గణేశుని నివాసం -స్వనంద లోకం

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

హిందువులకు అత్యంత ప్రీతికరమైన దైవం బహుశా వినాయకుడే కావచ్చు. హిందూ మతంలో వేలకొలది దేవుళ్లను, దేవతలను ఆరాధిస్తారు. చాలామంది భక్తులు ఒక దేవుడిని ఎంచుకుని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. ఏ దేవుడు ఇష్టదైవమైనప్పటికి, వారిని పూజించేముందు తొలిపూజలను అందుకునేది మాత్రం బొజ్జగణపయ్యే!

గజముఖంతో, గుజ్జురూపంతో ఉండే గణేశుడిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ప్రేమిస్తారు. లంబోధరుని భక్తుల తుదిలక్ష్యం ఈ భువనాన్ని వీడిన తరువాత అతని సన్నిధిని చేరుకోవడమే! బ్రహ్మ నివసించే ప్రదేశాన్ని బ్రహ్మలోకమంటారు.

అదేవిధంగా వినాయకుడు నడయాడే ప్రదేశాన్ని స్వనంద లోకమంటారు.

The abode of Lord Ganesha- Swananda Loka

విష్ణుభగవానుడు విష్ణులోకంలోని క్షీరసముద్రంగా పేరుగాంచిన పాలసముద్రంలో నివసిస్తాడు. శివుడు కైలాసంలో నివసిస్తాడు. వివిధ దేవతలు వివిధలోకాలలో నివసిస్తారు. అదేవిధంగా వినాయకుడు స్వనంద లోకంలో నివసిస్తాడు.

ఈ సంకష్ట చతుర్దశి సందర్భంగా వినాయకుని లోకానికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకుందాం. మీకు కూడా ఈ లోకాన్ని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మరెందుకు ఆలస్యం? చదవండి!

స్వనంద లోక ప్రస్తావన:

స్వనంద లోక ప్రస్తావన:

గణేశ పురాణ ఉత్తరకాండలోని యాభై ఒకటవ అధ్యాయంలో ఈ లోకము గురించిన ప్రస్తావన ఉంది. ఈ పురణంను ముద్గల అనే ఋషి రచించారు. ఈ అధ్యయంలో రచయిత, ఈ లోకంలో భోగభాగ్యాలు మిగిలిన అన్ని లోకాలకన్నా గొప్పగా ఉంటాయని వర్ణించారు.

స్వనంద లోకానికి అర్ధం:

స్వనంద లోకానికి అర్ధం:

గణేశుని లోకాన్ని స్వనంద భవనం లేదా స్వనంద భువనం లేదా స్వనంద నిజాలోకమని కూడా అంటారు. ఈ అన్ని పేర్లకు అర్ధం ఒక్కటే - పరమానంద నిలయం.

స్వనంద లోక సృష్టి:

స్వనంద లోక సృష్టి:

స్వనంద లోకం కామదాయిని యోగ శక్తిగా పిలుచుకునే గణేశుని శక్తి చేత సృజించబడినది. ఈ పీఠం లేదా దీవి ఐదువేల యోజనాల వైశాల్యం కలిగి ఉంటుంది.

స్వనంద లోకానికి మార్గం:

స్వనంద లోకానికి మార్గం:

ఈ లోకానికి దరిచూపే మార్గాన్ని దివ్యలోకం అంటారు. ఈ మార్గం చాలా కఠినతరమైనది. గణేశుని లోకాన్ని చేరుకోవడం అంత సులభతరం కాదు. అతి పవిత్రమైన మునులకు కూడా ఈ లోకం చేరుకోవడం అసాధ్యం. ఈ లోకాన్ని చేరుకోవాలంటే, యోగ, దాన, యజ్ఞ,వ్రతాలతో లేదా వేదాంత జ్ఞానం అధ్యయనం చేసి అవలంబించడం ద్వారా మాత్రమే కుదురుతుంది. వినాయకుని కృపకు పాత్రులైనవారు చేరుకోవచ్చు. నిరంతరం ధ్యానించడం ద్వారా మాత్రమే ఆయన కృపకు పాత్రులవ్వవచ్చు.

భ్రమరాంబిక పాలకులు:

భ్రమరాంబిక పాలకులు:

గణేశుని రాజభవంతి చుట్టూ వెయ్యి యోజనాల శూన్యత ఉంటుంది. దీనిని దాటడం ఎవరికి సాధ్యం కాదు. దీనిని ఎవరైనా దాటాలనుకుంటే భ్రమరాంబిక పాలకులను ఎదుర్కోవాలి. వీరు కూడా వినాయకుని యోగ శక్తులచే సృష్టించబడ్డారు. ఈ పాలకులు బంగారు రంగులో, వేయి సూర్యుల కాంతితో అలరారుతుంటారు. వారు ఉగ్రరూపంతో, దట్టమైన కేశాలతో ఉంటారు.

స్వనంద లోకంలోని భోగభాగ్యాలు:

స్వనంద లోకంలోని భోగభాగ్యాలు:

స్వనంద లోకంలోని సిరులకు కొదవులేదు. రహదారులు బంగారం మరియు మణులతో చేయబడ్డాయి. కంటిచూపుమేర అమూల్యమైన రాళ్లు నిండి ఉంటాయి. ఈ లోకంలో లేమికి చోటులేదు.

గణేశుని సింహాసనం:

గణేశుని సింహాసనం:

ఈ విశ్వానికి ఉత్తరదిక్కున చెరకు రసంతో నిండిన మహాసముద్రం ఉంది. దీని మధ్యలో వేయి రెక్కలున్న, అందమైన , పెద్ద ,ఎర్రకలువ పూవు ఉంటుంది. దీనిలోని బంగారంలో వజ్రవైఢూర్యాలు, అమూల్యమైన రత్నాలు పొడగబడి తయారైన సింహాసనం ఉంటుంది. దీనిపై వినాయకుడు ఆసీనుడై ఉంటాడు.

