For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నమ్మలేని నిజం ! ఆ ఆలయంలో దేవతల విగ్రహాలు ప్రతిరోజూ మాట్లాడతాయని మీకు తెలుసా...!

|

భారతదేశం అంటేనే అనేక కులాలు, మతాలు కలిసి ఉంటున్న దేశం. మన దేశంలో పవిత్రమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ చాలా దేవాలయాల్లో ఎన్నో మిస్టరీలు మనకు కనబడుతూనే ఉన్నాయి. నేటి ఆధునిక యుగంలో ఎంత టెక్నాలజీ పెరిగినా వాటి గురంచి ఇసుమంతైనా వాస్తవాలను కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పటివరకు మీరు రాళ్లను తాకితే సంగీతం వినబడే దేవాలయాలను చూసుంటారు. గాల్లో తేలియాడే గోపురాలను చూసుంటారు. మరి విగ్రహాలు మాట్లాడుకోవడం ఎక్కడైనా చూశారా? ఇది కూడా చూసే ఉంటారు. అయితే ఇది సినిమాలో చూసి ఉంటారు.

The Idols in this temple speak to each other at night!

దేవుళ్లు సినిమాలో ఓ చిన్నపూజారి విజయవాడ కనకదుర్గమ్మకు ప్రసాదాన్ని నైవేద్యం సమర్పిస్తాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ తర్వాత పెద్ద పూజారి వచ్చి ఆ ప్రసాదం ఏది అని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్న పూజారి దుర్గమ్మకు మొత్తం పెట్టేశా అంటాడు. ఈ మాటలను నమ్మని పూజారి ఆ చిన్నపూజారిని చితకబాదటం మొదలు పెడతాయి. అయితే సరిగ్గా ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహం మాటలు వినబడతాయి. అంతే కాదు చేయి కడగమని చేయి కూడా ముందుకు పెడుతుంది. అప్పుడు ఆ పెద్ద పూజారి నిజం తెలుసుకుని క్షమించమని కోరుతాడు. అయితే మన దేశంలోని ఓ ఊరిలోని రాజ రాజేశ్వరి అమ్మవారి విగ్రహం మాట్లాడుతోందట. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి పరిశోధనలు కూడా జరిగాయట. అందులో కూడా అమ్మవారి విగ్రహాలు మాట్లాడటం నిజమేనని తేలిందంట.. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...

వివిధ ఆచారాలు...

వివిధ ఆచారాలు...

మన దేశంతో పాటు వివిధ దేశాల్లో భగవంతుడి విగ్రహాలను కేవలం రాళ్లతోనే కాదు వివిధ వస్తువులతోనూ తయారు చేస్తుంటారు. అయితే మన దేశంలోని దేవాలయాలలో ఎన్నో వివరించలేని రహస్యాలు ఉన్నాయి. వాటి వల్ల ఎన్నో అద్భుతాల జరుగుతున్నాయి. అయితే కొందరు ఇది విశ్వాసుల ప్రయోజనాల కోసమే అని కూడా అంటారు.

రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి..

రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి..

అది బీహార్ రాష్ట్రం. ఆ రాష్ట్రంలోని బస్టర్ లో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరీ దేవి ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయం దుర్గాదేవికి అంకితం చేయబడింది. అయితే ఇక్కడ వివిధ ఆచారాలు ఉన్నాయి.

వివిధ విగ్రహాలు..

వివిధ విగ్రహాలు..

త్రిగ, ధుమావతి, బాగులుకి, తారా, కాశీ, చిన్ ముస్తా, షఓదాసి, మాతంగి, కమలా, ఉగ్రా తారా, భువనేశ్వరితో సహా రాజేశ్వరి దేవత యొక్క వివిధ అవతారాల విగ్రహాలు ఉన్నాయి. 400 సంవత్సరాల క్రితం ఈ పురాతన ఆలయం నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అదే అద్భుతం..

అదే అద్భుతం..

ఈ ఆలయంలో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి విగ్రహం మినహా మిగతా విగ్రహాలన్నీ చీకటి పడితే చాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయట. రాత్రి వేళల్లో బతుకు బిహి, తారా, భాతుక్ భైరవ, దత్తాత్రేయ భైరవ, అన్నపూర్ణ భైరవ, కాలా భైరవ, ముంగాడి భైరవ విగ్రహాలు మాట్లాడుకుంటాయని స్థానికులు చెబుతున్నారు.

శాస్త్రవేత్తల ఆశ్చర్యం..

శాస్త్రవేత్తల ఆశ్చర్యం..

ఈ ఆలయంలో విగ్రహాలు మాట్లాడుకోవడం నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తల బృందం అక్కడ పర్యటించిందట. అక్కడ మానవ సంచారం లేనప్పుడు అక్కడి విగ్రహాలు ఒకదానికొకటి మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్పడం గమనార్హం.

ఇప్పటికీ మిస్టరీగానే...

ఇప్పటికీ మిస్టరీగానే...

అయితే విగ్రహాల మాటలు వినడానికి శాస్త్రవేత్తలకు తగినంత సమాచారం దొరకలేదని చెబుతున్నారు. అయితే ఇది ఆధ్యాత్మిక విషయం కాబట్టి ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఉదయం వేళ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండే ఈ దేవాలయంలో చీకటి పడితే చాలు అక్కడ అడుగు పెట్టడానికి కొందరు భయపడుతున్నారంట.

తాంత్రిక పూజలు..

తాంత్రిక పూజలు..

అయితే ఆ ఆలయంలో తాంత్రిక విద్యలు జరుగుతున్నాయని కొందరు చెబుతున్నారు. ఇలాంటివి రాజుల కాలం నుండి ఇప్పటివరకు నిరంతరంగా కొనసాగుతున్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. తాంత్రిక శక్తుల కోసం ఈ ఆలయాన్ని నిర్మంచిన నేపథ్యంలో ఈ దేవాలయంలో కలశం కూడా స్థాపించలేదని చెబుతున్నారు.

ఒకప్పుడు ఇళ్లవరకు...

ఒకప్పుడు ఇళ్లవరకు...

ఈ ఆలయం నిర్మించి రాజ కుటుంబీకులకు, స్థానిక ప్రజలకు చీకటి పడగానే ఒకప్పుడు ఏవేవో మాటలు వినిపించేవట. ఎంతో స్పష్టంగా వినిపించే ఆ మాటలను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదట. ఆ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయనేది కూడా చాలా మందికి తెలియలేదట. చాలా మంది ఆ ఆలయంలో పూజారులే మంత్రాలు చదువుతున్నారేమో అని ఊహించుకునేవారట. అయితే పూజారులను ఈ విషయం గురించి అడిగితే ఆ మాటలు తమవి కావని, తాళాలు వేసి బయటకు వచ్చిన తర్వాతే ఆ మాటలు బయటకు వినిపిస్తున్నాయని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో అప్పటి నుండి అమ్మవారి విగ్రహాలే మాట్లాడుతున్నారని ప్రచారం సాగుతోంది.

నోట్ : ఆలయ పూజారులు, స్థానికులు, వివిధ సైట్ల ఆధారంగా ఈ రహస్య కథనాన్ని అందించినట్లు మీరు గమనించాలి. మూఢ నమ్మకాలను ప్రచారం చేయడం అనే ఉద్దేశ్యంతో కాదని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి.

English summary

The Idols in this temple speak to each other at night!

Did You Know hear the Idols In This Temple Speak At Night Time! surprise right? have a look
Story first published: Thursday, December 12, 2019, 17:32 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more