For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీరాముడి వంశ చరిత్ర తెలుసా? సూర్యవంశంలో మొట్ట మొదటి వ్యక్తి చేసిన పాలన రామరాజ్యం కంటే గొప్పది

శ్రీరామచంద్రుడు దిలీపుడికి మునిమనువడు అవుతాడు. అది ఎలా అంటే.. శ్రీరాముడి తండ్రి దశరథడు అని మనకు తెలుసు. మరి దశరథుని తండ్రి అజుడు. అజుడు తండ్రి పేరు రఘుమహరాజ్. రఘుమహా రాజు తండ్రి పేరు దిలీపుడు.

|

మనకు గాంధీ, నెహ్రూ వంటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసు. వాళ్లు ఈ భూమి మీద పుట్టారని తెలుసు. వాళ్ల ఫొటోలు కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ భూమిపైనే ఇంతకంటే మంచి వారు, మంచి పాలకులు జన్మించారు. వాళ్ల గురించి మనకు ఎక్కువగా తెలియకపోవొచ్చు. పురాణాల్లో వారి గురించి వాళ్ల పరిపాలన గురించి చాలానే వివరించారు. అలాంటి వారిలో ఒకరే దిలీపుడు.

రాముడు దిలీపుడికి మునిమనువడు

రాముడు దిలీపుడికి మునిమనువడు

శ్రీరామచంద్రుడు దిలీపుడికి మునిమనువడు అవుతాడు. అది ఎలా అంటే.. శ్రీరాముడి తండ్రి దశరథడు అని మనకు తెలుసు. మరి దశరథుని తండ్రి అజుడు. అజుడు తండ్రి పేరు రఘుమహరాజ్. రఘుమహా రాజు తండ్రి పేరు దిలీపుడు. ఇది శ్రీరాముడి సూర్య వంశ చరిత్ర. సూర్య వంశానికే వెలుగు తెచ్చిన వాడు దిలీపుడు.

దిలీపుడు కంటే ముందే చాలా మంది రాజులు

దిలీపుడు కంటే ముందే చాలా మంది రాజులు

భూలోకం మొత్తానికి రాజుగా ఉండి తన మంచితనంతో మంచి చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు దిలీప మహారాజు. సూర్య వంశానికి చెందిన రాజుల గురించి మనకు తెలిసే ఉంటుంది. ఆ వంశానికి సంబంధించిన రాజుల్లో మొట్టమొదటి వారే దిలీపుడు. మరికొన్ని పురాణాల్లో దిలీపుడు కంటే ముందే చాలా మంది రాజులు సూర్యవంశంలో ఉన్నారని ఉంది. అయితే కాళి దాసు ప్రకారం దిలీపుడు సూర్యవంశంలో మొట్టమొదటి వాడు.

దిలీపుడు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు

దిలీపుడు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు

ఇప్పటికీ జనాల మదిలో దిలీపుడు ఉన్నాడంటే ఆయన బతికున్నంతకాలం అంత గొప్ప పరిపాలనా సాగించాడు. ఈయన అంశుమంతునుడి కుమారుడు. తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో దిలీపుడు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.

దిలీపుడికి తెలివి చాలా ఎక్కువగా ఉండేది. ప్రతి క్షణం ప్రజా సేవ గురించే ఆలోచించేవాడు దిలీపుడు. ఎప్పుడూ కూడా పక్షపాతం చూపేవాడు కాదు.

చదువు గురించి ప్రచారం

చదువు గురించి ప్రచారం

దిలీపుడు మగధ రాకుమారి అయిన సుదక్షిణను వివాహం చేసుకున్నాడు. భార్యను కంటిరెప్పలా చూసుకునేవాడు దిలీపుడు. చదువు గురించి అప్పట్లోనే దిలీపుడు ఎంతో ప్రచారం చేపట్టారు. ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేశాడు. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో కష్టాలు మాత్రం కచ్చితంగా ఉంటాయి. అలాగే దిలీపుడిని ఒక సమస్య వేధించింది. దిలీపుడు ఒక సారి ఒక గోవుకు నమస్కరించకుండా వెళ్లడం వల్ల శాపానికి గురవుతాడు.

