For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేనక వచ్చి ఒళ్లో వాలగానే విశ్వామిత్రుడు తట్టుకోలేకపోయాడు, కమిట్ అయ్యాడు, కథ మారిపోయింది

విశ్వామిత్రుడు తపస్సు చేసే ప్రదేశానికి దగ్గర్లోనే ఒక సరస్సు ఉంటుంది. అందులోకి దిగి జలకాలాటలు ఆడుతూ ఉంటుంది మేనక. ఆ శబ్దానికి కాస్త డిస్ట్రబ్ అవుతాడు విశ్వామిత్రుడు.మేనక వచ్చి ఒళ్లో వాలగానే.

|

విశ్వామిత్రుడు మొదట ఒక రాకుమారుడు. తర్వాత వశిష్టుడి వల్ల అవమానానికి గురై విశ్వరథుడుగా ఉన్న యువరాజు తప్పస్సు చేసి విశ్వామిత్రుడిగా మారుతాడు. అయితే విశ్వామిత్రుడు తపస్సు చేసేటప్పుడు మేనక ఎందుకు వచ్చింది. మేనక విశ్వామిత్రుడిని ఏ విధంగా పరీక్షించిందో తెలుసా?

విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేశాడు. దాదాపు వెయ్యేళ్ల పాటు చేసిన విశ్వామిత్రుడి తపస్సు చివరకు ఫలించింది. మొత్తానికి బ్రహ్మ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. విశ్వరథుడా... నువ్వు ఇప్పుడు పెద్ద రుషివి అని బ్రహ్మ చెప్పాడు. విశ్వారథుని నుంచి నువ్వు విశ్వామిత్రుడిగా మారావు అని చెప్పి బ్రహ్మ అదృశ్యమైపోయాడు.

విశ్వరథుడు అనే రాకుమారుడు విశ్వామిత్రుడిలా ఎలా మారాడు, విశ్వామిత్రుడు ఎలా విర్రవీగేవాడో తెలుసా?విశ్వరథుడు అనే రాకుమారుడు విశ్వామిత్రుడిలా ఎలా మారాడు, విశ్వామిత్రుడు ఎలా విర్రవీగేవాడో తెలుసా?

బ్రహ్మ వెళ్లిపోవడం విశ్వామిత్రుడికి నచ్చలేదు

బ్రహ్మ వెళ్లిపోవడం విశ్వామిత్రుడికి నచ్చలేదు

అయితే అలా అంసంపూర్తిగా తనను వదిలేసి బ్రహ్మ వెళ్లిపోవడం విశ్వామిత్రుడికి నచ్చలేదు. అందుకే మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు. అయితే విశ్వామిత్రుడు మళ్లీ తపస్సు చేస్తే ఈ సారి బ్రహ్మ ప్రత్యక్షమైతే ఏ కోరిక కోరుతాడో అని దేవతలకు భయం పట్టుకుంది. కచ్చితంగా విశ్వామిత్రుడు ఈ విశ్వంలోనే జగజ్జేతగా నిలిచే అవకాశం ఉంటుంది. దేవతలంతా కూడా విశ్వామిత్రుడి తపస్సుకు చాలా భయపడ్డారు.

మేనకను పంపారు

మేనకను పంపారు

అందుకే విశ్వామిత్రుడి తపస్సును భంగం చేసేందుకు దేవలోకం నుంచి మేనకను పంపారు. మేనక ద్వారా ఎలా అయినా విశ్వామిత్రుడి తపస్సును అడ్డుకోవాలనుకున్నారు. తన సొగసుతో ఎలా అయిన సరే మేనక విశ్వామిత్రుడి తపస్సును భగ్నం చేయాలనుకుంటుంది.

జలకాలాటలు ఆడుతూ ఉంటుంది

జలకాలాటలు ఆడుతూ ఉంటుంది

విశ్వామిత్రుడు తపస్సు చేసే ప్రదేశానికి దగ్గర్లోనే ఒక సరస్సు ఉంటుంది. అందులోకి దిగి జలకాలాటలు ఆడుతూ ఉంటుంది మేనక. ఆ శబ్దానికి కాస్త డిస్ట్రబ్ అవుతాడు విశ్వామిత్రుడు. సరస్సులో నుంచి తుంపరలు వచ్చి విశ్వామిత్రుడిపై పడుతుంటాయి. దీంతో విశ్వామిత్రుడు అలజడికి గురవుతాడు.

