For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను నీ దాసిని నీ కోరిక తీరుస్తానని కీచకుడిని గదికి రప్పించుకున్న ద్రౌపది ఏం చేసిందో తెలుసా?

ఆ రోజు రాత్రి భీమున్ని కలిసి ద్రౌపది తనకు జరిగిన అవమానాన్ని చెబుతుంది. మన అజ్ఞాతవాసం బయటపడకుండా ఈ రాత్రికే కీచకున్ని చంపుతానని ద్రౌపదికి మాటిస్తాడు భీముడు. ద్రౌపది కీచకుడితో ప్రేమగా నటిస్తుంది.

|

కీచకుడు అనే పదాన్ని మనం ఇప్పటికీ రోజూ వార్తల్లో చూస్తూ ఉంటాం. పరమ చెడ్డవాడిగా కీచకుడు చరిత్రలో నిలిచిపోయాడు. కీచకుడికి వంద మంది అన్నదమ్ములుండేవారు. వారందరిలో కీచకుడు ఎక్కువ బలశాలి. అందుకే కీచకున్ని సింహ బలుడు అని అనేవారు. ఇతని బలం భీముడికి సమానంగా ఉండేది. కీచకుడు మత్స్య రాజ్యానికి రాజు. విరాట రాజుకు బామ్మర్ది.

విరాట రాజు భార్యకు స్వయాన తమ్ముడు. విరాట రాజు కూడా కీచకుడంటే భయపడేవాడు. అతను ఎలా చెబితే అలా వినేవాడు. కీచకుడి గురించి వినిపించే కథల్లో ప్రధానమైనది.. ద్రౌపదిపై కీచకుడు కన్నువేయడం... ఆమెను అనుభవించానుకోవడం.

ద్రౌపది మారువేషంలో పని చేస్తూ ఉంటుంది

ద్రౌపది మారువేషంలో పని చేస్తూ ఉంటుంది

పాండవులు అరణ్యవాసం పూర్తయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు.

అందరూ విరాటుడి రాజ్యంలో మారువేషంలో ఉంటూ తలో పని చేస్తూ ఉంటారు. ద్రౌపది కూడా మారువేషంలో సైరంధ్రి పేరుతో విరాటుడి ఇంట్లోనే పని చేస్తూ ఉంటుంది. ఒక రోజు అక్క దగ్గరకు వచ్చిన విరాటుడికి ద్రౌపది కంటపడుతుంది. ఆమెను ఎలా అయినా సరే అనుభవించాలనుకుంటాడు.

నా గదికి పంపు

నా గదికి పంపు

అక్క దగ్గరకు వెళ్లి ద్రౌపదిపై తనకున్న కోరికను చెబుతాడు. వద్దు తమ్ముడు.. ఆమెకు ఐదుగురు భర్తలు ఉన్నారు. వాళ్లంతా గంధర్వులు. ఎందుకు వచ్చిన తంటా అని నచ్చజెప్పింది. కానీ కీచకుడు అస్సలు వినడు. ఆమె ఎవరైతే నాకేంటీ.. ఇప్పుడు ఆమె మన దగ్గర పని చేసే ఆవిడే కదా. నువ్వు ఒక్కసారి నా గదికి తనను పంపు మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు. కీచకుడి అక్క కూడా ఏమీ మాట్లాడలేకపోయింది.

మద్యం తీసుకురా

మద్యం తీసుకురా

దీంతో కీచకుడి అక్క అయిన సుధేష్ణ మారువేషంలో ద్రౌపదిని తన తమ్ముడి గదిలో ఉండే మద్యాన్ని తీసుకురమ్మని ఆదేశిస్తుంది. అందుకు ద్రౌపది అంగీకరించదు. కానీ బలవంతంగా పంపిస్తుంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కీచకుడు ద్రౌపదిని అనుభవించాలని పరితపిస్తాడు. ఆమెను బలత్కారం చేస్తాడు.

కీచకుడు ద్రౌపదిని కాలితో తంతాడు

కీచకుడు ద్రౌపదిని కాలితో తంతాడు

తర్వాత ఆమె అతన్ని తప్పించుకుని విరాటుడి సభ వరకు పరుగెత్తుకుని వస్తుంది. కానీ విరాటుడు కూడా ఏం చెయ్యలేకపోతాడు. సభలోనే కీచకుడు ద్రౌపదిని కాలితో తంతాడు. నానా మాటలు అంటాడు. అక్కడే ఉన్న ధర్మరాజు అవన్నీ మౌనంగా వింటాడు. ఆ సమయంలో పాండవులు ఆగ్రహం చూపితే వారి అజ్ఞాతవాసం బయట పడుతుంది. అందుకే నిగ్రహంతో ఉంటారు.

నీ కోరిక తీరుస్తాను

నీ కోరిక తీరుస్తాను

ఆ రోజు రాత్రి భీమున్ని కలిసి ద్రౌపది తనకు జరిగిన అవమానాన్ని చెబుతుంది. మన అజ్ఞాతవాసం బయటపడకుండా ఈ రాత్రికే కీచకున్ని చంపుతానని ద్రౌపదికి మాటిస్తాడు భీముడు. ద్రౌపది కీచకుడితో ప్రేమగా నటిస్తుంది. అయినా నువ్వు రాజువు.. నేను నీ దగ్గర పని చేసేదాన్ని... నీ కోరిక తీరుస్తాను. ఈ రోజు రాత్రి కలుద్దాం అని ద్రౌపది కీచకుడితో అంటుంది.

బాగా ముస్తాబై రాత్రి గదికి వెళ్తాడు

బాగా ముస్తాబై రాత్రి గదికి వెళ్తాడు

ఇక కీచకుడి బాగా ముస్తాబై రాత్రి గదికి వెళ్తాడు. అక్కడ ముసుగేసుకుని భీముడు నిద్రపోతుంటాడు. కీచకుడి ఆశతో చెయ్యి వేస్తాడు. చూస్తే భీముడుంటాడు. కీచకున్ని పిడి గుద్దులతో చంపేస్తాడు భీముడు. ఎవ్వరికీ తెలియకుండా మట్టుబెట్టి వచ్చేస్తాడు భీముడు.

కీచకుడికి పట్టిన గతే పడుతుంది

కీచకుడికి పట్టిన గతే పడుతుంది

కామంతో రగిలిపోతూ ఎవర్ని పడితే వాళ్లను అనుభవించాలనుకునేవాళ్లను ఇప్పటికీ కీచకుడితో పోల్చుతారు. అలాంటి వారికి ఎప్పుడైనా సరే కీచకుడికి పట్టిన గతే పడుతుంది.

English summary

The story of Keechak Vadha

Kichaka was brother of King Virata's wife. Pandavas took refuge in Virat's kingdom to spend their one year in exile in secrecy. But Bhima killed Kichaka
Desktop Bottom Promotion