భార్య సుదక్షిణతో కలిసి

భార్య సుదక్షిణతో కలిసి

దీంతో దిలీపుడికి పిల్లలు పుట్టలేదు. ఆయన కాస్త సతమతం అయ్యాడు. అయితే వశిష్టుడి సూచన మేరకు దిలీపుడు తన భార్య సుదక్షిణతో కలిసి నందిని ధేనువు ను పూజిస్తారు. అందుకోసం దిలీపుడు కొన్ని రోజుల రాజ్యాన్ని వదిలి ఒక ఆశ్రమంలో తన భార్యతో కలిసి ఉంటాడు. రోజూ నందిని ధేనువు బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. అయితే నందిని ధేనువు చాలా రకాలుగా దిలీపుడిని పరీక్షిస్తుంది. ఆ పరీక్షలన్నింటినీ జయిస్తాడు దిలీపుడు.

తనను తినమని ముందుకెళ్తాడు

తనను తినమని ముందుకెళ్తాడు

ఒక రోజు ఒక సింహం నందిని ధేనువుని తినడానికి వస్తుంది. అప్పుడు దిలీపుడు దానిపైకి బాణం ఎక్కుపెడతాడు. కానీ సింహం మనిషి మాదిరిగా మాట్లాడుతుంది. తనకు ఈ అడవిలో వేటాడి తినే హక్కు ఉందని అడ్డురాకని ఇందుకు శివుడి నుంచి కూడా తనకు అనుమతి ఉందని అంటుంది. అప్పుడు దిలీపుడు సరే నందిని ధేనువు బదులుగా తనను తినమని ముందుకెళ్తాడు. కాసేపటికి అక్కడి నుంచి సింహం మాయమవుతుంది. ధేనువు దిలీపుడి దగ్గరకు వెళ్లి తాను పెట్టిన అన్నీ పరీక్షలను మీరు విజయవంతంగా ఎదుర్కొన్నారని చెబుతుంది.

రఘు మహారాజు పుడతాడు

రఘు మహారాజు పుడతాడు

అప్పుడు దిలీపుడు దంపతులకు కుమారుడు పుడతాడు. అతనే రఘు మహారాజు. దిలీపుడు పరిపాలన తర్వాత ఆయనే రఘు మహారాజు పాలిస్తాడు. ఎంత అధికారం ఉన్నా కూడా సాధారణ మనిషిలాగానే ఉంటూ పరిపాలనా సాగించిన వ్యక్తి దిలీపుడు. దిలీపుడు ప్రతి పనిని ఒక ప్రణాళికతో చేసేవాడు.

అహం లేకుండా బతికాడు

అహం లేకుండా బతికాడు

దిలీపుడు గొప్ప వంశంలో జన్మించినా ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం గడిపినా కొంత కూడా అహం లేకుండా బతికాడు. ఇలాంటి చక్రవర్తులు పరిపాలించిన గడ్డ కాబట్టే మన భారతదేశానికి ఇప్పటికీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

సూర్య వంశంలో ఒక వెలుగు వెలిగిన దిలీపుడు ఈ విశ్వం ఉన్నంత వరకు చిరస్మరణీయుడే. సూర్యవంశంలో మొట్ట మొదటి వ్యక్తి అయిన దిలీపుడు చేసిన రాజ్య పాలన రామరాజ్యం కంటే చాలా గొప్పదిగా ఉండేది. దిలీపుడి తర్వాత రఘు మహారాజు పాలన కూడా గొప్పగా సాగింది. అందుకే శ్రీరాముడిని రఘువంశ రామయ్యా అంటారు.

English summary

The story of Dilipa Maharaja

The story of Dilipa Maharaja
Story first published:Thursday, August 23, 2018, 10:54 [IST]
Desktop Bottom Promotion