ఏదో తెలియని గాలి అతన్ని గిలిగింతలుపెడుతూ ఉంటుంది. అప్పటికే ఒక పెద్ద మహర్షిగా మారిన విశ్వామిత్రుడు కూడా ఆ ఆడవాసనకు తట్టుకోలేకపోతాడు. ఎంత నిగ్రహంతో ఉందామన్నా ఉండలేకపోతాడు. తర్వాత కళ్లు తెరిచి చూస్తాడు.

మేనకతో సరసాలాడుతూ గడిపాడు

మేనకతో సరసాలాడుతూ గడిపాడు

మేనక అందాన్ని చూసి ఉబ్బితబ్బిపోతాడు. అస్సలు తట్టుకోలేకపోతాడు. తపస్సు గిపస్సు అన్నీ పక్కన పెట్టి మేనక అందాన్ని చూస్తూ కూర్చొన్నాడు. మేనక దగ్గరకు వెళ్లి తన మనస్సులో కోరిక చెప్పాడు. ఆమె విశ్వామిత్రుడి కోరికను అంగీకరించింది. ఇక మేనక వచ్చి ఒళ్లో వాలగానే విశ్వామిత్రుడు తట్టుకోలేకపోయాడు, కమిట్ అయ్యాడు, దీంతో కథ అడ్డంతిరిగింది. ఇక రోజూ మేనకతో సరసాలాడుతూ గడిపాడు. ఈ లోకంలో ఏం జరుగుతుందో తనకు అవసరం లేదు.. మేనక ఉంటే చాలు అనుకున్నాడు విశ్వామిత్రుడు.

పదేళ్లు సరసాలతోనే గడిపాడు విశ్వామిత్రుడు

పదేళ్లు సరసాలతోనే గడిపాడు విశ్వామిత్రుడు

అలా మేనకతో పదేళ్లు సరసాలతోనే గడిపాడు విశ్వామిత్రుడు. తర్వాత అసలు విషయం తెలుసుకున్నాడు. తాను మేనక మాయలో పడి ఉండకుంటే కచ్చితంగా పెద్ద మహర్షిని అయ్యేవాడనని తెలుసుకున్నాడు. కామాన్ని నిగ్రహించుకోలేకపోవడం వల్లే తాను పెద్ద మహర్షిని కాలేకపోయానని తెలుసుకుంటాడు విశ్వామిత్రుడు. తర్వాత మేనకను విడిచి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేశాడు.

కామాన్ని నిగ్రహించుకునేందుకు చాలా ఏళ్లు తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. తాను ఇంద్రియాలను జయించానా అని అడుగుతాడు విశ్వామిత్రుడు. లేదు నీకు ఇంకా ఆ కోరికలున్నాయి. నువ్వు ఇంకా దాని కోసం తపస్సు చేయాలని బ్రహ్మ చెప్పి మాయం అవుతాడు.

ఒంటికాలిపై నిలబడి తపస్సు ప్రారంభించాడు

ఒంటికాలిపై నిలబడి తపస్సు ప్రారంభించాడు

ఇక విశ్వామిత్రుడు ఈసారి ఆషామాషీగా తపస్సు చేస్తే ఫలితం లేదనుకున్నాడు. ఒంటికాలిపై నిలబడి తపస్సు ప్రారంభించాడు. వానలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, చలిలో వణుకుతూ గాలినే ఆహారంగా స్వీకరిస్తూ ఘోర తపస్సు చేశాడు. దీంతో దేవతలందరికీ భయం పట్టుకుంది. ఈసారి విశ్వామిత్రుడు కచ్చితంగా తన లక్ష్యాన్ని సాధించేటట్లున్నాడు అనుకుంటారు అంతా.

దీంతో దేవేంద్రుడు ఆ తపస్సు భగ్నం చేసేందుకు రంభను బరిలోకి దింపుతాడు. అయితే విశ్వామిత్రుడికి అసలు విషయం తెలిసిపోతుంది. రంభను శపిస్తాడు. శిలగా మారిపోతుంది. ఇలా వందలాది సమస్యలను ఎదుర్కొన్నాడు విశ్వామిత్రుడు.

English summary

the story of sage vishwamitra and apsara menaka

the story of sage vishwamitra and apsara menaka
Desktop Bottom Promotion