వినాయకుని రూపం:

వినాయకుని రూపం:

వినాయకుడు తొమ్మిది ఏళ్ల బాలునివలె ఉంటాడు. ఆయన రక్తవర్ణంలో కాషాయవర్ణ తిలకధారి అయి ఉంటాడు. ఆయనకు, తన తండ్రి అయిన శివుని వలేె మూడుకళ్ళు ఉంటాయి. ఇవి సూర్యచంద్రులు మరియు అగ్నిని సూచిస్తాయి. గుండ్రంగా ఉండే భూమి ఆయన పొట్ట. ఆయన శరీరం పై ఉండే కేశాలు, నక్షత్రాలు మరియు గ్రహాలు. ఆయన శరీరంపై స్వేదం నదులు, సముద్రాలు మరియు మహాసముద్రాలు. ఆయన శరీరం బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఉంటుంది. ఆయన దివ్య మాల అనే పూలదండ వేసుకుని ఉంటాడు. ఆయన విలువైన వస్త్రాలు ధరించిన సువస్త్రధారి. ఆయన చుట్టూ దివ్య పరిమళాలు నిండి ఉంటాయి. ఆయన అందమైన కిరీటం (ముక్తాభరణ) ధరించి ఉంటాడు. తండ్రి వలె అర్ధచంద్రుని జటాజూటంలో కలిగి ఉంటాడు. ఈ అలంకరలతో ఉన్న వినాయకుని స్మరణ మాత్రం చేత మన పాపాలు తొలగిపోతాయని చెప్పబడివుంది.

గణేశుని సేవకులు:

గణేశుని సేవకులు:

బాలగణేశుని అష్టసిద్ధులు సేవిస్తాయి. వీటికి స్త్రీ రూపం ఉంటుంది. తాంత్రిక గ్రంధాలలో అష్టసిద్ధులను గణేశుని అష్టభార్యలుగా వర్ణించారు. పవిత్ర గ్రంధాలైన వేదాలు మానవరూపాన్ని పొంది గణేశుని కీర్తిస్తాయి. వివిధ చిత్రాలు వినాయకుని బాలరూపంలో కూడా జ్ఞానానికి, నైపుణ్యానికి అధిపతిగా చూపిస్తాయి.

స్వనంద లోకానికి ద్వారాలు:

స్వనంద లోకానికి ద్వారాలు:

ఈ లోకానికి నాలుగు దిక్కులలో నాలుగు ద్వారాలుంటాయని చెప్పబడి ఉంది. ప్రతి ద్వారం వద్ద ఇద్దరు ద్వారాపాలకులు కాపు కాస్తుంటారు. వీరు పొట్టిగా, పూర్తి అనురక్తితో కూడిన వారై ఉంటారు. చతుర్భుజులైన వీరు చాలా బలవంతులు. రెండు చేతులతో ఆయుధాలు కలిగి ఉంటారు.

మూడవ చేతిలో దండం ఉంటుంది.

మూడవ చేతిలో దండం ఉంటుంది.

నాలుగవ చేయి తర్జని ముద్రతో ఉంటుంది. తర్జని ముద్రలో చూపుడు వేలు మరియు బొటన వేలు ఒకదానికొకటి అంటుకుని ఉంటాయి. ఈ ముద్ర ఆత్మ మరియు గణేశుని అనుసంధానాన్ని తెలియజేస్తుంది. తూర్పు ద్వారాల వద్ద విఘ్న రాజు, అవిఘ్న రాజు కాపలా ఉంటారు.దక్షిణ ద్వారం వద్ద బలరామ, స్వక్త్రలు, పడమర ద్వారం వద్ద గజకర్ణ, గోకర్ణులు మరియు ఉత్తర ద్వారం వద్ద సుసౌమ్య, శుభదాయకులు కాపలా ఉంటారు. మిగిలిన స్వనంద లోకమంతటికి తేజోవతి, జ్వాలిని అనే పేరు కలిగిన శక్తులు కాపలా ఉంటాయి.

స్వనంద లోకంలో ఇతర నివాసితులు:

స్వనంద లోకంలో ఇతర నివాసితులు:

స్వనంద లోకంలో వివిధ దేవతలు, మనుష్య ఆత్మలు మరియు వినాయకుని కృపకు పాత్రులైన ఇతర పుణ్య జీవులు ఉంటారు. వీరు వేలసంఖ్యలో ఉదుంబ్ర వృక్షం చుట్టూ దోమలవలె వినాయకుని చుట్టూ ఉంటారు. మనోకామన సిద్ధినిచ్చే వృక్షాలతో కూడిన దట్టమైన అడవులు కూడా ఈ దీవిలో ఉంటాయి.

వినాయకుని ఎలుక:

వినాయకుని ఎలుక:

వినాయకుని వాహనం ఎలుక అని మనందరికి తెలిసినదే. ఈ ఎలుక నిజానికి అగ్నిదేవుడని, శివునిచే కానుకగా ఇవ్వబడ్డాడని కథనం. ఈ ఎలుజ కూడా స్వనంద లోకంలో ఉంటుంది. ఇది బాలగణేశుని చెంత నిత్యం ఉంటుంది.

English summary

The abode of Lord Ganesha- Swananda Loka

The abode of Lord Ganesha- Swananda Loka,Did you know that the world of Lord Ganesha is known as Swananda Loka? Yes! Read to know more about the meaning, creation and the path of Swananda Loka.