Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఈ పూజా సామాన్లను ఇంట్లోంచి వదిలించుకోకపోతే దురదృష్టం వెంటాడుతుంది
ఈ పూజా సామాన్లను ఇంట్లోంచి వదిలించుకోకపోతే దురదృష్టం వెంటాడుతుంది
ఇంట్లోని పూజగదిలో ఉండే పూజా సామాన్లన్నీ అదృష్టాన్ని తెచ్చి పెడతాయని భావించకూడదు. కొన్నిటి వలన దురదృష్టం వెంటాడే ప్రమాదం ఉంది. అటువంటి పూజా సామాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ మతంలో దైవాన్ని విగ్రహ రూపంలో పూజించడం జరుగుతుంది. అందువలన, హిందువులు తమ ఇంట్లో పూజ చేయడం కోసం ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించుకుంటారు. దైవంతో అనుసంధానం ఏర్పరచుకునేందుకు పూజ గదిని ప్రత్యేకంగా నిర్మించుకుంటారు. ఐతే, పూజ గదిలో కొన్ని రకాల వస్తువులను ఉంచడం వలన దురదృష్టం వెంటాడే ప్రమాదం ఉంది. నిజానికి, కొన్ని దేవుళ్ళ ఫొటోస్ కూడా ఇంట్లోకి నెగటివ్ వైబ్స్ ను తీసుకువస్తాయి.
శాస్త్రాలలో వెల్లడించిన విషయాల గురించి చాలా మందికి అవగాహన లేదు. అందువలన, ఇంట్లోని పెట్టుకోకూడని పూజా సామాన్లను తెచ్చుకుంటారు.
అటువంటి పూజా సామాన్లు మీ ఇంట్లో ఉన్నాయా? అయితే, వాటి గురించి తెలుసుకోండి మరి.

వినాయకుడికి చెందిన మూడు ప్రతిమలను పూజ గదిలో ఉంచకూడదు.
వినాయకుడికి చెందిన మూడు ప్రతిమలను పూజ గదిలో ఉంచకూడదు. అలా చేయడం వలన పూజ గది నెగటివ్ వైబ్స్ ని ఆకర్షిస్తుంది. ఇంట్లోని ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటుంది.

ఇంట్లోని శివలింగాన్ని ఉంచకూడదు.
ఇంట్లోని శివలింగాన్ని ఉంచకూడదు. కొన్ని సార్లు రోజూ స్నానం చేయడం కుదరకపోవచ్చు. అటువంటప్పుడు శివలింగాన్ని పూజించడం కుదరదు. అందువలన, మహా శివుడికి ఆగ్రహం వచ్చే ప్రమాదం ఉంది. అందువలన, శివలింగాలు గుళ్ళలోనే ఉండటం శ్రేయస్కరం.

ఒకే దేవుడికి చెందిన (ముఖ్యంగా దుర్గా దేవికి చెందిన) మూడు ప్రతిమలు
ఒకే దేవుడికి చెందిన (ముఖ్యంగా దుర్గా దేవికి చెందిన) మూడు ప్రతిమలను పూజ గదిలో ఉంచకూడదు. దీని వలన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది.

రాధాకృష్ణులు అలాగే రుక్మిణీ కృష్ణుల లేదా మీరా ప్రతిమలను ఇంట్లో ఉంచకూడదు
రాధాకృష్ణులు అలాగే రుక్మిణీ కృష్ణుల లేదా మీరా ప్రతిమలను ఇంట్లో ఉంచకూడదు. అలాగే ఇద్దరి భార్యలతో ఉన్న గణేషుడి ప్రతిమ కూడా ఇంట్లో ఉండకూడదు. ఎందుకంటే, వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

పూజా సమయంలో దేవుడిని తాజా పూలతో సేవించాలి
పూజా సమయంలో దేవుడిని తాజా పూలతో సేవించాలి. ఆ మరుసటి రోజు వాడిన పూలను తొలిగించాలి. కానీ, చాలా మంది వాడిన పూలను తొలగించడం మరచిపోతారు. కొన్ని రోజుల పాటు అవి అలాగే ఉంటాయి. వాటిని అలాగే ఉంచి పూజలు చేసేస్తూ ఉంటారు. ఇది శుభకరం కాదు.

విరిగిన ప్రతిమలను
విరిగిన ప్రతిమలను ఇంట్లో ఉంచకూడదు. పూజలో వాడకూడదు. ఇది పేదరికానికి చిహ్నం.

చనిపోయిన తులసి మొక్క
చనిపోయిన తులసి మొక్కను ఇంట్లో ఉంచకూడదు. తులసి మొక్క చనిపోగానే (సాధారణంగా విపరీతమైన చలికాలంలో ఇలా జరుగుతుంది) దాన్ని తీసి నదిలో గాని లేదా కొలనులో గాని వేయాలి. కొత్త మొక్కను తీసుకొచ్చి ఇంట్లో అమర్చాలి.

విరిగిపోయిన దేవుడి ప్రతిమలను
విరిగిపోయిన దేవుడి ప్రతిమలను లేదా చిరిగిపోయిన దేవుడి ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు. అటువంటి వాటిని పూజించకూడదు.
కారణం, విరిగిపోయిన ప్రతిమ వలన భక్తుడు ఏకాగ్రతతో దైవాన్ని పూజించలేదు. తరచూ, డిస్ట్రాక్ట్ అవుతాడు. ఏకాగ్రత లేని ప్రార్థన ఫలించదు.

గుడ్లగూబపై ఆసీనురాలైన లక్ష్మీ ప్రతిమను ఇంట్లో ఉంచకూడను.
గుడ్లగూబపై ఆసీనురాలైన లక్ష్మీ ప్రతిమను ఇంట్లో ఉంచకూడను. ఇలాంటి ప్రతిమ ఇంట్లో ఉండటం వలన ఇంట్లో లక్ష్మీ దేవి నిలువదు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.



Click it and Unblock the Notifications
