For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భర్తలకు భార్యలు రక్షాబంధన్ కట్టొచ్చు, రాఖీ పౌర్ణమి వెనుక చాలా కథలున్నాయి, రాఖీ గురించి తెలుసుకోండి

ఇక భార్యలు కూడా భర్తలకు రాఖీ కట్టొచ్చు. అలాంటి కథ ఒకటి ఉంది. పూర్వం రాక్షసుల దేవతల్ని ముప్పు తిప్పలు పెట్టేవారు. దాదాపు పుష్కరకాలం పాటు రాక్షసులకు, దేవతలకు యుద్ధం సాగింది.రాఖీ పౌర్ణమి కథలు.

|

మనకు ఎన్ని పండుగలున్నా కూడా రాఖీ పౌర్ణమి మాత్రం చాలా స్పెషల్. దేశంలోని సోదరసోదరీమణులంతా కూడా ఎంతో శ్రద్ధగా చేసుకునేది ఈ పండుగ. రక్షా బంధన్ కు సంబంధించి చాలా కథలున్నాయి. అందులో ఒకటి ద్రౌపది, కృష్ణుడులకు సంబంధించిన కథ. ద్రౌపదిని నిండు సభలో కౌరవులు అవమానపరుస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా ఆమెకు అండగా నిలబడలేరు.

ఆ సందర్భంలో ఆమె కృష్ణుడి సాయం కోరుతుంది. శ్రీ కృష్ణుడు ఆ సమయంలో ఆమెకు అండగా నిలుస్తాడు. దాంతో ఆమె కృష్ణుడికి తర్వాత రాఖీ కడుతుంది. ఆ రోజునే మనం రాఖీ పండుగగా జరుపుకుంటామని ఒక కథ ఉంది.

నీకు ఏ వరం కావాలి

నీకు ఏ వరం కావాలి

అలాగే హయగ్రీవుడికి సంబంధించిన మరో కథ ఉంది. ఒక రాక్షసుడు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో ఆదిపరాశక్తి ప్రత్యక్షమవుతుంది. నీకు ఏ వరం కావాలో కోరుకోమంటుంది. తనకు మరణం రాకుండా ఉండాలని కోరిక కోరుతాడు. అది సాధ్యంకాదని అమ్మవారు చెబుతారు. అయితే మానవుల ద్వారా కాకుండా గుర్రం తల (హయగ్రీవ ఆకారం) ఉన్నవారి చేతిలో మాత్రమే మరణం ఉండేలా చూడమంటాడు. ఆ వరం అమ్మవారు ప్రసాదిస్తారు.

ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడతాడు

ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడతాడు

దీంతో రాక్షసుడు ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడతాడు. మొత్తానికి విష్ణువు గుర్రం తల ఉండే అవతారంలోకి మారుతాడు. ఆ రోజు శ్రావణపౌర్ణమి.

అదే రోజు విష్ణువు రాక్షసుడిని చంపేస్తాడు. దీంతో అదే రోజు హయగ్రీవుడి జయంతి కూడా జరుపుకుంటారు.

ఆయురాగ్యోలతో సుఖంగా ఉంటారు

ఆయురాగ్యోలతో సుఖంగా ఉంటారు

ఇక మరో కథ ప్రకారం.. ధర్మరాజు కృష్ణుడికి రక్షాబంధన్ గురించి ఒక కథ చెబుతాడు. రాఖీ కట్టడం వల్ల కలిగే ఉపయోగాలు వివరిస్తాడు. సోదరులు వారి సోదరీమణులతో రాఖీ కట్టించుకుంటే వారి ఆ ఏడాదంతా ఆయురాగ్యోలతో సుఖంగా ఉంటారని క్రిష్ణుడు చెబుతాడు. అందువల్ల కూడా ఈ పండుగ చేసుకుంటారట.

భార్యలు కూడా భర్తలకు రాఖీ కట్టొచ్చు

భార్యలు కూడా భర్తలకు రాఖీ కట్టొచ్చు

ఇక భార్యలు కూడా భర్తలకు రాఖీ కట్టొచ్చు. అలాంటి కథ ఒకటి ఉంది. పూర్వం రాక్షసుల దేవతల్ని ముప్పు తిప్పలు పెట్టేవారు. దాదాపు పుష్కరకాలం పాటు రాక్షసులకు, దేవతలకు యుద్ధం సాగింది. దేవేంద్రుడు నిత్యం వారిపై యుద్దాలు చేసినా ఓడిపోయేవాడు. అలాగే ఎన్నో పూజలు కూడా చేసేవాడు.

శ్రావణపూర్ణమి రోజు ఇంద్రుడికి ఆయన భార్య శచీదేవి రాఖీ కట్టి యుద్దానికి పంపుతుంది. ఆ రక్షాబంధనం వల్ల ఇంద్రుడు విజయం సాధిస్తాడు. అలా భర్తలకు కూడా భార్యలు రాఖీ కట్టే సంప్రదాయం ఒకటి ఉంది.

నరకం ఉండదు

నరకం ఉండదు

రాఖీ పౌర్ణమి రోజు సోదరీమణులతో రాఖీ కట్టించుకున్నవారికి నరకం ఉండదని యముడు స్వయంగా తన చెల్లెలు యమునకు మాటిచ్చాడు.

అలాగే పురుషోత్తముడికి అలెగ్జాండర్‌ భార్య రుక్సానా

రాఖీ కట్టి తన భర్త ప్రాణాలు కాపాడుకుందని ఒక కథనం ఉంది.

ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి

ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి

ఇక మరాఠా పాలకుడు పీష్వా బాజీరావు రాఖీ పౌర్ణమిని సమైక్య దినోత్సవంగా నిర్వహింపజేసేవాడు. ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి. ఏదీ ఏమైనా రక్షాబంధన్ అనేది చాలా ప్రత్యేకం. ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన ఈ పండుగ ఆగస్టు 26, 2018న రానుంది.

English summary

The stories behind the Raksha Bandhan Festival

The stories behind the Raksha Bandhan Festival
Desktop Bottom Promotion