎలాంటి రోగాలు రాకుండా మమ్మల్ని సుభిక్షింగా చూడు అని వేడుకునేటోళ్లు. అలా చేయడం వల్లే అమ్మవార్లు మనల్ని కాపాడుతున్నారని ఒక నమ్మకం. మన నమ్మకాన్ని, మన సంస్కృతిని గౌరవించుకోవాలి. ఇలాంటి పండుగలను గొప్పగా చేసుకోవాలి. తరతరాలుగా వస్తున్న ఆచారానికి కచ్చితంగా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని గుర్తించుకోవాలి.

ముస్లిం పాలకులు కూడా చేసుకోమన్నారు

కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు కూడా గోల్కొండ దగ్గర బోనాల పండుగ చేసుకునే ఏర్పాట్లు కూడా చేశారు. ముస్లిం పాలకులు కూడా బోనాల పండుగను వారి దర్బార్ దగ్గరే చేసుకునేందుకు అనుమతిచ్చారంటే మన పండుగ సంప్రదాయం ఎంత ఘనమో అర్థం చేసుకోవాలి.

English summary

telangana state festival bonalu history and facts

Now it is once again time for heralding ‘Bonalu’, the State festival of Telangana, marking the commencement of auspicious Ashada month. Women, dressed in colourful sarees and holding pots on their heads, queue up at temples of Mahankali for redeeming their vows. The month-long exciting and thrilling festivities of Bonalu always remain wonderful memories for one and all. During the festival temples of Goddesses across the State are decked up with an exquisite touch. Villages and towns wear a festive look and are awash in colours while devotees flock to the shrines to offer ‘Bonalu’ to the deities.
Desktop Bottom Promotion